డెంగీ ప్రాణాంతక వ్యాధి కాదు
ఉయ్యూరు :
మలేరియా, డెంగీ ప్రాణాంతక వ్యాధులు కాదని డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరి అన్నా రు. ప్రభుత్వాస్పత్రిని శనివారం ఆమె సందర్శించారు. దోమలపై దండయాత్ర, దోమల నివారణ చర్యలు, వైరల్ జ్వరాలపై సమీక్షించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పగటి దోమలతోనే డెంగీ వ్యాప్తి చెందుతుందన్నారు. జిల్లాలో 120 డెంగీ కేసులు, 370 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. జ్వరం వస్తే ఆరోగ్య ఉప కేంద్రం, పీహెచ్‌సీలో వైద్యుల్ని సంప్రదించాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. వైద్యులు బాలకృష్ణ, శోభ పాల్గొన్నారు.