‘దివీస్‌’పై మహిళాగ్రహం | divees issue | Sakshi
Sakshi News home page

‘దివీస్‌’పై మహిళాగ్రహం

Published Fri, Oct 21 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

‘దివీస్‌’పై మహిళాగ్రహం

‘దివీస్‌’పై మహిళాగ్రహం

  • 144 సెక్ష¯ŒS ఎత్తివేయాలని డిమాండ్‌  
  • తీరప్రాంత గ్రామాల్లో మహిళల ర్యాలీ
  • వాకదారిపేటలో అడ్డుకున్న పోలీసులు 
  • స్వచ్ఛందంగా అరెస్టయిన మహిళలు
  • అన్నవరం పోలీసు స్టేష¯ŒSకు తరలింపు 
  • పోలీసుల హెచ్చరికలపై ఆగ్రహం
  •  
    కాలుష్య భూతం ... భవితంతా అంధకారం ... పచ్చని బతుకుల్లో పరిశ్రమ రూపంలో కాటేస్తుందనే ఆందోళన ... అదే ఆ గ్రామాల ప్రజలను పోరాట పంధాన నడిపిస్తోంది. ప్రజా సంఘాల మద్దతుతో కొద్ది నెలలుగా అలుపెరగని ఉద్యమాలతో ఆ ప్రాంతం అట్టుడికిపోతోంది. గురువారం మరో అడుగు ముందుకేసి నారీ మణులు కొంగు నడుంకు చుట్టి .. పిడికిళ్లు బిగించి కన్నెర్ర చేశారు. గడపదాటి గళం విప్పి గర్జించారు. న్యాయం చేయాలని అభ్యర్థిస్తే నిర్బంధిస్తారా ... అరెస్టులు చేస్తారా అంటూ పహారా కాసిన పోలీసులను ప్రశ్నించారు. స్వచ్ఛందంగా అరెస్టుకు సిద్ధపడ్డారు. 
     
    తొండంగి:
    తీర ప్రాంతంలో దివీస్‌ ల్యాబొరేటరీస్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా బాధిత గ్రామాల మహిళల ఆగ్రహం మరోసారి పెల్లుబికింది. కాలుష్యం వెదజల్లే దివీస్‌ పరిశ్రమ ఏర్పాటును ప్రభుత్వం నిలిపి వేయడంతోపాటు దీర్ఘకాలంగా తీరప్రాంత గ్రామాల్లో అమలు చేస్తున్న 144 సెక్ష¯ŒSను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో బాధిత గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముందుగా తాటియాకులపాలెంలో మహిళలు రోడ్డుపైకి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తుని సీఐ అప్పారావు, తుని రూరల్‌ సీఐ చెన్నకేశవరావు, ఎస్‌సైలు పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. పంపాదిపేటలో మహిళలు ర్యాలీ చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో గ్రామంలో పోలీసు వాహనాలతో పర్యటించి, సమావేశాలు, సభలు నిర్వహించరాదని 144 సెక్ష¯ŒS అమలులో ఉందని హెచ్చరికలు జారీచేసి వెళ్లిపోయారు. ఈ నేపధ్యంలో పంపాదిపేటతో పాటు కొత్తపాకల గ్రామం నుంచి వచ్చిన సుమారు 200 మంది మహిళలు 144 సెక్ష¯ŒSను ఎత్తివేయాలని, కాలుష్యంతో ప్రజల ప్రాణాలు తీసే దివీస్‌ పరిశ్రమ మాకొద్దంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని గ్రామ వీధుల్లో ర్యాలీ చేశారు. నినాదాలను కొనసాగిస్తూ అక్కడి నుంచి శృంగవృక్షంపేట, వాకదారిపేట వరకూ మహిళలు ర్యాలీ కొనసాగించారు.
    ర్యాలీని అడ్డుకున్న పోలీసులు:
    బాధిత గ్రామాల మహిళలు ర్యాలీ చేస్తుండగా పోలీసులు జీపులతో అక్కడి చేరుకున్నారు. సీఐలు అప్పారావు, చెన్నకేశవరావు, ఎస్‌సై బి.కృష్ణమాచారి ఐద్వా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి, ఇతర మహిళలతో చర్చించారు.  శాంతియుతంగా పర్యటిస్తుంటే అడ్డుకోవడం అన్యాయమన్నారు. పచ్చని తీరప్రాంతంలో ఎన్నాళ్లు 144 సెక్ష¯ŒS అమలు చేస్తారని, తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నాధికారుల ఆదేశాల మేరకు అమలు చేస్తున్నామని ఎవరికి వారు వెళ్లిపోవాలని పోలీసులు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఐద్వా సంఘం మహిళలను మహిళా పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. బాధిత గ్రామాల మహిళలంతా తమను కూడా అరెస్టు చేయాలని పట్టుబట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీసుల జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. కొంతసేపు పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల ప్రతిఘటనను ధిక్కరిస్తూ వాకదారిపేట మెయి¯ŒS సెంటర్‌ వరకూ నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. అనంతరం బాధిత మహిళలంతా చర్చించుకుని ఉద్యమానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ స్వచ్ఛందంగా అరెస్టవుతామని తెలిపారు. దీంతో మహిళలను అరెస్టు చేసేందుకు పోలీసు వాహనాన్ని రప్పించారు. బాధిత గ్రామాల మహిళలంతా వ్యానులో ఎక్కారు.
    మహిళల తరలింపును వ్యతిరేకిస్తూ...
    దివీస్‌ పరిశ్రమ వల్ల తమకు కలిగే నష్టాలను చెప్పుకునేందుకు వచ్చిన మహళలను అరెస్టు చేసి తరలించేందుకు అంగీకరించేదిలేదని వాకదారిపేట గ్రామస్తులు పోలీసు వ్యానును అడ్డుకున్నారు. వ్యానును వెళ్లనీయకుండా రోడ్డుపై చెట్లు కొమ్మలను అడ్డుగా వేసి ముందుకు వెళ్లనీయకుండా నిలిపివేశారు. మహిళలను తాము అరెస్టు చేయాలేదని స్వచ్ఛంధంగా వారే అరెస్టవుతామని వ్యానులో కూర్చున్నారని  సీఐలు వివరించారు. వ్యాను దిగేదిలేదనడంతో 50 మంది పైగా మహిళలను అన్నవరం పోలీస్‌స్టేçÙ¯ŒSకు తరలించారు. అరెస్టయిన 42 మందిలో ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి. ప్రభావతి, జిల్లా కార్యదర్శి సి.హెచ్‌.రమణి, సహాయ కార్యదర్శి సునీత, జిల్లా కమిటీ సభ్యులు నాగ వెంకటలక్ష్మి, కృష్ణమ్మ, పంపాదిపేట గ్రామ సంఘం అధ్యక్షుడు అంబుజాలపు నాగ కృష్ణవేణి, కొత్తపాకలు మహిళా సంఘం కమిటీ సభ్యులు అంగుళూరి చిన్నారి, అంగుళూరి బేబి, మచ్చర్ల మాణిక్యమ్మ ఉన్నారు. 
     
    మా ఊరొచ్చి మాపైనే కేసులు పెడతారా...
    నిరసన కార్యక్రమాలను నిలిపివేయాలని, లేకుంటే నా¯ŒS బెయిల్‌బుల్‌ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడాన్ని వాకదారిపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైక్‌ ద్వారా మహిళల వద్దకు వచ్చి 144 అమలు నేపధ్యంలో వీడియోల్లో చిత్రీకరించిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించడంతో ఒక్కసారిగా గ్రామస్తులు పోలీసులపై వాగ్వివాదానికి దిగారు. ‘మేము ఏమి నేరం చేశామని మా ఊరొచ్చి మాపై కేసులు పెడతారా’ అని ప్రశ్నించారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement