Digital teaching
-
తలరాతలు తిరగరాస్తూ..
14 ఏళ్లు, మూడు దఫాలు సీఎంగా ఉన్న చంద్రబాబు పేద పిల్లలకు చేసిన మంచి ఏమిటి? వారి భవిష్యత్తు మార్చాలని మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా చూపించారా? ఆయన చేసిన మంచేమిటి అంటే ఏ ఒక్కరికీ ఏదీ గుర్తురాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే విద్యారంగానికి చేసిన చెడు గురించి మాత్రం చాలా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ బడిని నీరుగార్చి నారాయణ, చైతన్య సంస్థల్ని పోషించింది చంద్రబాబు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లిష్ మీడియం, గవర్నమెంట్ బడుల్లో మాత్రం తెలుగు మీడియం అని నిర్దేశించింది చంద్ర బాబు. మంచి చేయడానికి మీ బిడ్డ, మీ అన్న నాలుగు అడుగులు ముందుకేస్తే 8 అడుగులు వెనక్కు లాగాలని ప్రయత్నిస్తున్న మారీచులతో యుద్ధం చేస్తున్నాం. వాళ్లు చేస్తున్న యుద్ధం కేవలం జగన్‌తో కాదు! జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, పిల్లాడు ఆలోచన చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా, తరతరాల తలరాతలను మార్చాలని గత 57 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేగంగా ముందుకు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఒక్క చదువులతోనే పేదరికాన్ని అధిగమించడం సాధ్యమని బలంగా విశ్వసించి విద్యారంగాన్ని సమూలంగా సంస్కరించినట్లు చెప్పారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, నాడు–నేడు తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా పేదల ఉన్నత చదువులకు భరోసా కల్పించామన్నారు. ప్రభుత్వ టీచర్లకు చెల్లించే జీతభత్యాలు కాకుండా పేద పిల్లలు చదువుకునేలా ప్రోత్సహిస్తూ వివిధ పథకాలు, సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దేందుకు ఏకంగా రూ.73 వేల కోట్లకుపైగా వ్యయం చేసినట్లు వెల్లడించారు. పేదింటి బిడ్డల ఉన్నత చదువులకోసం ఇంతగా పరితపిస్తుంటే పెత్తందారులైన దుష్ట చతుష్టయానికి కంటగింపుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 2023 అక్టోబరు–డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9,44,666 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ రూ.708.68 కోట్లను సీఎం జగన్ శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఐదేళ్లుగా విద్యారంగ పురోభివృద్ధి కోసం తీసుకున్న విప్లవాత్మక చర్యలను వివరించారు. పెద్ద చదువులు చదివే 93 శాతం పిల్లలకు లబ్ది.. తరతరాల పేదరికం సంకెళ్లను తెంచేస్తూ పెద్ద చదువులు అనే పునాదులపై ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు దోహదం చేసే గొప్ప కార్యక్రమం ఈరోజు పామర్రు నుంచి జరుగుతోంది. వంద శాతం ఫీజులను పిల్లల తల్లులకే అందచేసి వారి ద్వారా కాలేజీలకు చెల్లించే జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా అమలు చేస్తున్నాం. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా ఆ తల్లుల ఖాతాలకు ఫీజుల మొత్తాన్ని జమ చేయడం కొనసాగిస్తూ వచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న 9.45 లక్షల మంది పిల్లలకు అంటే ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పూర్తి ఫీజులను మీ జగనన్న ప్రభుత్వమే చెల్లిస్తోంది. గతానికి, ఇప్పటికి మధ్య తేడాను ఆలోచించమని కోరుతున్నా. ఆదాయ పరిమితిని పెంచాం.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత మంది పిల్లలు బాగా చదివి బాగుపడాలని ఆరాట పడ్డాం. ఏ పేదవాడూ తన పిల్లల చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే తపనతో ఆదాయ పరిమితిని పెంచాం. గతంలో రూ.లక్షకే పరిమితమైన ఆదాయ పరిమితిని ఏకంగా రూ.2.5 లక్షలకు పెంచి 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలిగాం. ఫీజులు ఇంతే కడతాం! ఇంతకన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు అమ్ముకోండి! మీ చావు మీరు చావండనే గత ప్రభుత్వ విధానాలకు పూర్తిగా స్వస్తి పలికాం. తల్లిదండ్రులు ఎవరూ ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజులు కట్టే కార్యక్రమాన్ని మన భుజ స్కంధాలపై వేసుకున్నాం. త్రైమాసికం ముగిసిన వెంటనే తల్లుల ఖాతాల్లోకి ఫీజులు జమ చేస్తూ కాలేజీలకు అందచేసే గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం. పిల్లలకు పూర్తి ఫీజులు చెల్లించే విద్యా దీవెనే కాకుండా ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి అమలు చేస్తున్నాం. తాజాగా అందిస్తున్న రూ.708 కోట్లతో కలిపి ఇప్పటిదాకా 29.66 లక్షల మందికి పిల్లలకు మంచి చేస్తూ జగనన్న విద్యాదీవెన అనే ఒక్క కార్యక్రమం ద్వారానే రూ.12,609 కోట్లు తల్లులకు అందచేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లల భోజనం, వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో రూ.4,275 కోట్లు ఉంటుంది. వచ్చే ఏప్రిల్‌లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో రూ.1,100 కోట్లు కూడా కలిపితే విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా వెచ్చిస్తున్న సొమ్ము ఏకంగా దాదాపు రూ.18 వేల కోట్లు అవుతుంది. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుండాలనే సంకల్పంతో ప్రతి అడుగూ వేస్తూ వచ్చాం. మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చింది. హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్.. ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యారంగంలో వివిధ పథకాలు, కార్యక్రమాల కోసం 57 నెలల వ్యవధిలో రూ.73 వేల కోట్లు వ్యయం చేశాం. గవర్నమెంట్ టీచర్లకు ఇచ్చే జీతాల వ్యయం దీనికి అదనం. ఇదంతా పేద, మధ్య తరగతి కుటుంబాల మెరుగైన జీవితం కోసం మనం చేసిన హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. పేద కుటుంబాల్లో ప్రతి పాపా, ప్రతి బాబు గొప్ప చదువులతో ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు, పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా ఎదిగి ఆ కుటుంబాల తలరాతలు మారాలని, భవిష్యత్ బాగుండాలనే తపనతో అడుగులు వేస్తూ వచ్చాం. మన విద్యా విధానంలో మీ అన్న ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఎలాంటి మార్పులు చేసింది? దానివల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? అనేది ఒకసారి అందరూ గమనించాలని కోరుతున్నా. మన విద్యార్థులు రేపు ప్రపంచంతో పోటీ పడాల్సి ఉంటుంది. గత 30 ఏళ్లలో టెక్నాలజీ ఎంతో మారిపోయింది. ఆధునిక చదువులకు అనుగుణంగా మన విద్యా విధానాలను సంస్కరిస్తూ మెరుగైన పద్ధతులు, టెక్నాలజీని మన ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు అందుబాటులోకి తెస్తూ అడుగులు వేశాం. చదువుల యుద్ధం.. ప్రభుత్వం స్కూళ్లలో మనం ఇంగ్లీషు మీడియం తెచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి పెత్తందారులైన చంద్రబాబు, ఈనాడు రామోజీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది. గవర్నమెంట్ బడులు మారాలని ఆరాటపడటం మన తప్పు! ఇంగ్లీష్ మీడియం తేవాలని తపనపడటం మనం చేసిన తప్పు! ఇలా ఆరాటపడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తోంది. మనపై యుద్ధం చేస్తున్న వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారని నిలదీస్తే ఏ ఒక్కరూ తెలుగు మీడియంలో చదువుతున్నారని చెప్పరు. వాళ్ల పిల్లలేమో ఇంగ్లిష్ మీడియంలో చదవాలి. పేదింటి పిల్లలనూ అలాగే చదివిస్తూ మీ జగన్ అడుగులు వేస్తుంటే మాత్రం తెలుగు భాష అంతరించి పోతోందంటూ యాగీ చేస్తూ మనమీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. విద్యారంగంలోనూ క్లాస్ వార్.. ఇప్పుడు విద్యారంగంలో కూడా క్లాస్ వార్ జరుగుతోంది. పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం ఇది. డబ్బున్న వారికి ఒక చదువులు, డబ్బులు లేని వారికి మరో చదువులు అనే ధోరణులపై జరుగుతున్న యుద్ధం ఇది. ఈ క్లాస్ వార్‌లో మీ కష్టాలు తెలిసిన అన్నగా మీ తరఫున ఒక విప్లవంగా, తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చాం.ఈ సంస్కరణలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కొనసాగకుంటే కూలీల పిల్లలు కూలీలుగానే, పనివారు పనివారుగానే, పేద సామాజిక వర్గాల పిల్లలు అదే పేదరికంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు కొనసాగాలి. ఈ సంస్కరణలు వేగంగా అడుగులు పడుతూ పోవాలి. విదేశాల్లోని గొప్ప విశ్వవిద్యాలయాల కోర్సులను సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తేవడం విప్లవాత్మక మార్పు. ఇవన్నీ మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. మనం వచ్చే వరకు గవర్నమెంటు బడులలో ఇంగ్లిష్ మీడియం కూడా ఎవరూ చూడలేదు. ఇవన్నీ 57 నెలల కాలంలోనే శ్రీకారం చుట్టాం. బాబు ఒక్క మంచీ చేయలేదు.. పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఎలాంటి ఆహారం అందుతుందో చంద్రబాబు ఏనాడు కనీసం ధ్యాస పెట్టలేదు. బైజూస్ కంటెంట్, పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు. నాడు – నేడుతో స్కూళ్లను బాగుపరచాలన్న ఆలోచనే చేయలేదు. ఇంగ్లీషు మీడియం ఊసే లేదు. అమ్మ ఒడి దిశగా అడుగులు వేసిందీ లేదు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలన్న ఆలోచనే ఏ రోజూ చేయలేదు. అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరిక్యులమ్ లో మార్పులు తెచ్చింది ఒక బోడి సున్నానే. విదేశీ విద్యా దీవెనతో ఏకంగా రూ.1.25 కోట్ల దాకా చదివించే బాధ్యత నాదీ అన్న ప్రోత్సాహకర మాటలే నాడు లేవు. రాష్ట్రంలో ఆయన పరిపాలన వల్ల జరిగిన మంచి ఒక్కటంటే ఒక్కటీ లేదు. గ్రామాలకు, సామాజిక వర్గాలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, చదువుకుంటున్న పిల్లలకు, జాబ్స్ కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశానని ఆయన చెప్పగలిగే పరిస్థితే లేదు. హాజరైన మంత్రులు, నేతలు కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రçఘురాం, టి.కల్పలత, మొండితోక అరుణ్‌కుమార్, రుహుల్లా, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, దూలం నాగేశ్వరరావు, ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎంఎస్ నాగిరెడ్డి, ఉన్నత విద్యాచైర్మన్ హేమచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.రాజబాబు తదితరులు పాల్గొన్నారు. నేటి విత్తనం.. రేపు మహా వృక్షం ఇవాళ మన పిల్లలకు కావాల్సింది ఏదో కేవలం అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే అనుకునే చదువులు కాదు. ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే ఫర్వాలేదని భావించే చదువులు కానే కాదు. ఈరోజు మనకు కావాల్సింది క్వాలిటీ చదువులు. ఇవాళ్టి తరం రేపు పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే నాణ్యమైన చదువులు కావాలి. ఈ నిజం, అవసరాన్ని తెలుసుకున్నాం కాబట్టే మన పిల్లలందరూ భవిష్యత్తులో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా మన అడుగులు ముందుకు పడ్డాయి. ఈ దిశగా ప్రాథమిక విద్యలో కీలక మార్పులు తెచ్చాం. మనం వచ్చిన తర్వాతే గవర్నమెంట్ బడుల పరిస్థితులు మారాయి. ఇవాళ ఒకటో తరగతిలో మనం వేసే విత్తనం మరో 10–15 ఏళ్లలో చెట్టు అవుతుంది. మంచి భవిష్యత్ లేకపోతే ఆ చెట్టు ఒరిగిపోతుంది. అలా కాకుండా మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్లుగా ఎదగాలనే తపనతో అడుగులు వేస్తూ వచ్చాం. నాడు–నేడుతో గవర్నమెంట్ స్కూళ్లలో సమూల మార్పులు కనిపిస్తున్నాయి. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా మన ప్రయాణం సాగుతోంది. జగన్ అనే వ్యక్తి పక్కకుపోతే...! జగన్ అనే ఒక్కడు పక్కకుపోతే రేపు పిల్లల చదువులు ఉండవు! గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం ఉండదు! 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ కథ దేవుడెరుగు విద్యారంగం గాలికి పోతుంది! ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, పేదవాడికి ఇంటికే మందులు, వ్యవసాయం గాలికి ఎగిరిపోతాయి. రైతన్న పూర్తిగా చతికిలబడిపోతాడు. అక్కచెల్లెమ్మల బతుకులు చిన్నాభిన్నం అవుతాయి. పేదవాడికి తోడుగా నిలబడుతూ, పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధం చేస్తున్నది కేవలం మీ జగన్ మాత్రమే. అందుకనే ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. వాళ్లు చెప్పే అబద్ధాలు, మోసాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెబుతారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తామంటారు. మీ ఇంటికి ఎవరు మంచి చేశారు? ఎవరి హయాంలో మంచి జరిగింది? అనే ఆలోచన చేయండి. మీ జగన్ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా సైనికులుగా నిలబడండి. నేను చెప్పే ఈ మాటలు కచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పిల్లల బాధ్యత తీసుకున్నారు తోడేళ్లన్నీ ఏకమైనా జగనన్న మనందరి కోసం పోరాడుతున్నారు. అట్టడుగు వర్గాలను పైకి తేవాలన్న సంకల్పం గొప్పది. వ్యవస్ధలో మార్పు రావాలంటే విద్యతోనే సాధ్యమని భావిస్తూ సంస్కరణలు చేపట్టారు. స్కూళ్లు మొదలయ్యే జూన్, జూలై వచ్చిందంటే ప్రతి ఒక్కరూ పిల్లల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు జగనన్న ఆ బాధ్యత తీసుకున్నారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగనన్న 30 ఏళ్లు సీఎంగా ఉండాలి. సామాన్యుడైన నన్ను ఎమ్మెల్యేను చేశారు. ప్రాణం ఉన్నంతవరకు ఆయన వెంటే నడుస్తా. ముఠా నాయకులు, ప్యాకేజ్ స్టార్‌ను ప్రజలు తరిమి కొట్టాలి. ఓ వ్యక్తి ఇటీవల తరచూ అత్తగారింటికి నిమ్మకూరు వస్తున్నాడు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి కొత్త కథలు చెబుతున్నాడు. – కైలే అనిల్‌కుమార్, పామర్రు ఎమ్మెల్యే విద్యార్థులకు వరంలా.. అమ్మలా గోరుముద్ద అందిస్తూ నాన్నలా ఫీజులు చెల్లిస్తున్న మీది గొప్ప మనసు అన్నా. కృష్ణా యూనివర్సిటీలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బీటెక్ చదువుకుంటున్నా. నాన్న చదువుకునే రోజుల్లో స్కాలర్షిప్ కోసం ఎన్నో ఆఫీస్‌ల చుట్టూ తిరిగినట్లు చెప్పారు. నేను ఏ ఒక్క ఆఫీస్‌కూ వెళ్లకుండా వలంటీర్ అన్నయ్య మా ఇంటికే వచ్చి పత్రాలు ఇచ్చారు. విజన్ ఉన్న మీరు సీఎంగా ఉండటం విద్యార్థులకు వరం. ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్లీ మళ్లీ సీఎం కావాలి. మీద్వారా మా కుటుంబం చాలా లబ్ధి పొందింది. – పి.శ్రీ షణ్ముఖ సాయి ప్రియ, విద్యార్థిని గొప్ప ప్రజా నాయకుడు మీరే.. మాది పేద కుటుంబం. నాన్న ప్రైవేట్ ఉద్యోగి. ఆయన జీతంపైనే కుటుంబం గడుస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్ పూర్తి చేశా. ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్నా. విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా లబ్ధి పొందా. కరిక్యులమ్ కోర్సులతో పాటు ఇతర కోర్ సబ్జెక్ట్‌లు నేర్చుకోవడం వల్ల మంచి గ్రిప్ సంపాదించా. సాఫ్ట్వేర్ జాబ్స్‌కు అర్హత సాధించా. వరల్డ్ టాప్ యూనివర్సిటీలలో ఎంఎస్ చేయాలనుకుంటున్నా. మీరు యువతకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. మాల్కం గ్లాడ్వెల్ అనే ఇంగ్లిష్ రచయిత టెన్ థౌజండ్ అవర్స్ థియరీ రాశారు. మీరు కూడా టెన్ థౌజండ్ అవర్స్ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు. నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్‌లో గ్రేట్ ప్రొఫెషనల్ పేరు సాధించాక మళ్లీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్‌పై నిలబడి మాట్లాడతానని మాట ఇస్తున్నా. – దిల్షాద్, విద్యార్థిని తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి.... మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 21 ఫ్యాకల్టీస్లో 330 కాలేజీల్లో సీట్లు సాధిస్తే జగనన్న విదేశీ విద్యా దీవెనతో రూ.1.25 కోట్ల వరకు ఫీజులు చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. పిల్లల డిగ్రీలకు ప్రయోజనం దక్కేలా వారు ఏం చదువుతున్నారు? కరిక్యులమ్‌లో ఎలాంటి మార్పులు తేవాలి? అత్యున్నత భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తేవాలి? అని మొదటిసారిగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మీ అన్న మాత్రమే. కరిక్యులమ్‌ను జాబ్ ఓరియెంటెండ్గా మార్చాం. నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు తెచ్చాం. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్ షిప్ తీసుకొచ్చింది ఇప్పుడే. మన కరిక్యులమ్‌లో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్‌ను తొలిసారిగా తీసుకొచ్చాం. చదువుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ తొలిసారిగా అనుసంధానం చేస్తూ అడుగులు వేశాం. డిగ్రీ పూర్తయ్యాక మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించక ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో విదేశాల్లో ఉన్నదేమిటి? ఇక్కడ లేనిదేమిటి? అని ఆలోచన చేసి అక్కడ సబ్జెక్టుల్లో ఉన్న వర్టికల్స్‌ను ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది కూడా మన ప్రభుత్వమే. ప్రఖ్యాత వర్సిటీల్లో ఉన్న దాదాపు 2 వేల కోర్సులన్నీ ఆన్లైన్ ద్వారా మన కరిక్యులమ్‌లో భాగాలుగా మారి సర్టిఫికెట్లు కూడా వారే ఇచ్చేలా అడుగులు వేశాం. అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు చేతిలో పుచ్చుకొని హార్వర్డ్, ఎంఐటీ, ఎల్ఎస్సీ, ఎల్బీఎస్ లాంటి అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్లైన్లో కోర్సులు పూర్తి చేసి పొందిన సర్టిఫికెట్లతో నైపుణ్యాలు సాధించిన మన విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే అంతర్జాతీయంగా మల్టీ నేషనల్ కంపెనీల్లో అందరికంటే ముందుంటారు. జగన్నాథ రథం.. విప్లవాత్మక సంస్కరణలతో మన జగన్నాథ రథం వడివడిగా కదులుతోంది. స్కూల్ ఎడ్యుకేషన్‌లో సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు అడుగులు పడుతున్నాయి. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని మీ అన్న పరిపాలనలోనే తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్‌తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతోంది కూడా ఇప్పుడే. గవర్నమెంట్ స్కూళ్లలో బైలింగ్యువల్ టెక్సŠట్బుక్స్ మన పిల్లల చేతుల్లో కనిపిస్తోంది కూడా ఇప్పుడే. ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్‌ను పేద పిల్లలకు సైతం అందించింది ఈ 57 నెలల కాలంలోనే. మన పేద పిల్లలు కేవలం అక్షరాలు నేర్చుకునే లిటరసీ నుంచి డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని, 8వ తరగతికి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏకంగా ట్యాబ్‌లు ఇచ్చింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. నాడు – నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేసి 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములో ఐఎఫ్‌పీ ప్యానెళ్లు తెచ్చింది మన ప్రభుత్వమే. పిల్లలను బడులకు పంపేలా ప్రోత్సహిస్తూ తల్లులకు అమ్మ ఒడితో ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తోంది కూడా మనమే. పిల్లలకు రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్దను పౌష్టికాహారంతో అందిస్తోంది కూడా ఈ 57 నెలలుగానే. ప్రతి మండలానికి కనీసం 2 జూనియర్ కాలేజీలు, అందులో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒకటి ఉండాలని ఏర్పాట్లు చేసింది కూడా మన ప్రభుత్వమే. విద్యా వ్యవస్థను మన ప్రభుత్వం ఎంత ఉన్నత స్థాయికి చేర్చిందో చెప్పేందుకు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థినులు ఐక్యరాజ్యసమితిలో అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడిన అరుదైన ఘట్టమే నిదర్శనం. మన చదువుల ఘనతను చిట్టి చెల్లెమ్మలు ప్రపంచానికి చాటి చెప్పారు. ఎమ్మెల్యే అనిల్‌ను చూసినప్పుడల్లా.. ఎమ్మెల్యే అనిల్‌ని చూసినప్పుడల్లా అందరూ తన మాదిరిగా ఉంటే ప్రతి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని అనిపిస్తుంది. నిజాయతీ, నిబద్ధత ఉన్న అనిల్‌ను మీరందరూ దీవించండి. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కొన్ని పనులు అడిగాడు. అధికారులను పిలిపించి అవన్నీ కచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తానని హామీ ఇస్తున్నా. పెత్తందారులకో ధర్మం.. పేదలకో ధర్మమా? ఇవాళ నేను చెబుతున్న ప్రతి మాటా ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతున్నా. తల్లిదండ్రులు, పిల్లలందరూ దీన్ని గమనించాలి. పెత్తందార్లయిన వారికో ధర్మమట! పేదలైన మీకో ధర్మమట! వారి పిల్లలకు ఒక బడి.. మన పిల్లలకు ఇంకో బడట! వారి చదువులు వేరట.. మన చదువులు వేరట! పెత్తందార్లుగా వారుండాలట... పనివారిగా మనం ఉండాలట! పరిశ్రమలు వారివట.. కార్మికులుగా మాత్రమే మనమట! సామ్రాజ్యాలన్నీ వారివట.. సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట! వారి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ జగన్ పేద పిల్లలకు ట్యాబ్‌లిస్తే మాత్రం చెడగొడుతున్నారంటూ యాగీ చేస్తారు. ఇవన్నీ మన పిల్లలు ఎప్పటికీ పేదలుగానే ఉండిపోవాలని కోరుకొనే పెత్తందారీ మనస్తత్వానికి నిదర్శనాలుగా మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. -
ఏపీలో డిజిటల్ బోధన సూపర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యావిధానం అద్భుతంగా ఉందని మెక్సికో దేశానికి చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) అమలులో భాగంగా ఐబీ ప్రతినిధులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆల్డో మంగళవారం కృష్ణా జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు. విజయవాడలోని ఎంకే బేగ్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్లోని గదులను, ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. బోధనా అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు విన్నారు. అనంతరం ‘జగనన్న గోరుముద్ద’ను రుచి చూసి మధ్యాహ్న భోజనం వంట కార్మికులను అభినందించారు. అనంతరం కంకిపాడు మండలం పునాదిపాడు, ఈడుపుగల్లు జెడ్పీ హైసూ్కళ్లను సందర్శించారు. పునాదిపాడులో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, ఈడుపుగల్లులో డ్రాయింగ్ ప్రదర్శన, సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ‘ఇండియన్ యోగా’ ప్రత్యేక ప్రదర్శనకు ఆల్డో ముగ్దులయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి, అడ్మిషన్ విధానంపై ప్రిన్సిపల్‌ను ఆరా తీశారు. విద్యార్థి నుల వివరాలు, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులకు వెళ్లి బోధనా అభ్యసన పద్ధతులను పరిశీలించారు. అక్కడ గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసాను విద్యార్థినులు ప్రదర్శించారు. స్కూళ్ల సందర్శన అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దిందని, వసతుల కల్పనలో ఉన్నతమైన ప్రమాణాలు పాటించిందని ఆల్డో అభినందించారు. ఈ పర్యటనలో ఐబీ ప్రతినిధి వెంటఎన్టీఆర్, కృష్ణా జిల్లాల విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ వై.గిరిబాబు యాదవ్, డీసీఈబీ సెక్రటరీ ఉమర్ అలీ ఉన్నారు. -
AP: ప్రభుత్వ చదువులకు సలాం
► ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ద్విభాషా పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం. – ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ► ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు అద్భుతంగా ఉంది. – సంజయ్ కుమార్, కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి ► ఏపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషల్లో (సవర, కొండ, కువి, ఆదివాసీ ఒడియా, కోయ, సుగాలి) ద్విభాషా పాఠ్యపుస్తకాలు అందజేయడం గొప్ప పరిణామం. మనబడి నాడు–నేడు పథకాన్ని మా రాష్ట్రంలోనూ అమలు చేస్తాం. – నవీన్ జైన్, విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ ..ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలను కొనియాడుతున్నారు. విద్యా రంగంలో ఏపీనే తమకు ఆదర్శమని ఎలుగెత్తి చాటుతున్నారు. ఏపీ విద్యా సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన విద్యా విధానాలను వారి రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు ముందుకు వచ్చారు. అలాగే అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన ప్రభుత్వ విద్యా సంస్కరణలను కొనియాడారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు, బైజూస్ కంటెంట్, తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీల ఏర్పాటు, సీబీఎస్ఈ విద్యా విధానం, ఇంగ్లిష్ మీడియం బోధన, బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీని తెలుసుకుని అభినందించారు. ఈ పథకాలతో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడమే కాదు.. వాటిని కళ్లారా చూస్తున్న తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ చదువులకు సలాం కొడుతున్నారు. పేదరికంతో ఏ ఒక్కరి చదువు ఆగిపోరాదని సంకల్పించిన సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్లల్లో విద్యా సంస్కరణలకు ఏకంగా రూ.71,017 కోట్లు ఖర్చు చేశారు. ఫలితంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలలు సమూలంగా తమ రూపురేఖలు మార్చుకున్నాయి. వాటిలో సకల వసతులు వచ్చి చేరాయి. దీంతో 43 లక్షల మంది పేదింటి విద్యార్థుల జీవితాల్లో సరికొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. – సాక్షి, అమరావతి కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడి ప్రభుత్వం మనబడి నాడు–నేడు కింద ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అనేక రకాల సౌకర్యాలు కల్పించింది. నాడు–నేడు కింద మొదటి దశలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలను అభివృద్ధి చేయగా, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. పనులు పూర్తయిన వాటిల్లో హైస్కూళ్లకు 62 వేల ఐఎఫ్‌పీలు, ఎలిమెంటరీ స్కూళ్లకు 45 వేల స్మార్ట్ టీవీలు అందించి డిజిటల్ బోధనను ప్రవేశపెట్టింది. రెండు విడతల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో 9,52,925 ట్యాబ్‌లను అందించింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులకు ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందించింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో జరిగిన రెండు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ), సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) పరీక్షల్లో 93% మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా వీరిలో 39 లక్షల మందికి పైగా ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాస్తుండడం విశేషం. మరోవైపు బడికి దూరమవుతున్న పిల్లలను తిరిగి చేర్పించేందుకు, వారి చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున ప్రభుత్వం జగనన్న అమ్మఒడి కింద నగదు జమ చేస్తోంది. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది ఒకటి నుంచి ఇంటర్ వరకు 1,50,005 మంది విద్యార్థులు అధికంగా చేరారు. అలాగే గత విద్యా సంవత్సరంలో పది, ఇంటర్ బోర్డు పరీక్షల్లో ప్రతిభ చాటినవారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట ప్రభుత్వం సత్కరించింది. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రతిభావంతులను ఎంపిక చేసి ప్రభుత్వం అమెరికా పర్యటనకు పంపించింది. గతంలో ఇన్ని సదుపాయాలు లేవు.. ప్రభుత్వ బడుల్లో ఇన్ని సదుపాయాలు, విద్యా సంస్కరణలు గతంలో ఎప్పుడూ లేవు. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్‌ను సైతం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. మా పెద్దమ్మాయి అరుణ కేజీబీవీలో పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలో చదువుతోంది. చిన్నమ్మాయి చైత్ర ప్రణవి ప్రభుత్వ బడిలోనే తొమ్మిదో తరగతి సీబీఎస్ఈ సిలబస్‌లో విద్యనభ్యసిస్తోంది. ఇంత ఉత్తమ చదువులు నాలాంటి సామాన్యులకు అందుకోవడం గతంలో సాధ్యమయ్యేది కాదు. కానీ పేద, మధ్య తరగతి పిల్లల చదువుల భారం పూర్తిగా ప్రభుత్వమే చూసుకుంటోంది. ఇప్పుడు ప్రైవేటు కంటే ప్రభుత్వ స్కూళ్లే అద్భుతంగా ఉన్నాయి. – రుత్తల పాపయ్య, అల్లిపూడి, కాకినాడ జిల్లా ఇలాంటి గొప్ప చదువులు మాకు వరం అటవీ ప్రాంతమైన మా సీలేరు గ్రామం ఇంగ్లిష్ చదువులకు చాలా దూరం. జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వచ్చింది. ఇప్పుడు సీలేరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇంగ్లిష్ మీడియంలోనే చదువు చెబుతున్నారు. వచ్చే ఏడాది పదో తరగతి కూడా ఇంగ్లిష్‌లోనే ఉంటుందన్నారు. నా కూతురు జ్యోత్స ్న స్థానిక జెడ్పీ స్కూల్లో 9వ తరగతి ఇంగ్లిష్ మీడియంలో చదువుతోంది. ఇప్పుడు ఇంగ్లిష్ బాగా మాట్లాడుతోంది. ఇది మాకెంతో గర్వంగా ఉంది. ఇలాంటి గొప్ప చదువులు మాలాంటి వారికి వరం. – పెయ్యల సింహాద్రి, సీలేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా పౌష్టికాహారం.. గోరుముద్ద ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే గొప్ప ఆలోచనతో 2020, జనవరి 1న రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో రోజూ సాంబారు, అన్నం మాత్రమే పెట్టేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పుడు వారానికి 16 రకాల ఐటెమ్స్‌తోపాటు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో భోజనం పెడుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూతో విద్యార్థులకు వేడిగా రుచి, శుచితో పోషకాహారాన్ని అందిస్తోంది. అలాగే వారిలో రక్తహీనతను అరికట్టడానికి వారంలో 3 రోజులు బెల్లంతో చేసిన రాగి జావ, మూడు రోజులు చిక్కీ, వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డును తప్పనిసరి చేసింది. ఎలా వండితే నచ్చుతుందో విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుని ఆ మేరకు వంటలో మార్పులు సైతం చేశారు. పర్యవేక్షణ కోసం ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టం ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్ (ఐఎంఎంఎస్)’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. జగనన్న గోరుముద్ద కోసం ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.6,995.34 బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. గత టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం ఏటా చేసిన రూ.450 కోట్లు ఖర్చు కంటే ఇది నాలుగు రెట్లు అధికం. ప్రభుత్వ బడులకు ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల, విలేజ్ క్లినిక్ నుంచి సిబ్బంది వచ్చి విద్యార్థులకు వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు. రక్తహీనతను అరికట్టేందుకు మాత్రలూ ఇస్తున్నారు. -
నెట్టింట.. ప్రభుత్వ బడులు!
సాక్షి, అమరావతి: కనీస సదుపాయాల లేమి.. శిథిలమైన గదులు.. ఇది ఒకప్పటి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కార్పొరేట్ సదుపాయాలతో అవి కళకళలాడుతున్నాయి. గతంలో విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్ కూడా లేని పరిస్థితుల నుంచి బూట్లు, బెల్టు, టై, నోటు పుస్తకాలతో సహా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సగర్వంగా చదువుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల(ఐఎఫ్‌పీ)ను అందుబాటులోకి తేవడంతో డిజిటల్ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు వాటిని సమర్థంగా వినియోగించి, పేదింటి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అన్ని ప్రభుత్వ బడులను ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరాయంగా డిజిటల్ బోధన అందించేందుకు, సమకాలీన ప్రపంచ పోకడలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అన్ని పాఠశాలలను డిజిటలైజేషన్ చేయనున్నారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పి స్తోంది. ఇప్పటికే 8,700 పాఠశాలలకు నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా, ఇందులో 3,700 ఉన్నత పాఠశాలలు, మరో 5 వేలు ప్రాథమిక పాఠశాలలున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ బడులకు నెట్ సదుపాయం కల్పించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కల్పన విభాగం పనిచేస్తోంది. 100 ఎంబీపీఎస్ వేగంతో నెట్ సదుపాయం ఈ ఏడాది ప్రారంభంలో 4,800 ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి, +2 వరకు సెక్షన్‌కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో 60మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను అందించి, టోఫెల్ బోధన చేపట్టారు. రెండో దఫాలో 32వేల ఐఎఫ్‌పీలు, 22వేల స్మార్ట్ టీవీలను పాఠశాలలకు అందించింది. వీటితోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన, ఉత్తమ కంటెంట్‌ను అందించేందుకు, 4 డీటీహెచ్ (ఈ విద్య) చానెళ్లు, 5 దీక్ష–ఏపీ చానెళ్లు, ఏపీ ఈ–పాఠశాల పోర్టల్ ద్వారా కూడా కంటెంట్‌ను పంపిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులకు టోఫెల్ బోధన అందిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు, మ్యాథ్స్ ల్యాబ్స్ పాల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చి విద్యపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇకపై విద్యార్థులకు ఫ్యూచర్ టెక్ పాఠాలను సైతం బోధించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మేనేజ్మెంట్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), లార్జ్ లెర్నింగ్ మాడ్యూల్స్, 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే ప్రభుత్వం దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి పాఠశాలలోను డిజిటల్ లెర్నింగ్ అంతరాయం లేకుండా కొనసాగేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని సైతం కల్పిస్తోంది. హైసూ్కళ్లకు ఏపీ ఫైబర్‌నెట్, బీఎస్ఎన్ఎల్ ద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాన్ని, ప్రాథమిక పాఠశాలలకు జియో ద్వారా నెట్ అందిస్తోంది. అందుకు అవసరమైన 5జీ సిమ్ కార్డులతో వైఫై రౌటర్లను సరఫరా చేస్తోంది. -
బడుల పైనా ‘బండ’ రాతలే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద పిల్లలు కూడా ఉన్నత స్థితిలోకి రావాలని, చదువుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ విద్యా రంగంలో అనేక సంస్కరణలు తెచ్చారు. ‘మన బడి నాడు – నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను నూతన భవనాలు, అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా తీర్చి దిద్దుతున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నారు. పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిని అందుకొనేలా ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ బోధన అందిస్తున్నారు. చంద్రబాబు జమానాలో పాఠశాలల పైకప్పులు కూలిపోయినా, బెంచీలు, నీరు లేకపోయినా, టెక్ట్స్‌బుక్స్ ఇవ్వకపోయినా కదలని ‘ఈనాడు’ కలం.. అవే పాఠశాలల్ని అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం కక్కుతోంది. రెండో దశలో నిర్మాణంలో ఉన్న నాలుగు బడుల ఫొటోలు తీసి ఏమీ జరగడంలేదంటూ కుటిల కథనం ప్రచురించింది. అసలు వాస్తవాలివీ.. ♦ మనబడి నాడు నేడు రెండో దశలో ప్రభుత్వం రూ.8,000 కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టింది. 8,529 పాఠశాలల్లో 25,154 అదనపు తరగతి గదులు కూడా నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకు పూర్తి చేసేలా పనులు చేస్తున్నారు. ♦ ఏలూరు ఆరో డివిజన్లోని నగరపాలకోన్నత పాఠశాలలో రెండో దశలో రూ.1.08 కోట్లతో 9 అదనపు తరగతి గదుల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటివరకు రూ.62 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. ♦ కర్నూలు జిల్లా కోసిగి జేబీఎం ప్రాథమిక పాఠశాలలో రూ.21.10 లక్షలతో పనులు చేపట్టారు. ఇప్పటివరకు రూ.14.98 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. ♦ విజయవాడ కృష్ణలంక బాలికల పాఠశాలలో రూ.62.87 లక్షలతో పనులు చేపట్టారు. ఇందులో రూ.19.06 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. ఇదే పాఠశాలలో రూ.58.90 లక్షలతో ఐదు అదనపు తరగతి గదుల నిర్మాణం కూడా చేపట్టి, రూ.29.73 లక్షల విలువైన పనులు చేశారు. కృష్ణలంకలోనే ఉన్న ఎస్వీఆర్ ఎంసీహెచ్‌లో రూ.62.94 లక్షలతో పనులు చేపట్టి, రూ.27.55 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. ఏపీఎస్సార్ మున్సిపల్ హైస్కూల్లో రూ.81.18 లక్షలతో పనులు చేపట్టి రూ.33.13 లక్షల విలువైన పనులు చేశారు. రూ.47.79 లక్షలతో 4 అదనపు తరగతి గదులను కూడా నిర్మిస్తున్నారు. ♦తిరుపతి జిల్లాలోని ఎంజీఎం మున్సిపల్ హైస్కూల్లో రూ.84 లక్షలతో ఏడు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. రూ.19.63 లక్షల పనులు పూర్తి చేశారు. ♦ విశాఖ జిల్లా గంభీరం ఎంపీపీ పాఠశాలలో రూ.17.82 లక్షలతో చేపట్టిన పనుల్లో రూ.10.81లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. -
సర్కారు బడిలో అంతర్జాతీయ విద్య
సాక్షి, అమరావతి: ‘మన పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలి. ప్రపంచానికి దిక్సూచిగా మారాలి. అందుకోసం వారికి మీ జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చి డిజిటల్ బోధన ప్రవేశపెట్టాం. సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నాం. మన పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బక్‌లారియెట్ (ఐబీ) బోధన కూడా ప్రవేశపెడతాం’’ జగనన్న ఆణిముత్యాలు రాష్ట్ర స్థాయి సత్కార వేడుకలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాట ఇది. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఐబీ సంస్థతో బుధవారం ఒప్పందం చేసుకుని ఆచరణలోకి తెచ్చారు. ఇప్పటికే సర్కారు బడిలో సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ బోధనను అందుబాటులోకి తె చ్చిన ప్రభుత్వం ఇప్పుడు ‘ఐబీ’ చదువులను సైతం పేద పిల్లలకు చేరువ చేస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 210 వరల్డ్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఐబీ సిలబస్ అమల్లో ఉంది. ఈ స్కూళ్లలో సంపన్నులు మాత్రమే తమ పిల్లలను చదివించగలరు. అలాంటి చదువులను రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలోకి తెచ్చి పేద పిల్లలకు అందించాలన్న సంకల్పంతో జగన్ సర్కారు ముందడుగు వేసింది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ ప్లస్2 వరకు విద్యనందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రపంచం మె చ్చిన విద్యా విధానం సాధారణంగా ప్రైవేటు స్కూళ్లలో మార్కులు.. ర్యాంకులు.. ఒకరితో మరొకరికి పోటీతో పిల్లలపై విపరీతమైన ఒత్తిడి పెంచుతారు. దీనికి భిన్నంగా మానసిక ఒత్తిడి లేకుండా పిల్లలు సొంతంగా ఎదగడంతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బోధనను ఐబీ అందిస్తుంది. ఐబీ ఒక నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్. పిల్లలపై పరీక్షల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన కొంత మంది ఉపాధ్యాయులు పరిశోధన చేసి 1968లో స్విట్జర్లాండ్‌లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ బోర్డు. ఇందులో 3 నుంచి 19 ఏళ్ల వయసు విద్యార్థులకు నాణ్యమైన శిక్షణనిస్తారు. ఈ సిలబస్ చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానం, క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్, సెల్ఫ్ లెరి్నంగ్ వంటి నైపుణ్యాలు అలవడతాయి. ఓపెన్–మైండెడ్, ఓపెన్ లెర్నింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను ఆకళింపు చేసుకుని, సానుకూల మార్పునకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారు. ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 159 దేశాల్లో ఈ విద్యా విధానం అమలులో ఉంది. ఈ బోర్డులో చదువుకున్న పిల్లలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రవేశాలు, అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలు, ఇతర కోర్సులు అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్న నేటి యుగంలో ‘ఐబీ సిలబస్’లో పిల్లల నైపుణ్యాలను అంచనా వేసే అంతర్గత పరీక్షలేగాని అధికారిక పరీక్షలు ఉండవు. నాలుగు దశల్లో ప్రోగ్రాములు ఐబీ ప్రోగ్రాములు నాలుగు దశల్లో ఉంటాయి. 3 నుంచి 12 సంవత్సరాల వయసు విద్యార్థులకు ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్ (పీవైపీ) అందిస్తారు. ఇందులో పిల్లలకు నేర్చుకునే ఆసక్తి పెంచడం, కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్, సొంతంగా ఆలోచించడం వంటివి నేర్పిస్తారు. ఈ ప్రోగ్రాంలో పరీక్షలు గానీ, గ్రేడింగ్ కానీ ఉండవు. పదేళ్ల ఈ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత చివరలో సైన్స్ ఎగ్జిబిషన్ వంటిది నిర్వహించి పిల్లలను భాగస్వామ్యం చేస్తారు. ♦ కాగా, 11 నుంచి 16 సంవత్సరాల విద్యార్థులకు మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్ (ఎంవైపీ) ఉంటుంది. ఇందులో విద్యార్థులకు ఆర్ట్స్, లాంగ్వేజ్, లాంగ్వేజ్ అక్విజిషన్, మ్యాథ్స్, డిజైన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇండివిడ్యువల్స్ అండ్ సొసైటీస్, సైన్సెస్ అనే 8 గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపు నుంచి విద్యార్థులు కనీసం ఒక సబ్జెక్ట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో పిల్లలు నైపుణ్యాలను ఎంత నేర్చుకుంటున్నారు అనే దానిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఈ కోర్సు ప్రస్తుతం మన పదో తరగతికి సమానం. ♦ ఇక 16 నుంచి 19 ఏళ్ల వయసున్న విద్యార్థులకు డిప్లొమా ప్రోగ్రామ్ (డీపీ) ఉంటుంది. మూడేళ్ల పాటు ఉండే ఈ ప్రోగ్రామ్‌లో లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, లాంగ్వేజ్ అక్విజిషన్, సైన్స్, ఆర్ట్స్, మ్యాథ్స్, ఇండివిడ్యువల్స్ అండ్ సొసైటీస్ అనే 6 గ్రూపులు ఉంటాయి. డిప్లొమా ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత చివర్లో సరి్టఫికెట్ ప్రదానం చేస్తారు. మన ప్లస్ 2 విద్యకు సమానమైన ఈ డిప్లొమా సర్టిఫికెట్ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా చెల్లుతుంది. ♦ ఇదే వయసున్న (16–19 సం.) విద్యార్థుల కోసం కెరీర్ రిలేటెడ్ ప్రోగ్రామ్ (సీపీ) డిజైన్ చేశారు. ఇది విశ్వవిద్యాలయాలు, ఉపాధి, తదుపరి ట్రైనింగ్ కోసం విద్యార్థులను సిద్ధం చేసే రెండేళ్ల ప్రోగ్రామ్. విద్యార్థులు ఎంచుకున్న కెరీర్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను, జ్ఞానాన్ని పెంపొందిస్తారు. విశ్వ మానవుడిగా ఎదుగుదల ఐబీ విద్య విద్యార్థులకు విమర్శనాత్మకంగా ఆలోచించడం, ప్రశి్నంచడం అలవాటు చేస్తుంది. ఇది సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించే సామర్థాన్ని ఇస్తుంది. రాయడం, మాట్లాడటం, ప్రెజెంటేషన్ సహా వివిధ మార్గాల్లో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసే నైపుణ్యాలు బోధిస్తారు. వారి చదువు, కెరీర్‌ను మరింత విజయవంతం చేసేందుకు దోహదం చేస్తుంది. ఐబీ విద్యార్థులు విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల గురించి నేర్చుకుంటారు. ఇది వారికి మరింత సహనాన్ని, ఇతరులను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని అందిస్తుంది. విద్యార్థులు బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరులుగా తయారు చేస్తారు. ప్రపంచంలో ఏమూల ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా అక్కడ సానుకూల మార్పును తీసుకురావడానికి ఈ విద్య సహాయపడుతుంది. అంతర్జాతీయంగా అత్యున్నత కెరీర్‌ను సొంతం చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో 210 ఐబీ స్కూళ్లు వాస్తవానికి ఇంటర్నేషనల్ బాకలారియెట్ చదువులు చాలా ఖర్చుతో కూడుకున్నది. మన దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముస్సోరి, కొడైకెనాల్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు పరిధిలో 210 ఐబీ వరల్డ్ స్కూల్స్ ఉన్నా యి. వాటిల్లో ఏడాదికి రూ. 6 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. చాలా స్కూళ్లలో ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్ (3–12సం.) మాత్రమే అందిస్తుండగా, కొన్ని కొన్ని మిడిల్ ఇయర్ ప్రోగ్రామ్ (11–16 సం.) వరకు, అతి తక్కువ స్కూళ్లు మాత్రం డిప్లొమా ప్రోగ్రామ్ (డీపీ) వరకు బోధిస్తున్నాయి. -
బడిఈడు పిల్లలు స్కూల్లో ఉండాల్సిందే
సాక్షి, అమరావతి : విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా స్కూల్లో చేరాలని, 100 శాతం జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. డ్రాప్ అవుట్స్ లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు కోరితే తిరిగి ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. విద్యాశాఖపై గురువారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో తీర్చిదిద్దాలని సూచించారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు ముందుకు వేయాలని చెప్పారు. మొదటి దశ నాడు–నేడు పూర్తి చేసుకున్న హైస్కూళ్లల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెండు హైస్కూళ్ల చొప్పున అప్‌గ్రేడ్ చేయండి ఇంటర్ విద్యను పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు చొప్పున.. ఒకటి బాలికలకు, రెండోది కో ఎడ్యుకేషన్ కోసం ఉండాలన్నారు. జనాభా అధికంగా ఉన్న ఆ మండలంలోని రెండు గ్రామాలు లేదా, పట్టణాల్లో రెండు హైసూ్కళ్లను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు. వచ్చే జూన్ నాటికి ఈ జూనియర్ కళాశాలలు అందుబాటులోకి రావాలన్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా బైజూస్ కంటెంట్ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని, తర్వాత దశలో ట్యాబుల పంపిణీకి కూడా సన్నద్ధం కావాలన్నారు. ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక అందిస్తున్నామని, విద్యార్థులకు అందించే వస్తువుల్లో నాణ్యతా లోపం లేకుండా చూడాలన్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ విద్యా కానుక నాణ్యత పరిశీలనకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని సీఎం దృష్టికి తెచ్చారు. నాణ్యత కోసం క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 93 శాతం విద్యా కానుక వస్తువులను, పుస్తకాలను నిర్దేశిత కేంద్రాల్లో పంపిణీకి సిద్ధం చేశామని చెప్పారు. రెండో సెమిస్టర్ పుస్తకాలు కూడా ముందుగానే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద, ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్లపై నిరంతరం ఫీడ్‌బ్యాక్ తెప్పించుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నిరంతరం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ అంశంలో థర్డ్ పార్టీ పరిశీలన ఉండాలన్నారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. స్కూళ్లల్లో డ్రాపౌట్స్ నివారణకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల సహకారం తీసుకోవాలన్నారు. డిజిటల్ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఉన్నత పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ బోధన ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయులకు వాటి వినియోగంపై శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీలకు శిక్షణ ఇస్తారని, వీరి ద్వారా టీచర్లకు శిక్షణ ఇస్తామని వివరించారు. మరింత మందికి దీనిపై నైపుణ్యం పెంచేలా 20 వేల మంది బీటెక్ స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్ చేస్తారని, వీరు ప్రతినెలా ఆయా స్కూళ్లకు వెళ్లి టీచర్లకు ఐఎఫ్‌పీ వినియోగంలో సహాయకారిగా ఉంటారని తెలిపారు. ఐఎఫ్‌పీలతో పాటు స్మార్ట్ టీవీల వినియోగం, ట్యాబులు, బైజూస్ యాప్ పైనా టీచర్లకు శిక్షణ ఇస్తామన్నారు. రోజువారీగా, పాఠ్యాంశాల వారీగా బోధనపై స్కూళ్లకు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు అందిస్తామని, అన్ని స్కూళ్లలో ఒకేలా బోధన చేపట్టేలా ఇది ఉపయోగపడుతుందని సీఎంకు వివరించారు. ఏపీఎస్ఎఫ్ఎల్, బీఎస్ఎన్ఎల్ ద్వారా స్కూళ్లకు ఇంటర్నెట్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలిదశ నాడు–నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని, మిగతా స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గతేడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందించిన ట్యాబుల నిర్వహణ, వినియోగంపై నిరంతరం సమీక్షలు చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు ఈ బాధ్యత చూస్తున్నారని వివరించారు. రెండో దశ నాడు–నేడులో 22,224 స్కూళ్లు మన బడి నాడు–నేడు రెండో దశ కింద చేపట్టిన పనుల ప్రగతిని సీఎం జగన్ సమీక్షించారు. రెండో దశ కింద ఇప్పటికే రూ.3,287.08 కోట్లు ఖర్చు చేశామని, 22,224 స్కూళ్లలో పనులు జరుగుతున్నట్టు అధికారులు వివరించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయన్నారు. నాడు–నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లలో అదే సమయానికి ట్యాబుల పంపిణీతో పాటు, ఐఎఫ్బీ ప్యానెల్స్నూ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యా శాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు, వాటి పురోగతిని వివరించారు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో 64 మంది విద్యార్థులు టాప్ 10 ర్యాంకులు సాధించారన్నారు. స్కూళ్లలో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండేలా, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తూ బదిలీలు చేపడుతున్నామని, యూనిట్ టెస్టుల్లో వెనకబడినవారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ కాలేజీల్లో 27 మంది టాప్ 10 ర్యాంకులు సాధించారని సీఎంకు తెలిపారు. అకడమిక్ క్యాలెండర్ 2023–24 విడుదల 12న విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో 2023–24 అకడమిక్ క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఇందులో విద్యా సంవత్సరంలో చేపట్టే ముఖ్యమైన అంశాలతో పాటు స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్, హెచ్ఎంలు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్ మేళా, లాంగ్వేజ్ క్లబ్, లాంగ్వేజ్ ల్యాబ్స్, లెసన్ ప్లాన్ ఫార్మాట్ అండ్ గైడ్‌లైన్స్, లెర్న్ ఏ వర్డ్ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలు ఉన్నాయి. ప్రతిభా అవార్డుల పరిశీలన 2023లో పదో తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభావంతులను ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు పురస్కారాలతో సత్కరించనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇవ్వనున్న మెడల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులను మూడు దశల్లో సత్కరించనున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులను జూన్ 15న, జిల్లా స్థాయిలో జూన్ 17న, రాష్ట్ర స్థాయిలో జూన్ 20న అవార్డులు అందజేయనున్నారు. స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్–2023ను విజయవాడలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా విద్యార్థులకు అందించనున్నారు. -
డిజిటల్ బోధనపై దృష్టిపెట్టిన జగన్ ప్రభుత్వం
-
AP: ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన
సాక్షి, అమరావతి: ఆధునిక బోధన విధానాలను అనుసరిస్తూ విద్యార్థులకు అత్యుత్తమ రీతిలో అత్యున్నత పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి తరగతి గదిలో డిజిటల్ విద్యా బోధనకు శ్రీకారం చుడుతున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు సబ్జెక్టులు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ డిస్ప్లే లేదా ప్రొజెక్టర్లు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అధికారులు చూపించిన ఇంటరాక్టివ్ డిస్ప్లేలు, ప్రొజెక్టర్స్ పనితీరు, నాణ్యత, మోడల్స్‌ను పరిశీలించారు. వాటి వివరాలు, ఇతర అంశాలపై ఆరా తీశారు. నాణ్యమైన డిజిటల్ పరికరాల ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రొజెక్టర్లు, ఇంటరాక్టివ్ టీవీల నాణ్యతలో ఎక్కడా రాజీ పడరాదని స్పష్టం చేశారు. స్మార్ట్ బోధన సదుపాయాల వల్ల ఇటు పిల్లలకు, అటు ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ట్యాబ్‌లు నాణ్యతతో ఉండాలి ►ఈ విద్యా సంవత్సరం సెప్టెంబర్‌లో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్‌లు నాణ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ట్యాబ్‌ల్లోకి ప్రఖ్యాత ఆన్లైన్ ఎడ్టెక్ సంస్థ బైజూస్ కంటెంట్‌ను అప్లోడ్ చేస్తుంది. దీని ద్వారా విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి రానుంది. ►విద్యార్థుల చదువులకు అవసరమైన వస్తువులతో అమలు చేస్తున్న విద్యా కానుకకు సంబంధించి వచ్చే ఏడాదికి పంపిణీ కోసం తీసుకోవలసిన చర్యలపై ఇప్పటి నుంచే ప్రణాళికా బద్ధంగా సన్నద్ధం కావాలి. ప్రతి స్థాయిలో పర్యవేక్షణ ముఖ్యం ►రెండో దశ నాడు – నేడు పనులను వేగవంతం చేయాలి. స్కూళ్లలో విలువైన ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలి. స్కూళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి ఆలోచించాలి. ►సస్టయినబుల్ డెవలప్మెంటు గోల్ (ఎస్డీజీ) లక్ష్యాలను చేరుకునే ప్రక్రియలో భాగంగా విద్యా వ్యవస్థలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన డేటా నిరంతరం అప్లోడ్ అయ్యేలా చూడాలి. దీనికి సంబంధించి ఎస్ఓపీలను రూపొందించాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు కూడా సమీక్ష చేయాలి. ►టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ (టీఎంఎఫ్), స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ (ఎస్ఎంఎఫ్)లను సమర్థవంతంగా వినియోగించుకుని స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలి. విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినందున, ప్రతి స్థాయిలో పర్యవేక్షణ బలంగా ఉండాలి. ఇందు కోసం విద్యా శాఖలో డీఈఓ, ఎంఈఓ సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ►ఎస్సీఈఆర్టీ, డైట్ సీనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్ పోస్టుల భర్తీపైనా దృష్టి పెట్టాలి. హాస్టళ్లలో కూడా నాడు – నేడు రెండో దశ కింద పనులు చేపట్టాలి. ►సీఎం గతంలో ఇచ్చిన వివిధ ఆదేశాల అమలు ప్రగతిని, నాడు – నేడు రెండో దశ కింద 22,344 స్కూళ్లలో చేపడుతున్న పనుల ప్రగతిని అధికారులు ఈ సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యా శాఖ సలహాదారు ఎ మురళీ, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ కార్యదర్శి సాంబశివారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పీపీ–1 నుంచే.. ►రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న పూర్వ ప్రాథమిక విద్యా తరగతుల నుంచే డిజిటల్ బోధనపై అధికారులు ఆలోచించాలి. పీపీ–1 (ప్రీ ప్రైమరీ–1) నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్ టీవీలు, 3వ తరగతి.. ఆపైన తరగతులకు ప్రొజెక్టర్లు పెట్టేలా ప్రణాళికలు రూపొందించాలి. ►నాడు – నేడు పూర్తి చేసుకున్న అన్ని హైస్కూళ్లలో మొదటి దశ కింద ఈ డిజిటల్ పరికరాలను ఏర్పాటు చేయాలి. వచ్చే వారం నాటికి దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలి. -
గురుకులాలు.. డిజిటల్ చదువులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలల్లో డిజిటల్ బోధన పక్కాగా నిర్వహిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే విడతల వారీగా తరగతులను డిజిటలీకరిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం(2022–23) పూర్తయ్యే నాటికి అన్ని పాఠశాలల్లో డిజిటల్ బోధనే జరుగుతుందన్నారు. బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని 281 గురుకుల పాఠశాలల్లో 1,696 తరగతులు డిజిటలైజ్ అవుతాయన్నారు. శుక్రవారం ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్(మహాత్మ జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ) బోర్డు సమావేశం మంత్రి గంగుల అధ్యక్షతన జరిగింది. 2022–23లో సొసైటీ ద్వారా నిర్వహించే కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించారు. గురుకుల పాఠశాలల్లో డిజిటలైజేషన్ 100 శాతం చేయాలన్న నిర్ణయంపై బోర్డు తీర్మానించింది. అలాగే గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు వేడినీటి వసతి కల్పన కోసం టీఎస్ రెడ్కో ద్వారా సోలార్ వాటర్ హీటర్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పాఠశాలల నిర్వహణ పక్కగా జరిగేందుకు నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని మంత్రి వాఖ్యానించారు. అకడమిక్ సెల్‌ను తీర్చిదిద్దాలని, అంతర్గత ఆడిట్ బృందాలను మరింత బలపర్చాలన్నారు. ఇదిలా ఉండగా, ‘గురుకులం.. దూరాభారం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తపై మంత్రి స్పందించారు. గురుకులాల నిర్వహణకు తీసుకునే అద్దె భవనాలతో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
డిజిటల్ పాఠాలతో సత్ఫలితాలు
సాక్షి, అమరావతి: కరోనాతో పాఠశాలలు తెరుచుకోలేని పరిస్థితుల్లో పిల్లలకు చదువులపై ఆసక్తి తగ్గకుండా ఉండేందుకు వారి వద్దకే బోధనా కార్యక్రమాలు తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 72 లక్షల మంది విద్యార్థుల్లో 56 శాతానికిపైగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో చదువులు కొనసాగేలా డిజిటల్ బోధనను దేశంలోని ఏ రాష్ట్రమూ చేపట్టక ముందే దూరదర్శన్ (సప్తగిరి చానల్), ఆకాశవాణిల ద్వారా విద్యామృతం, విద్యాకలశం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఈ బోధన చేపట్టింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సూచనలు పాటిస్తూ హైటెక్, నోటెక్, లోటెక్ అని విద్యార్థులను మూడు రకాలుగా వర్గీకరించి హైటెక్ వారికి ఆన్లైన్ పద్ధతిలో, లోటెక్ వారికి దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా, నోటెక్ వారికి మొబైల్‌వ్యానుల ద్వారా బోధన జరిగేలా చూస్తున్నారు. పెరిగిన చానల్ రేటింగ్.. ► లాక్డౌన్ ప్రారంభంలో 1 నుంచి 6వ తరగతి వరకు ఉన్న 18.32 లక్షల మంది విద్యార్థులకు వర్క్‌బుక్స్ అందించి బ్రిడ్జి కోర్సులను చేపట్టారు. ► ఒకటి నుంచి పదో తరగతి వరకూ అభ్యాసం కోసం 63 కొత్త వర్క్‌బుక్‌లను రూపొందించి ఈ దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా బోధన కొనసాగిస్తున్నారు. ► వీడియోలు ముందుగానే రూపొందించి నిపుణులైన టీచర్లతో బోధన చేయించారు. ► సప్తగిరి చానల్ ద్వారా ప్రసారమవుతున్న పాఠాలను లక్షలాది మంది విద్యార్థులు వీక్షిస్తుండంతో ఆ చానల్ టీఆర్పీ రేటింగ్ పెరిగి దూరదర్శన్ చానళ్లలో రెండోస్థానంలో నిలిచిందని విద్యాశాఖవర్గాలు పేర్కొన్నాయి. ► ‘1800123123124’ టోల్‌ఫ్రీ నంబర్‌తో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి నిపుణులైన టీచర్ల ద్వారా విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ► కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఉన్న వారికి అభ్యాస యాప్ ద్వారా కూడా బోధనా వీడియోలను అందుబాటులో ఉంచారు. ► మొబైల్ వాహనాల ద్వారా పిల్లలకు వారి గ్రామాల్లోనే ఆసక్తికరమైన రీతిలో పాఠ్యబోధనకు ఏర్పాట్లు చేశారు. ► విద్యార్థులు, టీచర్ల ఆంగ్ల భాషా పరిజ్ఞానం, నైపుణ్యం పెంపు కోసం వెబినార్ ద్వారా ఆన్లైన్ సదస్సులు నిర్వహించారు. 1.5 లక్షల టీచర్లు ఈ శిక్షణలో పాల్గొనడం విశేషం. ► దేశంలో ఈ రకమైన శిక్షణ ఇస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. ► ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకే కాకుండా మొత్తం అన్ని స్కూళ్ల కోసం కార్యక్రమాలను రూపొందించారు. దూరదర్శన్ పాఠాలతో విద్యార్థులకు మేలు దూరదర్శన్ ద్వారా పాఠశాల విద్యాశాఖ ప్రసారం చేస్తున్న పాఠాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాయి. ఈ పాఠాలు వింటూ విద్యార్థులు తమ వర్క్‌బుక్‌ల ద్వారా వాటిని పునశ్చరణ చేస్తూ కరోనా కాలంలో పాఠశాలలు లేకపోయినా విజ్ఞానాన్ని పొందగలుగుతున్నారు. పాఠాలు కూడా రొటీన్‌గా కాకుండా ఎంతో ఆసక్తిని కలిగించేవిగా ఉండటంతో విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. – పైడిరాజు, హెచ్ఎం, జెడ్పీ హైస్కూల్, గిడిజాల, విశాఖపట్నం జిల్లా పాఠాలు ఆకట్టుకునేలా ఉన్నాయి నేను పదో తరగతిలోకి వచ్చాను. పాఠశాలలు లేకపోవడం వల్ల మా చదువులు ఆగిపోకుండా ప్రభుత్వం దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయిస్తున్న కార్యక్రమం వల్ల మాకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది. గణితం, సైన్సు వంటి సబ్జెక్టులపై గ్రాఫిక్స్‌తో కూడిన పాఠ్యాంశాలు మాకు బాగా అర్థమయ్యేలా వీడియోల రూపంలో చూపిస్తుండడంతో పాఠాలపై ఆసక్తి పెరుగుతోంది. – రమ, పదో తరగతి, గిడిజాల సులభంగా అర్థమయ్యేలా బోధన పిల్లలు ఎదురుగా ఉన్నప్పుడు ఎలా బోధిస్తామో అంతకన్నా సులభంగా అర్థమయ్యేలా దూరదర్శన్ ద్వారా బోధిస్తున్నాం. విద్యావారథి కింద పిల్లలకు హిందీ పాఠ్యాంశాలను బోధిస్తున్నాను. – లంకా వెంకటరమణ, హిందీ టీచర్, జెడ్పీ హైస్కూల్, వానపాముల, కృష్ణాజిల్లా నిపుణులతో బోధన 1 నుంచి 10వ తరగతి వరకు విద్యావారథి కింద దూరదర్శన్‌లో ఆసక్తికరమైన రీతిలో ఆయా పాఠ్యాంశాలను తీర్చిదిద్దాం. టీచర్లలో నిపుణులైన వారిని ఎంపిక చేసి వారికి ముందుగానే పాఠ్యప్రణాళిక ఇచ్చి దూరదర్శన్ ద్వారా బోధన కొనసాగిస్తున్నాం. హైస్కూల్ స్థాయిలో బోధనకు పలు సాంకేతిక ఉపకరణాలను వినియోగిస్తున్నాం. – డా. ప్రతాప్‌రెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ -
ప్రభుత్వ స్కూల్లో గూగుల్ ల్యాబ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గూగుల్ సహకారంతో ఏర్పాటు చేసిన గూగుల్ ల్యాబ్ సదుపాయంతో విద్యార్థులు అద్భుతాలు చేస్తున్నారు. ఓక్రిడ్జ్, గ్లోబల్, అరబిందో వంటి ఇంటర్నేషనల్ స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఆధునిక గూగుల్ ల్యాబ్‌ను దేశంలో తొలిసారి విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి తెచ్చారు. ఈ ల్యాబ్‌లో 6 నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు వారంలో 2 క్లాస్‌లు డిజిటల్ బోధన అందించేలా చర్యలు చేపట్టారు. పాఠశాల సిలబస్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి బోధనను నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. రొబోటిక్ ల్యాబ్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం సబ్జెక్టులకు సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నారని తెలిపారు. అదే స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. టీచర్లకు గూగుల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పా టు చేసుకుంటే సాఫ్ట్వేర్ సహాయం అందించడంతోపాటు టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు గూగుల్ ముందుకు వచి్చందని విజయకుమార్ తెలిపారు. ఈ మేరకు గూగుల్ ప్రతినిధులు 2 రోజుల కిందట తమతో సమావేశమై అంగీకారం తెలిపారన్నారు. ల్యాబ్‌ల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, వాటి ఏర్పాటుతో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించవచ్చన్నారు. గూగుల్ ల్యాబ్ సదుపాయంతో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో మెరుగైన ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీతోపాటు నగదున ఆయన అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ పీవీ శ్రీహరి, జాయింట్ డైరెక్టర్లు రమేశ్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ బోధనపై మొగ్గు!
జిల్లాలోని అన్ని ఆశ్రమ పాఠశా–లల్లో డిజిటల్ బోధనకు రంగం సిద్ధం చేస్తున్నారు. పాఠ్యాంశాల బోధన కంటే దృశ్య రూపంలోనే విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని నిర్ణయించిన ఐటీడీఏ అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని ఆశ్రమాల్లో ఈ బోధన జరుగుతుండగా మిగిలిన వాటిలో కూడా ఈ తరగతులను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సీతంపేట : జిల్లాలో ఆశ్రమ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో డిజిటల్ బోధనకు శ్రీకారం చుడుతున్నారు. దీనిలో భాగంగా ఆ దిశగా ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎర్నెట్ సంస్థ ద్వారా 20 ఆశ్రమ పాఠశాలల్లో బోధన జరుగుతుండగా మరో నాలుగు గురుకులాల్లో డిజిటల్ బోధన చేస్తున్నారు. అయితే 27 పాఠశాలల్లో నూతనంగా డిజిటల్ బోధన చేయడానికి కేయాన్ సంస్థ ద్వారా విద్యను అందించనున్నారు. ఇప్పటికే కంప్యూటర్లను అమర్చేందుకు రంగం చేస్తున్నారు. ఐటీడీఏ పీవో ఎల్.శివశంకర్ ఇటీవల స్థానిక గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ డిజిటల్ బోధన చూసిన అనంతరం అన్ని పాఠశాలల్లో దీన్ని అమలు చేస్తామని తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దృశ్య రూపంలో పాఠ్య బోధన.. పదిసార్లు విన్న దాని కంటే ఒక్కసారి చూస్తే ఆ దృశ్యం మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. ప్రతీ రోజూ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విన్న అనంతరం విద్యార్థులు దానిని మననం చేసుకుంటారు. అదే పాఠాన్ని దృశ్య రూపంలో విద్యార్థులకు చూపిస్తే ఎన్నటికీ గుర్తుండిపోతుంది. పరీక్షల్లో జవాబులనూ జ్ఞాపకశక్తి, అవగాహనతో రాయగలుగుతారు. పాఠాలను దృశ్య రూపంలో చూపించే యత్నమే డిజిటల్ విద్యా తరగతులు. పాఠ్యాంశాల్లో ఉన్న అంశాలను ప్రాజెక్టర్ ద్వారా దృశ్య రూపంలో విద్యార్థులు తెరపైన చూస్తారు. ప్రతీ పాఠానికి సంబంధించిన సీడీల ద్వారా దృశ్య బోధన ఉంటుంది. సాధారణ బోధనలో విజ్ఞాన పాఠాలు, అంతరిక్షం, వివిధ ప్రయోగాలు చూడడం ద్వారా విద్యార్థి మదిలో ఆ విషయాలు నిక్షిప్తమౌతాయి. అనుమానాల నివృత్తికి అవకాశం ఉంటుంది. వెనుకబడిన విద్యార్థులకు ఈ బోధన ఎంతో ప్రయోజనం. -
డిజిటల్ టీచింగ్
► నాణ్యమైన విద్యే ప్రధానం ► సులువుగా అర్థం చేరుుంచడమే లక్ష్యం ► కొత్తగా ఉందంటున్న విద్యార్థులు ► మరిన్ని ఇస్తే బాగుండంటున్న ఉపాధ్యాయులు సప్తగిరికాలనీ : కాలానికి అనుగుణంగా మారడం ప్రకృతి ధర్మం. మార్పుతోనే అభివృద్ధి సాధ్యం. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తయారు చేసేందుకు డిజిటల్ టీచింగ్‌కు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన డిజిటల్ తరగతులు జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమయ్యారుు. ఎలాంటి విషయాన్నైనా దృశ్యరూపంలో సులువుగా అర్థం చేసుకోవడంతోపాటు చాలా కాలం గుర్తుంచుకుంటారని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. సంబురంలో విద్యార్థులు కొన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదిని అందంగా ముస్తాబు చేశారు. కొత్తగా పాఠాలు బోధించబోతున్నారని తెలవడంతో పలు పాఠశాలల్లో హాజరుశాతం సైతం పెరిగినట్లు సమాచారం. ఇలాంటి పాఠాలు అన్ని తరగతులకు కావాలని విద్యార్థులు కోరుతున్నారు. టీవీల్లో కాకుండా ప్రొజెక్టర్ల ద్వారా చూపించాలని, ఒక్కోటి కాకుండా పాఠశాలకు మూడు, నాలుగు డిజిటల్ తరగతులు ఇవ్వాలని కోరుతున్నారు. అన్ని సబ్జెక్టులు బోధించాలి డిజిటల్ క్లాసులతో పాఠాలు సులువుగా అర్థమవుతున్నా రుు. ఉపాధ్యాయులు తరగతి గదిలో చెప్పింది ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీని ద్వారా ఎ క్కువ రోజులు గుర్తుండిపోతా రుు. బుక్‌లో ఉన్న ప్రతి పాఠ్యాంశం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అన్ని సబ్జెక్టులను ఈ తరహా లో చెబితే అందరికీ సులువుగా అర్థమవుతారుు. - లుబ్నా షెర్వత్, కార్ఖానగడ్డ పాఠశాల నెట్ సౌకర్యం కల్పించాలి డిజిటల్ తరగతులతో విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటున్నారు. కీలకాంశాలను డిజిటల్ ద్వారా చూపిస్తే ఎక్కువ రోజులు గుర్తుంచుకుంటారు. ఇంతేకాకుండా ప్రతి పాఠశాలకు ముడు, నాలుగు డిజిటల్ సౌకర్యాలు కల్పించాలి. ప్రస్తుతం హార్డ్ డిస్కుల ద్వారా బోధన జరుగుతోంది. నెట్ సౌకర్యం కల్పిస్తే లైవ్ ద్వారా వినవచ్చు. -ఎ.లక్ష్మణ్‌రావు, ఉపాధ్యాయుడు, ధన్గర్‌వాడీ స్కూల్ కార్పొరేటుకు దీటుగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ తరగతుల బోధన ప్రభుత్వ విద్యారంగంలో సాంకేతిక విప్లవం. కార్పొరేట్‌స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తాం. వీటి ద్వారా పాఠశాల విద్య బలోపేతమవుతుంది. - గాజుల రవీందర్,ఉపాధ్యాయుడు, కార్ఖానగడ్డ స్కూల్ ఇక ర్యాంకులు సాధిస్తాం డిజిటల్ పాఠాలు సులువుగా అర్థమవుతున్నారుు. డిజిటల్ బోధనతోనే ప్రైవేట్ పాఠశాలలకు ర్యాంకులు వచ్చేవి. ఇప్పుడు మేము కూడా ర్యాంకులు సాధిస్తాం. ఒక్కసారి వింటే మరిచిపోయే ప్రసక్తే లేదు. మా క్లాస్‌రూమ్‌ను అందంగా ముస్తాబు చేశాం. డిజిటల్ పాఠాలు వినడం చాలా ఆనందంగా ఉంది.- నవ్య, సుభాష్‌నగర్ స్కూల్ కొత్తగా ఉంది డిజిటల్లో పాఠాలు కొత్తగా ఉన్నారుు. ప్రొజెక్టర్ల ద్వారా పాఠాలు చెబుతారని ఉపాధ్యాయులు చెప్పారు. ఎలా ఉంటాయేమోనని ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారని చూశాం. చూశాక చాలా బాగా అనిపించింది. ఇలా రోజు ఉండాలి. - జె.రోషిణి, ధన్గర్‌వాడీ పాఠశాల పటాలు స్పష్టంగా చూస్తున్నాం డిజిటల్ పాఠాలు చాలా బాగున్నారుు. జీవశాస్త్రానికి సంబంధించిన పాఠాలు ఈజీగా అర్థమయ్యారుు. ఇవేకాకుండా సైన్‌సకు సంబంధించిన పటాలు స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఈ అవకాశాన్ని కల్పించిన గవర్నమెంట్‌కు థాంక్స్.- ఎం.మౌనిక, మంకమ్మతోట పాఠశాల