గిన్నీస్‌ లడ్డూల ‘సలాది’ మృతి | saladhi death | Sakshi
Sakshi News home page

గిన్నీస్‌ లడ్డూల ‘సలాది’ మృతి

Published Fri, Mar 10 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

గిన్నీస్‌ లడ్డూల ‘సలాది’ మృతి

గిన్నీస్‌ లడ్డూల ‘సలాది’ మృతి

  • అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన శ్రీనుబాబు
  • గ్రామంలో విషాదఛాయలు.. పలువురు పరామర్శ
  • తాపేశ్వరం (మండపేట) :
    భారీ లడ్డూల తయారీలో వరుసగా ఐదుసార్లు గిన్నీస్‌ రికార్డులు నెలకొల్పిన శ్రీ భక్తాంజనేయ స్వీట్‌స్టాల్‌ అధినేత సలాది శ్రీనుబాబు (45) గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గతంలో యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా ఈయన పనిచేశారు. మడత కాజా తయారీకి ప్రసిద్ధి చెందిన తాపేశ్వరం ఖ్యాతిని భారీలడ్డూల తయారీ ద్వారా గిన్నీస్‌ పుటల్లోకి తీసుకువెళ్లిన శ్రీనుబాబుకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన సతీమణి స్వర్ణకుమారి గతంలో గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 

    గ్రామంలో అలుముకున్న విషాదం
    శ్రీనుబాబు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. శుక్రవారం ఉదయం ఆస్పత్రి నుంచి తాపేశ్వరంలో ఆయన నివాసానికి తీసుకువచ్చారు. పెద్ద ఎత్తున స్థానికులు శ్రీనుబాబు భౌతికఖాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బిక్కిన కృష్ణార్జునచౌదరి, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), పలువురు ప్రముఖులు శ్రీనుబాబు భౌతిక కాయానికి నివాళులరి్పంచారు. శ్రీనుబాబు మృతికి సంతాపంగా గ్రామంలోని దుకాణాలను మూసివేశారు. శ్రీనుబాబు అంతిమయాత్రలో అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
     
    గిన్నీస్‌ రికార్డుల పరంపర
    2011 పూర్వం వరకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ఒక వేడుకలో 500 కిలోల లడ్డూ గిన్నీస్‌ రికార్డును స్థానం సంపాదించగా అతి భారీ లడ్డూల తయారీతో ఆ రికార్డును తిరగరాశారు. 2011లో విశాఖపట్నానికి చెందిన ఆర్డరుపై 11 మంది సంస్థ సిబ్బంది ఎనిమిది గంటల పాటు శ్రమించి చేసిన 5,570 కిలోల లడ్డూ తొలిసారిగా గిన్నీస్‌ రికార్డు నెలకొల్పింది. 2012 చవితి వేడుకల కోసం రాజమహేంద్రవరంలోని రాజమహేంద్రి గణేష్‌ ఉత్సవ కమిటీ వారి ఆర్డరుపై 14 మంది సిబ్బంది 14 గంటల పాటు శ్రమించి తయారుచేసిన 6,599.29 కేజీల లడ్డూ పాత రికార్డును తిరగరాసింది. 2013లో రాజమహేంద్రి గణేష్‌ ఉత్సవ కమిటీ కోసం 14 మంది సిబ్బంది 14 గంటల పాటు శ్రమించి 2013లో తయారు చేసిన 7,132.87 కేజీల మహాలడ్డూ కొత్త రికార్డును నెలకొల్పింది. 2014లో విశాఖపట్నం వారి ఆర్డరుపై 14 మంది సిబ్బంది 6.40 గంటల వ్యవధిలో 7,858 కిలోల లడ్డూ చేశారు. 2015లో విశాఖపట్నం వారి ఆర్డరుపై 14 మంది సిబ్బంది ఎనిమిది గంటల వ్యవధిలో తయారు చేసిన 8,369 కిలోలు రికార్డును 
    నెలకొల్పారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement