జిల్లాలోని అన్ని ఆశ్రమ పాఠశా–లల్లో డిజిటల్ బోధనకు రంగం సిద్ధం చేస్తున్నారు. పాఠ్యాంశాల బోధన కంటే దృశ్య రూపంలోనే విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని నిర్ణయించిన ఐటీడీఏ అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని ఆశ్రమాల్లో ఈ బోధన జరుగుతుండగా మిగిలిన వాటిలో కూడా ఈ తరగతులను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సీతంపేట :
జిల్లాలో ఆశ్రమ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో డిజిటల్ బోధనకు శ్రీకారం చుడుతున్నారు. దీనిలో భాగంగా ఆ దిశగా ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎర్నెట్ సంస్థ ద్వారా 20 ఆశ్రమ పాఠశాలల్లో బోధన జరుగుతుండగా మరో నాలుగు గురుకులాల్లో డిజిటల్ బోధన చేస్తున్నారు. అయితే 27 పాఠశాలల్లో నూతనంగా డిజిటల్ బోధన చేయడానికి కేయాన్ సంస్థ ద్వారా విద్యను అందించనున్నారు. ఇప్పటికే కంప్యూటర్లను అమర్చేందుకు రంగం చేస్తున్నారు. ఐటీడీఏ పీవో ఎల్.శివశంకర్ ఇటీవల స్థానిక గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ డిజిటల్ బోధన చూసిన అనంతరం అన్ని పాఠశాలల్లో దీన్ని అమలు చేస్తామని తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
దృశ్య రూపంలో పాఠ్య బోధన..
పదిసార్లు విన్న దాని కంటే ఒక్కసారి చూస్తే ఆ దృశ్యం మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. ప్రతీ రోజూ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విన్న అనంతరం విద్యార్థులు దానిని మననం చేసుకుంటారు. అదే పాఠాన్ని దృశ్య రూపంలో విద్యార్థులకు చూపిస్తే ఎన్నటికీ గుర్తుండిపోతుంది. పరీక్షల్లో జవాబులనూ జ్ఞాపకశక్తి, అవగాహనతో రాయగలుగుతారు. పాఠాలను దృశ్య రూపంలో చూపించే యత్నమే డిజిటల్ విద్యా తరగతులు. పాఠ్యాంశాల్లో ఉన్న అంశాలను ప్రాజెక్టర్ ద్వారా దృశ్య రూపంలో విద్యార్థులు తెరపైన చూస్తారు. ప్రతీ పాఠానికి సంబంధించిన సీడీల ద్వారా దృశ్య బోధన ఉంటుంది. సాధారణ బోధనలో విజ్ఞాన పాఠాలు, అంతరిక్షం, వివిధ ప్రయోగాలు చూడడం ద్వారా విద్యార్థి మదిలో ఆ విషయాలు నిక్షిప్తమౌతాయి. అనుమానాల నివృత్తికి అవకాశం ఉంటుంది. వెనుకబడిన విద్యార్థులకు ఈ బోధన ఎంతో ప్రయోజనం.
డిజిటల్ బోధనపై మొగ్గు!
Published Thu, Jan 12 2017 3:02 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
Advertisement
Advertisement