పండ్ల మొక్కలు పంపిణీ చేయాలి | distribute the fruite plants | Sakshi
Sakshi News home page

పండ్ల మొక్కలు పంపిణీ చేయాలి

Published Fri, Sep 16 2016 8:01 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

పండ్ల మొక్కలు పంపిణీ చేయాలి - Sakshi

పండ్ల మొక్కలు పంపిణీ చేయాలి

నల్లగొండ టూటౌన్‌ : మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండలానికి పండ్ల మొక్కలు అందించాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశంలో వ్యవసాయ శాఖ స్థాయి సంఘం చైర్మన్‌ కర్నాటి లింగారెడ్డి అధ్యక్షతన జరిగిన వ్యవసాయ అనుబంధ శాఖలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఉపాధిహామీ పథకంలో పనులు చేసిన వారికి నిధులు సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీని కోరారు. మునుగోడు మండలంలోని దొండోరిగూడెం గ్రామానికి రేషన్‌ దుకాణం మంజూరు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను కోరారు. వ్యవసాయ స్థాయి సంఘం చైర్మన్‌ కర్నాటి లింగారెడ్డి మాట్లాడుతూ రబీ సీజన్‌లో రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లాలో రేషన్‌ సరుకులు పక్కదారి పడుతున్నాయని, రేషన్‌డీలర్లపై ప్రత్యేక నిఘా పెట్టి వినియోగదారులకు రేషన్‌ సరుకులు అందించాలన్నారు. అర్హులైన పేదలందరికి  రేషన్‌కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రావుల మహేందర్‌రెడ్డి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, జేడీఏ నర్సింహరావు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement