శిక్షణకు జిల్లా సహకార కేంద్రబ్యాంకు పాలకవర్గం
Published Mon, Jan 30 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు పాలక వర్గం సభ్యులు, సీనియర్ అధికారులు ఆదివారం రాత్రి శిక్షణ నిమిత్తం పోర్టుబ్లెయిర్‌కు వెళ్లారు. వైకుంఠమెహతా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ కో ఆపరేటివ్‌లో బ్యాంకును మరింత అభివృద్ధిలోకి ఏ విధంగా తీసుకోరావచ్చు అనే దానిపై ఫిబ్రవరి నాలుగు వరకు శిక్షణ పొందనున్నారు. ఆదివారం రాత్రి ఎగ్‌మోర్ ఎక్స్‌ప్రెస్ రైలులో చైర్మన్ మల్లికార్జునరెడ్డి, వైస్ చైర్మన్ అహ్మద్‌హుసేన్, బ్యాంకు సీఈఓ రామాంజనేయులు, ఇతర పాలకవర్గ సభ్యులు బయలు దేరారు. జ్ఞాన సముపార్జన నిమిత్తం శిక్షణకు వెళ్తున్నట్లుగా బ్యాంకు వర్గాలు తెలిపాయి.
Advertisement
Advertisement