- ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగిన సీపీఎం నేత రాఘవులు
- కోర్టు అనుమతితో దివీస్‌కు వ్యతిరేకంగా నర్శిపేటలో బహిరంగ సభ
- కాలుష్య పరిశ్రమ వల్ల నష్టాలను వివరించిన బాధిత గ్రామాల ప్రజలు
దివీస్‌ను తన్ని తరిమే వరకూ పోరాడతాం
Published Sun, Dec 18 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
తొండంగి :
కోన తీరప్రాంత ప్రజలకు అన్యా యం చేస్తూ కాలుష్య పరిశ్రమను రప్పిం చడానికి అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కా లుష్య దివీస్ ప్రతిపాదిత ప్రాంతం దానవాయిపేట పంచాయతీ నర్శిపేట గ్రామంలో సీపీఎం ఆధ్వర్యాన దివీస్‌కు వ్యతిరేకంగా శనివారం బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా బి.వి.రాఘవులు మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు అగ్ర కులాలకు చెందిన వ్యక్తుల పరిశ్రమల కోసం ఊడిగం చేస్తున్నారన్నారు.జిల్లా కలెక్టర్ దత్తత తీసుకుని ప్రజలకు అన్యాయం చేసే పరిశ్రమకు బంటుగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆగ్రహం వచ్చే వరకూ పరిస్థితులు తీసుకొస్తే అక్రమ భూముల్లో నిర్మిస్తున్న అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని కూల్చి వేస్తామన్నారు.పార్టీ ఆధ్వర్యంలో చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు ఇస్తామన్నారు. బల ప్రయోగానికి దిగితే మాత్రం ప్రజల ఉద్యమంతో పరిశ్రమను తరలిస్తామన్నారు. దివీస్‌ను తరలించకపోతే యనమల రామకృష్ణుడును ఈ ప్రాంతం నుంచి తరిమేస్తామన్నారు.
వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు మట్ల ముసలయ్య, సీపీఐ ఎం.ఎల్. న్యూడెమోక్రసీ నేత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల మద్దతుతోనే యనమల ద్వయం ఎదిగిందన్న విషయం మరిచిపోకూడదన్నారు. ఇప్పుడు అదే ప్రజలను అణగదొక్కాలని చూడడం విచారకరమన్నారు.మత్స్యకార నాయకుడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చొక్కా కాశీఈశ్వరరావు మాట్లాడుతూ దత్తత గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన కలెక్టర్ పరిశ్రమకు దళారిగా మారారన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను వదులుకునేది లేదని ఐద్వా సంఘం నాయకులు పంపాదిపేటకు చెందిన ప్రెసిడెంట్ అంబుజాలపు నాగ కృష్ణవేణి, కొత్తపాకలకు చెందిన అంగుళూరి సుశీల అన్నారు. జనశక్తి నాయకుడు కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజలను అధికారపార్టీ నేతలు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా లెక్క చేయరన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, సీపీఐ ఎం.ఎల్. జనశక్తి నేత కర్నాకుల వీరాంజనేయులు,సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ నేత జే.వెంకటేశ్వర్లు, సీపీఐ ఎం.ఎల్ లిబరేష¯ŒS నేత కె.జనార్ధన్, సీఐటీయూ నాయకుడు ఎం.వేణుగోపాల్, సీపీఎం జిల్లా నాయకులు యు.శ్రీనివాస్, కె.సింహాచలం, జి.అప్పారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అంగుళూరి అరుణ్‌కుమార్ దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు.
నేపథ్యమిలా...
దివీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ బాధిత గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ నేత, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా రంగలంలోకి దిగారు. అనంత రం వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎం.ఎల్. లిబరేషన్, సీపీఐ ఎం. ఎల్ న్యూ డెమోక్రసీ, సీపీఐ జనశక్తి తది తర పార్టీలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశా యి. ఈ నేపధ్యంలో దానవాయిపేట పం చాయతీ నర్శిపేటలో సీపీఎం ఆధ్వర్యం లో మరోసారి కోర్టు అనుమతి ద్వారా బహిరంగ సభను శనివారం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణ, అక్రమ కేసులు, భౌతిక దాడులు, చెట్లు నరికివేత, కాలుష్యం వల్ల వచ్చే పరిస్ధితులను దివీస్ బాధిత గ్రామాల ప్రజలు ఆవేదనను వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement