TAPESWARAM
-
Tapeswaram Kaja: శర్వానంద్, రష్మికలకు బాహుబలి కాజా
మండపేట(తూర్పుగోదావరి): సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన సినీతారలను తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ బాహుబలి కాజాతో సత్కరించింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం షూటింగ్ ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగింది. షూటింగ్లో పాల్గొన్న హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మికలకు సురుచి పీఆర్ఓ వర్మ బాహుబలి కాజాలను అందజేశారు. శర్వానంద్ మాట్లాడుతూ తనకు మడత కాజా అంటే చాలా ఇష్టమని, గతంలో తాను సురుచిని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారని వర్మ తెలిపారు. చదవండి: పూరి జగన్నాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్ -
గిన్నీస్ లడ్డూల ‘సలాది’ మృతి
అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన శ్రీనుబాబు గ్రామంలో విషాదఛాయలు.. పలువురు పరామర్శ తాపేశ్వరం (మండపేట) : భారీ లడ్డూల తయారీలో వరుసగా ఐదుసార్లు గిన్నీస్ రికార్డులు నెలకొల్పిన శ్రీ భక్తాంజనేయ స్వీట్‌స్టాల్ అధినేత సలాది శ్రీనుబాబు (45) గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గతంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ఈయన పనిచేశారు. మడత కాజా తయారీకి ప్రసిద్ధి చెందిన తాపేశ్వరం ఖ్యాతిని భారీలడ్డూల తయారీ ద్వారా గిన్నీస్ పుటల్లోకి తీసుకువెళ్లిన శ్రీనుబాబుకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన సతీమణి స్వర్ణకుమారి గతంలో గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. గ్రామంలో అలుముకున్న విషాదం శ్రీనుబాబు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. శుక్రవారం ఉదయం ఆస్పత్రి నుంచి తాపేశ్వరంలో ఆయన నివాసానికి తీసుకువచ్చారు. పెద్ద ఎత్తున స్థానికులు శ్రీనుబాబు భౌతికఖాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జునచౌదరి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), పలువురు ప్రముఖులు శ్రీనుబాబు భౌతిక కాయానికి నివాళులరి్పంచారు. శ్రీనుబాబు మృతికి సంతాపంగా గ్రామంలోని దుకాణాలను మూసివేశారు. శ్రీనుబాబు అంతిమయాత్రలో అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. గిన్నీస్ రికార్డుల పరంపర 2011 పూర్వం వరకు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఒక వేడుకలో 500 కిలోల లడ్డూ గిన్నీస్ రికార్డును స్థానం సంపాదించగా అతి భారీ లడ్డూల తయారీతో ఆ రికార్డును తిరగరాశారు. 2011లో విశాఖపట్నానికి చెందిన ఆర్డరుపై 11 మంది సంస్థ సిబ్బంది ఎనిమిది గంటల పాటు శ్రమించి చేసిన 5,570 కిలోల లడ్డూ తొలిసారిగా గిన్నీస్ రికార్డు నెలకొల్పింది. 2012 చవితి వేడుకల కోసం రాజమహేంద్రవరంలోని రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆర్డరుపై 14 మంది సిబ్బంది 14 గంటల పాటు శ్రమించి తయారుచేసిన 6,599.29 కేజీల లడ్డూ పాత రికార్డును తిరగరాసింది. 2013లో రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ కోసం 14 మంది సిబ్బంది 14 గంటల పాటు శ్రమించి 2013లో తయారు చేసిన 7,132.87 కేజీల మహాలడ్డూ కొత్త రికార్డును నెలకొల్పింది. 2014లో విశాఖపట్నం వారి ఆర్డరుపై 14 మంది సిబ్బంది 6.40 గంటల వ్యవధిలో 7,858 కిలోల లడ్డూ చేశారు. 2015లో విశాఖపట్నం వారి ఆర్డరుపై 14 మంది సిబ్బంది ఎనిమిది గంటల వ్యవధిలో తయారు చేసిన 8,369 కిలోలు రికార్డును నెలకొల్పారు. -
‘సురుచి’ని సందర్శించిన దర్శకుడు వంశీ
తాపేశ్వరం (మండపేట) : మండలంలోని తాపేశ్వరంలో గల సురుచి ఫుడ్స్ సంస్థలో ప్రముఖ సినీ దర్శకుడు వంశీ గురువారం సందర్శించారు. ‘లేడీస్ టైలర్’ సీక్వెల్ సినిమా షూటింగ్ నుంచి సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామమైన రాయవరం మండలం పసలపూడి వెళుతూ సురుచిని సందర్శించారు. ఆయనకు సురుచి సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు స్వాగతం పలికారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక స్టాలు, సాంప్రదాయ పిండివంటలను చూపించారు. ఈ సందర్భంగా వంశీ తనకు బాల్యం నుంచి తాపేశ్వరంలోని కాజా మాతృసంస్థ తెలుసునంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జిల్లాకు ఎప్పుడు వచ్చినా సురుచి సందర్శిస్తానన్నారు. -
లడ్డూ కావాలా ..గణనాథా!
వినాయక చవితి ... ప్రకృతితో అనుబంధం ... పండ్లు, పత్రాలు, తోరణాలే గుర్తుకు వస్తాయి... పిండి వంటల్లోకి వస్తే ఉండ్రాళ్లు. ఇదంతా గతం. నేటితరం గణనాథులు కొంగొత్త అవతారాల్లో సాక్షాత్కరిస్తున్నారు. ఆ అలంకరణలకు అనుగుణంగా హైటెక్ పూజలు అందుకుంటున్నాడు ఆ పార్వతీ పుత్రుడు. విగ్రహం ఎత్తులోనే కాదు పెట్టే ప్రసాదంలోనూ పోటాపోటీయే. ఉండ్రాళ్ల స్థానంలో లడ్డూలు ప్రత్యక్షమయ్యాయి. ‘ఇంతింతై వటుడింతై..’ చందంగా కొండంతై ప్రపంచ రికార్డుల కోసం పరుగులు తీస్తున్నాయి. ఇందుకు జిల్లాలోని మండపేట మండలం తాపేశ్వరం కొన్నేళ్లుగా వేదికవుతోంది. ఇక్కడి ప్రముఖ స్వీట్ సంస్థలు ‘దీక్షా’దక్షతలతో సృష్టిస్తున్న మహాలడ్డూలు భక్తులకు కను‘విందు’ చేస్తున్నాయి. -
గిన్నిస్ రికార్డు కోసం 13 టన్నుల మహాలడ్డు
తాపేశ్వరం (మండపేట) : మహా లడ్డూల తయారీతో ఐదుసార్లు గిన్నిస్ రికార్డులు సాధించిన తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీట్స్ సంస్థ మరోసారి రికార్డు సాధించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది వినాయక చవితి వేడుకల సందర్భంగా 13,000 కేజీలకు పైగా భారీ లడ్డూ తయారు చేయనున్నట్టు సంస్థ అధినేత సలాది శ్రీనుబాబు శుక్రవారం విలేకరులకు తెలిపారు. తమ సంస్థ మహా లడ్డూల తయారీలో 2011 నుంచి వరుసగా ఐదుసార్లు గిన్నిస్ రికార్డులు నెలకొల్పిందన్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా లడ్డూల తయారీలో తమ సంస్థ ఇప్పటికే 72 జాతీయ, అంతర్జాతీయ రికార్డులను సాధించిందన్నారు. పాత రికార్డులను తిరగరాసే విధంగా ఈ ఏడాది 13 టన్నులకుపైగా లడ్డూను తయారు చేస్తున్నట్టు చెప్పారు. విజయవాడలోని డూండీ గణేష్ కమిటీకి 8,500 కేజీల లడ్డూతోపాటు అక్కడ ప్రతిషి్ఠంచే వినాయకుని చేతిలో ఉంచేందుకు మరో వెయ్యి కేజీల లడ్డూను కానుకగా అందజేయనున్నట్టు తెలిపారు. లడ్డూల తయారీ కోసం 13 మంది సిబ్బంది గణేష్ మాలలు ధరించి బూందీ తీయడంతోపాటు డ్రైఫ్రూట్స్‌ను సిద్ధం చేస్తున్నారన్నారు. -
ఖైరతాబాద్ లడ్డూ తయారీకి శ్రీకారం
తాపేశ్వరం (మండపేట) : వినాయక చవితి వేడుకలకు ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథునికి 500 కిలోల లడ్డూను కానుకగా అందించేందుకు తాపేశ్వరంలోని సురుచిఫుడ్స్ సంస్థ ఏర్పాట్లలో నిమగ్నమైంది. అందులో భాగంగా లడ్డూ తయారీ కోసం సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు దంపతులు ఆదివారం పందిరి ఏర్పాటుకు రాటముహూర్తం చేశారు. 2010వ సంవత్సరంలో ఖైరతాబాద్ గణనాథునికి 500 కిలోల లడ్డూను కానుకగా అందజేసిన సురుచి ఫుడ్స్ సంస్థ అప్పటి నుంచి ఏయేటికాయేడు లడ్డూ పరిమాణాన్ని పెంచుతూ ఖైరతాబాద్ గణనాథునికి లడ్డూను కానుకగా అందజేస్తోంది. 2011లో 2400 కిలోల లడ్డూ తయారు చేయగా, 2012లో 3,500 కిలోల లడ్డూను నైవేద్యంగా సమర్పించారు. 2013లో 4,200 కిలోలు, 2014లో 5,200 కిలోలు, 2015లో 6,000 కిలోల లడ్డూను స్వామివారికి అందజేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రా లడ్డూను కానుకగా స్వీకరించడంపై అక్కడి నేతల నుంచి వస్తున్న అభ్యంతరాలు, ప్రసాదం పంపిణీ వివాదస్పదమవుతుండటంతో ఈ ఏడాది లడ్డూ కానుక స్వీకరణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది లడ్డూను కానుకగా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని, వారే సొంతంగా తయారుచేసుకోవాలని భావిస్తే అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని ఉత్సవ కమిటీకి మల్లిబాబు తెలిపారు. 500 కిలోల లడ్డూ తయారు చేసి ఇవ్వాలన్న ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కోరిక మేరకు లడ్డూ తయారీ చేపడుతున్నట్టు మల్లిబాబు తెలిపారు. ఏటా మాదిరి పందిరి ఏర్పాటు కోసం సురుచి సంస్థ ఆవరణలో మల్లిబాబు, భారతి దంపతులు రాటముహూర్తం చేశారు. -
బొజ్జ గణపయ్య కోసం భారీ లడ్డూలు
-
విశాఖ తరలిన ‘నవ్యాంధ్ర లడ్డూ’
తాపేశ్వరం (మండపేట): తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీట్‌స్టాల్ ఈ వినాయక చవితి కోసం తయారుచేసిన 8,300 కిలోల భారీ ‘నవ్యాంధ్ర’ లడ్డూను బుధవారం ప్రత్యేక వాహనంలో విశాఖపట్నం తరలించింది. 6,300 కిలోల మరో లడ్డూను విజయవాడ తరలించారు. ఈ స్వీట్ స్టాల్ అధినేత సలాది వెంకటేశ్వరరావు(శ్రీనుబాబు) గత నాలుగేళ్లుగా వినాయక చవితికి అతిపెద్ద లడ్డూల తయారీతో వరుస గిన్నిస్ రికార్డులు నెలకొల్పారు. ఉత్సవ కమిటీల నుంచి ఆర్డర్లపై 2011లో 5,570 కేజీలు, 2012లో 6,599 కేజీలు, 2013లో 7,132 కేజీలు, 2014లో 7,858 కేజీల లడ్డూలు తయారుచేసి గిన్నిస్ రికార్డులను సాధించారు. ఈ ఏడాది విశాఖలో నెలకొల్పనున్న 80 అడుగుల భారీ గణనాథుని కోసం 8,300 కిలోల లడ్డూ తయారీ ద్వారా పాత రికార్డులను తిరగరాశారు. శ్రీనుబాబుతో పాటు 14 మంది సిబ్బంది ఆరు గంటల వ్యవధిలో లడ్డూ తయారీని పూర్తిచేశారు. కాగా విజయవాడలో నెలకొల్పనున్న 53 అడుగుల డూండీ గణనాథుని కోసం 6,300 కిలోల లడ్డూను 4.50 గంటల వ్యవధిలో పూర్తి చేశారు. బుధవారం శ్రీనుబాబు దంపతులు ప్రత్యేక పూజల అనంతరం క్రేన్‌సాయంతో రెండు లడ్డూలను ప్రత్యేక వాహనాల్లోకి ఎక్కించి తరలించారు. భారీ లడ్డూలను తిలకించేందుకు తాపేశ్వరం, పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. 8,300 కిలోల నవ్యాంధ్ర లడ్డూతో సరికొత్త గిన్నిస్ రికార్డుతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు, వరల్డ్ అమేజింగ్ రికార్డ్సు, రికార్డు హోల్డర్స్ రిపబ్లిక్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్సు, ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్సు తదితర 13 రికార్డులు సాధించినట్టు శ్రీనుబాబు తెలిపారు. -
‘ఖైరతాబాద్’ లడ్డూ తయారీ ప్రారంభం
తాపేశ్వరం (మండపేట) : ఖైరతాబాద్ గణనాథునికి తాపేశ్వరం సురుచి ఫుడ్స్ సంస్థ సమర్పించనున్న మహాలడ్డూ తయారీ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. గణనాథుడి కోసం సురుచి సంస్థ 5,600 కిలోల లడ్డూ తయారు చేయనున్న విషయం విదితమే. ఇందుకోసం సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబుతో పాటు 15 మంది కార్మికులు గణపతి మాలలు ధరించారు. శనివారం లడ్డూ కోసం బూందీ తీయడం ప్రారంభించారు. ఇందుకోసం పొయ్యి లేని అత్యాధునిక వంటశాలను ప్రారంభించారు. థర్మల్ హీటింగ్ విధానంలోనిఈ వంటశాలలో కళాయిలు మాత్రమే ఉంటాయి. వంట చెరకు ఆధారిత ద్రవరూప గ్యాస్ ఇంధనంగా ఒకే వేడితో ఈ కళాయిల్లో నెయ్యి వేసి లడ్డూలు తీయడం ప్రారంభించారు. ఈ రకమైన వంటశాల రాష్ట్రంలో ఇదే మొదటిదని మల్లిబాబు తెలిపారు. మహాలడ్డూ తయారీకి మరికొన్ని కొత్త యంత్రాలను కూడా వినియోగిస్తున్నట్టు తెలిపారు. -
దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!
దేశ వ్యాప్తంగా మహా గణపతిగా పేరుగాంచిన ఖైరతాబాద్ గణపతి చేతిలో పెట్టే లడ్డూ ప్రసాదం తయారీ ఎంతో ప్రత్యేకమే కాదు.. పవిత్రం కూడా. ఈ లడ్డూ తయారీకి ఓ చిన్నారి కారణం కావడం విశేషం. ఈ మహా ప్రసాదాన్ని సమర్పించడం 2010 నుంచే ప్రారంభమైంది. అంతకు ముందు గణనాథుడి చేతిలో కృత్రిమంగా చేసిన ప్రసాదం ఉండేది. అయితే, తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పి.వి.వి.ఎస్.మల్లికార్జురావు (మల్లిబాబు) 2009లో కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు వచ్చారు. అప్పుడు ఆయన మూడేళ్ల కూతురు మనస్వి దేవుడి చేతిలో మట్టి లడ్డూను చూసి ‘దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!’ అని ప్రశ్నించింది. ఇది మల్లిబాబులో బలంగా ముద్రపడింది. దీంతో దేవుడికి నిజమైన లడ్డూనే ప్రసాదంగా సమర్పించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్, శిల్పి రాజేంద్రన్‌ను కలిసి తన ఆలోచనను వివరించారు. వారి అనుమతితో మరుసటి ఏడు 2010లో 600 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. అదే విధంగా 2011లో 2400 కిలోలు, 2012లో 3500 కిలోలు, 2013లో 4200 కిలోల లడ్డూను మహా గణనాథుడికి ప్రసాదంగా సమర్పించారు. ఇదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది 5000 కిలోలు (ఐదు టన్నులు) లడ్డూను సమర్పించనున్నారు. ఈ ప్రసాదం తయారీని ఓ బృందం ఎంతో పవిత్రంగా చేపడతారు. అది ఎలాగంటే.. ప్రసాదం తయారీ ఇలా... యేటా మహా గణపతికి లడ్డూను ప్రసాదం తయారీకి చవితికి పది రోజుల ముందు నుంచే పనులు చేపడతారు. ముహూర్తం చేసుకుని తాపేశ్వరంలోని సురిచి ఫుడ్స్ ఆవరణలో ప్రత్యేక కుటీరాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రసాదం తయారీలో పాల్గొనే సిబ్బందితో పాటు యజమాని మల్లిబాబు కూడా వినాయక మాల ధరించి.. మిఠాయితో విఘ్న నాయకుడి విగ్రహాన్ని తయారు చేసి మండపంలో ప్రతిష్టిస్తారు. అనంతరం పప్పు దినుసులను శుభ్రం చేసి పనులు చేపడతారు. ఇలా ప్రతి సంవత్సరం చీఫ్ కుక్ మల్లి, బెంగాలీ కుక్ ఒప్పితో పాటు 11 మంది సిబ్బంది పాలు పంచుకుంటారు. వీరంతా చవితికి నాలుగు రోజుల ముందు పొయ్యి వెలిగించి తొలుత బూంది తయారు చేస్తారు. లడ్డూకు కావాల్సిన పంచదార, నెయ్యి, జీడిపప్పు, యాలకులు పచ్చ కర్పూరం సిద్ధం చేసి 9 కళాయిల్లో బూంది తీస్తుండగా.. మరో పక్క లడ్డూ చుట్టడం ప్రారంభిస్తారు. సహజ రంగులు, జీడిపప్పు పేస్టుతో లడ్డూపై వినాయకుడి ప్రతిమలను, ఇతర దేవతామూర్తులను రూపొందించి అలంకరిస్తారు. ఈ లడ్డూ సాధారణ వాతావరణంలో ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. ప్రాణమున్నంత వరకు సమర్పిస్తా.. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం గ్రామంలో 1939లో మా నాన్న సత్తిరాజు కాజా తయారీ ప్రారంభించారు. దాన్ని వారసత్వంగా నేను సురుచి ఫుడ్స్ ద్వారా అందజేస్తున్నాను. నేను జీవించి ఉన్నంత కాలం మహా గణపతికి లడ్డూను సమర్పించుకుంటానని ఉత్సవ కమిటీకి మాటిచ్చాను. భగవంతుడికి, భక్తుడికి మధ్య ప్రాంతీయ బేధాలు ఉండవు. ఈ సంవత్సరం మహా లడ్డూను నవరాత్రుల తర్వాత భక్తులకు పంచాలని తీసుకున్న నిర్ణయం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. - మల్లికార్జునరావు, సురుచి ఫుడ్స్ ఈ ఏడాది లడ్డూ కోసం వాడిన పదార్థాలు.. శెనగపప్పు 1450 కిలోలు నెయ్యి 1000 కిలోలు పంచదార 2250 కిలోలు బాదం పప్పు 90 కిలోలు యాలకులు 30 కిలోలు పచ్చ కర్పూరం 10 కిలోలు లడ్డూ తయారీ పనులు ఈ నెల 24న ప్రారంభించారు. ఈ లడ్డూ ఐదు టన్నుల బరువు, 6.5 అడుగుల వ్యాసం, 7.5 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిని 28వ తేదీన ప్రత్యేక వాహనంలో నగరానికి తరలించి 29న వినాయక చవితికి మహా గణపతికి ప్రసాదంగా సమర్పిస్తారు. -
రాజమండ్రిలో 7 వేల కిలోల లడ్డూ తయారీ..గిన్నిస్ లో చోటు!
గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల్లో మూడవసారి చోటు సంపాదించేందుకు రాజమండ్రిలోని ఓ మిఠాయి దుకాణం నిర్వహకులు ప్రపంచంలోనే అతిపెద్ద లడ్డూ తయారీలో నిమగ్నమయ్యారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో రాజమహేంద్రి గణేశ్ ఉత్సవ కమిటీ 7 వేల కిలోల భారీ లడ్డూని తయారు చేస్తున్నారు. సోమవారం ఉదయం పదిగంటలకు భారీ లడ్డూని అందచేస్తామని తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్స్ షాప్ యజమాని ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే వెంకటేశ్వరరావు 2011, 2012 లో రెండుసార్లు గిన్నిస్ బుక్ లో తన పేరుని నమోదు చేసుకున్నారు. భారీ లడ్డు తయారీకి 2 వేల కిలోల చక్కెర, 2వేల కిలోల చనా దాల్, 1500 కిలోల నెయ్యితోపాటు బాదంపప్పు ఇతర దినుసులు వినియోగిస్తున్నారు. అతిపెద్ద లడ్డూ తయారీకి 16 మంది వర్కర్లు పనిచేస్తున్నారని తెలిపారు. భారీ లడ్డూ తయారీకి సుమారు 14.80 లక్షలు ఖర్చు అవుతుందని ఆయన వెల్లడించారు. సోమవారం ఉదయం 8 గంటలకు పుష్కరఘాట్ కు ఊరేగింపుగా బయలుదేరుతామని వెంకటేశ్వరరావు తెలిపారు. త్వరలోనే గిన్నిస్ బుక్ అధికారులకు దరఖాస్తు చేసుకుంటామని తెలిపారు. ఈ భారీ లడ్డూయే కాకుండా మరో 500 లడ్డూల తయారీలో నిమగ్నమయ్యామని.. తెలంగాణలోని నిజమాబాద్, హైదరాబాద్, కోస్తాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరంతోపాటు పలు ప్రాంతాల నుంచి ఆర్డర్లు అందాయన్నారు. తన వ్యాపారంపై సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం ఏమిలేదని వెంకటేశ్వరరావు తెలిపారు. -
ఖైరతాబాద్ గణనాథుని లడ్డూ సిద్ధం
తాపేశ్వరం (మండపేట రూరల్), న్యూస్‌లైన్ : రాజధానిలోని ఖైరతాబాద్ గణేశుని చేతిలో ఉంచేందుకు తాపేశ్వరం సురుచి ఫుడ్స వారు భారీ లడ్డూను తయారు చేశారు. ఈ సంవత్సరం వినాయక చ వితి సంద ర్భంగా ఖైరతాబాద్‌లో 59 అడుగుల ‘గోనాగ చతుర్ముఖ వినాయక’ విగ్రహాన్ని నిలపనున్నారు. ఆ విగ్రహం చేతిలో ఉంచేందుకు సురుచిఫుడ్స్వారు 4,200 కేజీల భారీ లడ్డూను తయారు చేశారు. ఈనెల 31న తనతో పాటు 16 మంది తయారీదారులు గణేష్ మాలలు ధరించి అత్యంత పవిత్రంగా లడ్డూను తయారు చేశారు. శుక్రవారం ఉదయం మొదలుపెట్టి సాయంత్రానికి లడ్డూ తయారీని పూర్తి చేశారు. శనివారం లడ్డూకు తుదిమెరుగులు దిద్ది 8న హైదరాబాద్ తరలించనున్నట్టు సురుచి అధినేత మల్లిబాబు తెలిపారు. లడ్డూ శిఖర భాగంలో ప్రముఖ కళాకారుడు వీరబాబు జీడిపప్పు పౌడర్‌ను ఉపయోగించి చేసిన స్వీట్ పేస్టుతో తయారు చేసిన శివుని విగ్రహాన్ని ఉంచుతామన్నారు. శివుని చేతిలో కమలం, అందులో బుద్ధ గణపతి విగ్రహం ఉంటుందన్నారు. లడ్డూ ముందు భాగాన గజగణనాథుని కి రీటంలో శివుడు కొలువై ఉన్న రూపాన్ని చిత్రించనున్నామన్నారు. లడ్డూ కుడి వైపున సీతారాములు, ఎడమవైపున దుర్గాదేవి చిత్రాలను, లడ్డూ వెనుక భాగంలో ఓంను చిత్రిస్తామని అన్నారు. పూర్తయిన లడ్డూను 8న క్రేన్ సహాయంతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలోకి చేర్చి 9న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణనాథుని చెంతకు చేరుస్తామన్నారు. గవర్నర్ నరసింహన్ ప్రత్యేక పూజల అనంతరం లడ్డూను అక్కడి విఘ్నేశ్వరుని చేతిలో ఉంచుతామన్నారు. 2010లో 500 కేజీలు, 2011లో 2,400కేజీలు, 2012లో 3,500 కేజీల లడ్డూలను ఉచితంగా అందించామన్నారు. గణనాథుని విగ్రహం పరిమాణం పెరుగుదలకు అనుగుణంగా ఈ సంవత్సరం 4,200 కేజీల లడ్డూను ఉచితంగా అందిస్తున్నామన్నారు.