జిల్లాకు అవార్డుల పంట | district got more awards | Sakshi
Sakshi News home page

జిల్లాకు అవార్డుల పంట

Published Mon, Sep 12 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

district got more awards

హైదరాబాద్‌ : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఐదుగురికి ‘రైతునేస్తం’ పురస్కారాలు అందాయి. హైదరాబాద్‌లోని హోటల్‌ కత్రియలో ఆదివారం నిర్వహించిన ‘రైతునేస్తం’ 12వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ అవార్డులు అందజేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్‌ ఇ.కరుణ శ్రీ(కేవీకే సమన్వయకర్త) విస్తరణ విభాగంలోనూ, అసోసియేట్‌ డీన్‌ ఎ.సుజాత ఉత్తమ సైంటిస్టులుగానూ అవార్డులు అందుకున్నారు. అలాగే ఉండి ఫిషరీస్‌ రీసెర్చ్‌ స్టేష¯Œæకు చెందిన సైంటిస్ట్‌ టి.సుగుణ ఉత్తమ సైంటిస్ట్‌గాను అవార్డును స్వీకరించారు. జిల్లాకు చెందిన గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలిచిన భూపతిరాజు రామకృష్ణంరాజు రైతు నేస్తం అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో రైతు నేస్తం ఎడిటర్‌ వై.వెంకటేశ్వరరావు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement