‘సురుచి’ని సందర్శించిన దర్శకుడు వంశీ | DIRECTOR VAMSI SURUCHI VISIT | Sakshi
Sakshi News home page

‘సురుచి’ని సందర్శించిన దర్శకుడు వంశీ

Jan 12 2017 10:50 PM | Updated on Sep 5 2017 1:06 AM

మండలంలోని తాపేశ్వరంలో గల సురుచి ఫుడ్స్‌ సంస్థలో ప్రముఖ సినీ దర్శకుడు వంశీ గురువారం సందర్శించారు. ‘లేడీస్‌ టైలర్‌’ సీక్వెల్‌ సినిమా షూటింగ్‌ నుంచి సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామమైన రాయవరం మండలం పసలపూడి వెళుతూ సురుచిని సందర్శించారు.

తాపేశ్వరం (మండపేట) : 
మండలంలోని తాపేశ్వరంలో గల సురుచి ఫుడ్స్‌ సంస్థలో ప్రముఖ సినీ దర్శకుడు వంశీ గురువారం సందర్శించారు. ‘లేడీస్‌ టైలర్‌’ సీక్వెల్‌ సినిమా షూటింగ్‌ నుంచి సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామమైన రాయవరం మండలం పసలపూడి వెళుతూ సురుచిని సందర్శించారు. ఆయనకు సురుచి సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు స్వాగతం పలికారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక స్టాలు, సాంప్రదాయ పిండివంటలను చూపించారు. ఈ సందర్భంగా వంశీ తనకు బాల్యం నుంచి తాపేశ్వరంలోని కాజా మాతృసంస్థ తెలుసునంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జిల్లాకు ఎప్పుడు వచ్చినా సురుచి సందర్శిస్తానన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement