డిజిటల్ టీచింగ్ | Digital Teaching in schools | Sakshi
Sakshi News home page

డిజిటల్ టీచింగ్

Published Fri, Nov 18 2016 3:15 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

డిజిటల్ టీచింగ్

డిజిటల్ టీచింగ్

కాలానికి అనుగుణంగా మారడం ప్రకృతి ధర్మం. మార్పుతోనే అభివృద్ధి సాధ్యం.

నాణ్యమైన విద్యే ప్రధానం
సులువుగా అర్థం చేరుుంచడమే లక్ష్యం
కొత్తగా ఉందంటున్న విద్యార్థులు
►  మరిన్ని ఇస్తే బాగుండంటున్న ఉపాధ్యాయులు

 
సప్తగిరికాలనీ : కాలానికి అనుగుణంగా మారడం ప్రకృతి ధర్మం. మార్పుతోనే అభివృద్ధి సాధ్యం. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తయారు చేసేందుకు డిజిటల్ టీచింగ్‌కు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన డిజిటల్ తరగతులు జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమయ్యారుు. ఎలాంటి విషయాన్నైనా దృశ్యరూపంలో సులువుగా అర్థం చేసుకోవడంతోపాటు చాలా కాలం గుర్తుంచుకుంటారని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

సంబురంలో విద్యార్థులు
కొన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదిని అందంగా ముస్తాబు చేశారు. కొత్తగా పాఠాలు బోధించబోతున్నారని తెలవడంతో పలు పాఠశాలల్లో హాజరుశాతం సైతం పెరిగినట్లు సమాచారం. ఇలాంటి పాఠాలు అన్ని తరగతులకు కావాలని విద్యార్థులు కోరుతున్నారు. టీవీల్లో కాకుండా ప్రొజెక్టర్ల ద్వారా చూపించాలని, ఒక్కోటి కాకుండా పాఠశాలకు మూడు, నాలుగు డిజిటల్ తరగతులు ఇవ్వాలని కోరుతున్నారు.
 
అన్ని సబ్జెక్టులు బోధించాలి
డిజిటల్ క్లాసులతో పాఠాలు సులువుగా అర్థమవుతున్నా రుు. ఉపాధ్యాయులు తరగతి గదిలో చెప్పింది ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీని ద్వారా ఎ క్కువ రోజులు గుర్తుండిపోతా రుు. బుక్‌లో ఉన్న ప్రతి పాఠ్యాంశం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అన్ని సబ్జెక్టులను ఈ తరహా లో చెబితే అందరికీ సులువుగా అర్థమవుతారుు. - లుబ్నా షెర్వత్, కార్ఖానగడ్డ పాఠశాల
 
నెట్ సౌకర్యం కల్పించాలి
డిజిటల్ తరగతులతో విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటున్నారు. కీలకాంశాలను డిజిటల్ ద్వారా చూపిస్తే ఎక్కువ రోజులు గుర్తుంచుకుంటారు. ఇంతేకాకుండా ప్రతి పాఠశాలకు ముడు, నాలుగు డిజిటల్ సౌకర్యాలు కల్పించాలి. ప్రస్తుతం హార్డ్ డిస్కుల ద్వారా బోధన జరుగుతోంది. నెట్ సౌకర్యం కల్పిస్తే లైవ్ ద్వారా వినవచ్చు. -ఎ.లక్ష్మణ్‌రావు, ఉపాధ్యాయుడు, ధన్గర్‌వాడీ స్కూల్
 
కార్పొరేటుకు దీటుగా..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ తరగతుల బోధన ప్రభుత్వ విద్యారంగంలో సాంకేతిక విప్లవం. కార్పొరేట్‌స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తాం. వీటి ద్వారా పాఠశాల విద్య బలోపేతమవుతుంది. - గాజుల రవీందర్,ఉపాధ్యాయుడు, కార్ఖానగడ్డ స్కూల్
 
ఇక ర్యాంకులు సాధిస్తాం

డిజిటల్ పాఠాలు సులువుగా అర్థమవుతున్నారుు. డిజిటల్ బోధనతోనే ప్రైవేట్ పాఠశాలలకు ర్యాంకులు వచ్చేవి. ఇప్పుడు మేము కూడా ర్యాంకులు సాధిస్తాం. ఒక్కసారి వింటే మరిచిపోయే ప్రసక్తే లేదు. మా క్లాస్‌రూమ్‌ను అందంగా ముస్తాబు చేశాం. డిజిటల్ పాఠాలు వినడం చాలా ఆనందంగా ఉంది.- నవ్య, సుభాష్‌నగర్ స్కూల్
 
కొత్తగా ఉంది

డిజిటల్‌లో పాఠాలు కొత్తగా ఉన్నారుు. ప్రొజెక్టర్ల ద్వారా పాఠాలు చెబుతారని ఉపాధ్యాయులు  చెప్పారు. ఎలా ఉంటాయేమోనని ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారని చూశాం. చూశాక చాలా బాగా అనిపించింది. ఇలా రోజు ఉండాలి.
 - జె.రోషిణి, ధన్గర్‌వాడీ పాఠశాల పటాలు స్పష్టంగా చూస్తున్నాం
 
డిజిటల్ పాఠాలు చాలా బాగున్నారుు. జీవశాస్త్రానికి సంబంధించిన పాఠాలు ఈజీగా అర్థమయ్యారుు. ఇవేకాకుండా సైన్‌‌సకు సంబంధించిన పటాలు స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఈ అవకాశాన్ని కల్పించిన గవర్నమెంట్‌కు థాంక్స్.- ఎం.మౌనిక, మంకమ్మతోట పాఠశాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement