రవాణా కుదేల్‌! | Demonetization hits transport industry | Sakshi
Sakshi News home page

రవాణా కుదేల్‌!

Published Sun, Nov 27 2016 11:24 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

రవాణా కుదేల్‌! - Sakshi

రవాణా కుదేల్‌!

  • నోట్ల రద్దుతో 50 శాతానికి పైగా పడిపోయిన ట్రాన్స్‌పోర్ట్‌   
  • పార్కింగ్‌లకే పరిమితమైన గూడ్స్‌ వాహనాలు
  • తిరిగే వాహనాలకు చిల్లర ఇబ్బందులు
  •  రోజుకు రూ.2 కోట్లు దాటని వ్యాపారం
  • లబోదిబోమంటున్న వాహన యజమానులు
  • నెల్లూరు (టౌన్‌)
    కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్లు రద్దు నిర్ణయం రవాణా రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. అసలే బాడుగలు లేక  అరకొరగా తిరుగుతున్న పలు రకాల గూడ్సు వాహనాలు పెద్దనోట్లు రద్దుతో పార్కింగ్‌లకే పరిమితమయ్యాయి. డీజిల్, రోడ్డు ఖర్చు, ఆటోమొబైల్‌ పరికరాలను కొనేందుకు డబ్బులు లేక వాహన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా తగ్గిపోవడంతో డ్రైవర్లు, క్లీనర్లకు ఉపాధి కరువైంది. ఓ పక్క ఫైనాన్స్‌కు వాయిదాలు కట్టలేని పరిస్థితి కూడా ఉందని యజమానులు వాపోతున్నారు. ఇదే పరిస్ధితి మరి కొన్ని రోజులు ఉంటే రవాణా రంగం పూర్తిగా దెబ్బతింటుందని చెబుతున్నారు.
    రవాణా రంగానికి జిల్లా అనుకూలంగా ఉండడటంతో పలువురు ట్రాన్ప్‌పోర్టును ఎంచుకున్నారు. కృష్ణపట్నం పోర్టుతో పాటు జిల్లాలో లభ్యమయ్యే ధాన్యం, సిలికా, ఇసుక, ఇనుము, ఎడిబుల్‌ ఆయిల్, గ్రావెల్, క్వార్ట్‌›్జ, పార్శిల్స్‌ తదితర వాటిని వాహనాల ద్వార ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. జిల్లాలో చిన్న, పెద్దవి కలుపుకుని సుమారు 1,30వేల గూడ్సు వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల ద్వార రోజుకు సుమారు రూ. 5కోట్లు మేర ఆదాయం వస్తుందని వాహనాల యజమానులు చెబుతున్నారు. రవాణా రంగంపై ప్రత్యక్షంగా 2 లక్షలకు పైగా పరోక్షంగా 10లక్షలకు పైగా ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.500,1000ల నోట్లను రద్దు చేస్తూ ఈనెల 8న నిర్ణయం తీసుకుంది. అదే రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుందని ప్రకటన చేయడంతో రవాణా రంగానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. 
    పార్కింగ్‌లకే పరిమితమైన వాహనాలు
    పెద్దనోట్టు రద్దుతో జిల్లాలో సగానికి పైగా వాహనాలు పార్కింగ్‌లకే పరిమితమయ్యాయి. సరుకులు తీసుకుని ఇతర రాష్ట్రాలకు వెళితే అక్కడ పెద్ద నోట్లు ఇస్తున్నారన్నారు. కొన్ని రంగాల్లో పూర్తిగా ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయంటున్నారు. జిల్లాలో రవాణా రంగంలో రోజుకు రూ. 5కోట్లుకు పైగా వ్యాపారం జరుగుతుందంటున్నారు. అది రూ.2 కోట్లుకు పడిపోయిందన్నారు. ఓ పక్క ఫైనాన్స్‌ నిర్వాహకులు, ఇన్సూరెన్స్‌ నిర్వాహకులు  ఇండ్లకు వచ్చి డబ్బులు చెల్లించాలని గొడవలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనీ రోటేషన్‌ పూర్తిగా ఆగిపోవడంతో వర్కర్స్‌కు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కనీసం డీజిల్, రోడ్డు ఖర్చులు, భోజనం తినేందుకు చిల్లర లేక డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌ కంపెనీలకు చెల్లించే మొత్తాలను వడ్డీలేకుండా రెండు నెలల తరువాత చెల్లించే వెసులుబాటు కల్పించాలని  వాహన యజమానులు కోరుతున్నారు. 
     
     ఆర్థికశాఖ మంత్రికి లేఖ రాశాం – గోపాలనాయుడు, ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు 
    కేంద్రప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించకుండా పెద్దనోట్లను రద్దు చేసింది. ఈ ప్రభావం రవాణా రంగంపై ప్రభావం చూపుతోంది. ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌లను వడ్డీ లేకుండా చెల్లించేందుకు రెండు నెలలు పాటు వెసలుబాటు కల్పించాలని కేంద్ర ఆర్ధికశాఖామంత్రికి లేఖ రాశాం.
     
    బాడుగలు లేక ఇబ్బందులు - చెరుకూరు శ్రీనివాసులు, లారీ ట్రాన్స్‌పోర్ట్‌ యజమాని
    పెద్దనోట్టు రద్దుతో బాడుగలు పూర్తిగా తగ్గిపోయాయి. అరకొర లోడు దొరికినా చిల్లర కోసం ఇబ్బందులు పడుతున్నాం. సరుకులు దిగుమతి చేస్తే పెద్దనోట్లును మాత్రమే ఇస్తున్నారు.
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement