దొంగముద్ర వేసిన వారిపై చర్యలు | district medical officer orders to negligance doctors | Sakshi
Sakshi News home page

దొంగముద్ర వేసిన వారిపై చర్యలు

Published Fri, Aug 19 2016 6:21 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

district medical officer orders to negligance doctors

అనంతపురం సిటీ: విధులకు డుమ్మా కొడుతున్న వైద్య సిబ్బంది తీరుపై ‘దొంగ ముద్ర’ అన్న శీర్షికన శుక్రవారం సాక్షిలో వచ్చిన కథనానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంటరమణ స్పందించారు. విధులు నిర్వహించాల్సిన చోటకాకుండా పట్టణ కేంద్రాల్లో హాజరువేస్తూ తప్పించుకు తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరు ఎక్కడి నుంచి హాజరు వేసినా, వారెక్కడ విధులు నిర్వహించాలో కూడా అదే మిషన్‌ చెబుతుందన్నారు.

అలాంటి తప్పిదాలు జరిగిన విషయం వాస్తవమేనని చెప్పారు. అలాంటి వారిపై నిఘా ఎప్పుడూ ఉంటుందన్నారు. రెండు రోజుల్లో ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి అధికారిని నియమించి ఈ తరహా హాజరు వేసిన వారి వివరాలను సేకరిస్తామన్నారు. ఇకపై ఈ పర్యావేక్షణ మెత్తాన్ని కూడా వారికే అప్పగిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement