ఖైరతాబాద్ గణనాథుని లడ్డూ సిద్ధం
Published Sat, Sep 7 2013 4:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
తాపేశ్వరం (మండపేట రూరల్), న్యూస్‌లైన్ : రాజధానిలోని ఖైరతాబాద్ గణేశుని చేతిలో ఉంచేందుకు తాపేశ్వరం సురుచి ఫుడ్‌స వారు భారీ లడ్డూను తయారు చేశారు. ఈ సంవత్సరం వినాయక చ వితి సంద ర్భంగా ఖైరతాబాద్‌లో 59 అడుగుల ‘గోనాగ చతుర్ముఖ వినాయక’ విగ్రహాన్ని నిలపనున్నారు. ఆ విగ్రహం చేతిలో ఉంచేందుకు సురుచిఫుడ్స్‌వారు 4,200 కేజీల భారీ లడ్డూను తయారు చేశారు. ఈనెల 31న తనతో పాటు 16 మంది తయారీదారులు గణేష్ మాలలు ధరించి అత్యంత పవిత్రంగా లడ్డూను తయారు చేశారు. శుక్రవారం ఉదయం మొదలుపెట్టి సాయంత్రానికి లడ్డూ తయారీని పూర్తి చేశారు.
శనివారం లడ్డూకు తుదిమెరుగులు దిద్ది 8న హైదరాబాద్ తరలించనున్నట్టు సురుచి అధినేత మల్లిబాబు తెలిపారు. లడ్డూ శిఖర భాగంలో ప్రముఖ కళాకారుడు వీరబాబు జీడిపప్పు పౌడర్‌ను ఉపయోగించి చేసిన స్వీట్ పేస్టుతో తయారు చేసిన శివుని విగ్రహాన్ని ఉంచుతామన్నారు. శివుని చేతిలో కమలం, అందులో బుద్ధ గణపతి విగ్రహం ఉంటుందన్నారు. లడ్డూ ముందు భాగాన గజగణనాథుని కి రీటంలో శివుడు కొలువై ఉన్న రూపాన్ని చిత్రించనున్నామన్నారు. లడ్డూ కుడి వైపున సీతారాములు, ఎడమవైపున దుర్గాదేవి చిత్రాలను, లడ్డూ వెనుక భాగంలో ఓంను చిత్రిస్తామని అన్నారు.
పూర్తయిన లడ్డూను 8న క్రేన్ సహాయంతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలోకి చేర్చి 9న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణనాథుని చెంతకు చేరుస్తామన్నారు. గవర్నర్ నరసింహన్ ప్రత్యేక పూజల అనంతరం లడ్డూను అక్కడి విఘ్నేశ్వరుని చేతిలో ఉంచుతామన్నారు. 2010లో 500 కేజీలు, 2011లో 2,400కేజీలు, 2012లో 3,500 కేజీల లడ్డూలను ఉచితంగా అందించామన్నారు. గణనాథుని విగ్రహం పరిమాణం పెరుగుదలకు అనుగుణంగా ఈ సంవత్సరం 4,200 కేజీల లడ్డూను ఉచితంగా అందిస్తున్నామన్నారు.
Advertisement
Advertisement