divees
-
దివీస్‌ను తన్ని తరిమే వరకూ పోరాడతాం
ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగిన సీపీఎం నేత రాఘవులు కోర్టు అనుమతితో దివీస్‌కు వ్యతిరేకంగా నర్శిపేటలో బహిరంగ సభ కాలుష్య పరిశ్రమ వల్ల నష్టాలను వివరించిన బాధిత గ్రామాల ప్రజలు తొండంగి : కోన తీరప్రాంత ప్రజలకు అన్యా యం చేస్తూ కాలుష్య పరిశ్రమను రప్పిం చడానికి అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కా లుష్య దివీస్ ప్రతిపాదిత ప్రాంతం దానవాయిపేట పంచాయతీ నర్శిపేట గ్రామంలో సీపీఎం ఆధ్వర్యాన దివీస్‌కు వ్యతిరేకంగా శనివారం బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా బి.వి.రాఘవులు మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్ధిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు అగ్ర కులాలకు చెందిన వ్యక్తుల పరిశ్రమల కోసం ఊడిగం చేస్తున్నారన్నారు.జిల్లా కలెక్టర్ దత్తత తీసుకుని ప్రజలకు అన్యాయం చేసే పరిశ్రమకు బంటుగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆగ్రహం వచ్చే వరకూ పరిస్థితులు తీసుకొస్తే అక్రమ భూముల్లో నిర్మిస్తున్న అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని కూల్చి వేస్తామన్నారు.పార్టీ ఆధ్వర్యంలో చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు ఇస్తామన్నారు. బల ప్రయోగానికి దిగితే మాత్రం ప్రజల ఉద్యమంతో పరిశ్రమను తరలిస్తామన్నారు. దివీస్‌ను తరలించకపోతే యనమల రామకృష్ణుడును ఈ ప్రాంతం నుంచి తరిమేస్తామన్నారు. వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు మట్ల ముసలయ్య, సీపీఐ ఎం.ఎల్. న్యూడెమోక్రసీ నేత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల మద్దతుతోనే యనమల ద్వయం ఎదిగిందన్న విషయం మరిచిపోకూడదన్నారు. ఇప్పుడు అదే ప్రజలను అణగదొక్కాలని చూడడం విచారకరమన్నారు.మత్స్యకార నాయకుడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చొక్కా కాశీఈశ్వరరావు మాట్లాడుతూ దత్తత గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన కలెక్టర్ పరిశ్రమకు దళారిగా మారారన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను వదులుకునేది లేదని ఐద్వా సంఘం నాయకులు పంపాదిపేటకు చెందిన ప్రెసిడెంట్ అంబుజాలపు నాగ కృష్ణవేణి, కొత్తపాకలకు చెందిన అంగుళూరి సుశీల అన్నారు. జనశక్తి నాయకుడు కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజలను అధికారపార్టీ నేతలు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా లెక్క చేయరన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, సీపీఐ ఎం.ఎల్. జనశక్తి నేత కర్నాకుల వీరాంజనేయులు,సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ నేత జే.వెంకటేశ్వర్లు, సీపీఐ ఎం.ఎల్ లిబరేష¯ŒS నేత కె.జనార్ధన్, సీఐటీయూ నాయకుడు ఎం.వేణుగోపాల్, సీపీఎం జిల్లా నాయకులు యు.శ్రీనివాస్, కె.సింహాచలం, జి.అప్పారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అంగుళూరి అరుణ్‌కుమార్ దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు. నేపథ్యమిలా... దివీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ బాధిత గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి మద్దతుగా వైఎస్సార్సీపీ నేత, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా రంగలంలోకి దిగారు. అనంత రం వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎం.ఎల్. లిబరేషన్, సీపీఐ ఎం. ఎల్ న్యూ డెమోక్రసీ, సీపీఐ జనశక్తి తది తర పార్టీలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశా యి. ఈ నేపధ్యంలో దానవాయిపేట పం చాయతీ నర్శిపేటలో సీపీఎం ఆధ్వర్యం లో మరోసారి కోర్టు అనుమతి ద్వారా బహిరంగ సభను శనివారం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణ, అక్రమ కేసులు, భౌతిక దాడులు, చెట్లు నరికివేత, కాలుష్యం వల్ల వచ్చే పరిస్ధితులను దివీస్ బాధిత గ్రామాల ప్రజలు ఆవేదనను వ్యక్తం చేశారు. -
నష్ట పరిహారం ఇవ్వాల్సిందే
దివీస్‌కు వ్యతిరేకంగా బాధిత గ్రామాల ప్రజల వంటావార్పు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన రైతుల భూముల్లో చెట్లు తొలగించడంపై నిరసన నేతలతోపాటు బాధితుల అరెస్టు తొండంగి: దివీస్‌కు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో చెట్ల తొలగింపునకు నిరసనగా ఆయా భూముల యజమానులు, రైతులు శనివారం వంటావార్పు చేపట్టారు. కోనప్రాంతంలో తొండంగి మండలం దానవాయిపేట పంచాయతీ పరిధిలోని కొత్తపాకలు గ్రామం సమీపంలో దివీస్ ల్యాబోరేటరీస్‌కు ప్రభుత్వం సుమారు 670 ఎకరాలకు కేటాయించడం, ఈ వ్యవహారాన్ని బాధిత గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం రెవెన్యూ అధికారులు దివీస్‌కు ప్రతిపాదించిన భూముల్లోని చెట్లును తొలగించడంపై బాధిత గ్రామాల ప్రజలు వంటావార్పు నిర్వహించారు. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట తదితర గ్రామాల ప్రజలు దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వంటలు చేశారు. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. కోన భూముల్లో జీడిమామిడి, సరుగుడు, ఇతర తోటల ఫలసాయమే జీవనాధారంగా జీవిస్తున్న తమ భూములను వదిలి వెళ్లేది లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు రైతులు విక్రయించని భూముల్లో చెట్లను తొలగింపుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేని, కాలుష్యకారకమైన దివీస్ పరిశ్రమ కోసం ప్రభుత్వం తమపై పోలీసులను ప్రయోగిస్తూ అన్యాయంగా భూములను లాక్కోవడం దారుణమన్నారు. 144 సెక్ష¯ŒS అమలుచేసి ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో నాలుగు నెలలుగా తమను భయపెడుతున్నారన్నారు. తమ పోరాటం పోలీసులపై కాదని, బలవంతపు భూసేకరణపైనేనని దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, బాధిత ప్రజలు స్పష్టం చేశా రు.రైతులు విక్రయించని భూ ముల్లో చెట్ల తొలగింపు వల్ల నష్ట పోయిన రైతులకు పరిహారం ఇవ్వా లని సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, సీఐటీయూ నాయకుడు వేణుగోపాల్, దివీస్ వ్యతిరేక పోరాటకమిటీ నాయకులు డిమాండ్ చేశారు. బాధిత రైతులతో కలిసి నరికేసిన చెట్లును పరిశీలించారు. ఇంతలో అక్కడకు వందలాదిగా పోలీసులు వ్యాన్లలో వచ్చా రు. స్టేటస్కో ఉన్న భూముల్లో చెట్లు నరకడం దారుణమని శేషుబాబ్జి అన్నారు. బాధితరైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ అక్కడే బైఠాయించారు. డీఎస్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులంతా వారిని బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. తాము పెంచిన చెట్లను చూసుకుంటూ ఏడుస్తున్న మహిళలను సైతం పోలీసులు లాక్కెళ్లి అరెస్టు చేశారు. కాలుష్య కారక దివీస్‌కు వత్తాసుపలుకుతూ పోలీసులు తమపై దౌర్జన్యంగా అరెస్టు చేయడం అన్యాయమని, పోలీస్ జులుం నశిం చాలంటూ నినాదాలు చేశారు. ఈకార్యక్రమానికి మద్దతుపలికిన సీపీఐ.(ఎం.ఎల్.) న్యూడెమోక్రసీ, లిబరేషన్, జనశక్తి పార్టీల నేతలను కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు సీపీఐ(ఎం.ఎల్) లిబరేష¯ŒS పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు బుగతా బంగార్రాజు, సీపీఐ(ఎం.ఎల్) జనశక్తి నాయకుడు కర్నాకుల వీరాంజనేయులు తెలిపారు. అరెస్టయిన వారిలో దివీస్ వ్యతిరేక పోరాటకమిటీ నాయకులు మాజీ జెడ్పీటీసీ అంగుళూరి అరుణ్‌కుమార్, మత్స్యకారనాయకుడు మేరుగు ఆనందహరి, మోసా సత్యనారాయణ, గంపల దండు, యనమల శ్రీనివాసరావు, బద్ది శ్రీను,అంబుజాలపు నాగకృష్ణవేణి, నేమాల నాగేశ్వరరావు, కుక్కా బొగ్గురాజు, అం బుజాలపు అప్పారావు, కుమ్మరి సూర్యారావు, కంబాల జగన్నా«థం తదితరులు ఉన్నారు. ఎంతో కష్టపడి చెట్లును పెంచాను మాది తాటియాకులపాలెం గ్రామం. 1.30 ఎకరాల భూమి ఉంది. ఎంతో కష్టపడి జీడిమామిడి చెట్లను పెంచాను. జీడిపిక్కల ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాను. ఇప్పుడు వాటిని అన్యాయంగా నిరికేశారు. –కె.సత్తిబాబు, రైతు, తాటియాకులపాలెం -
పాదయాత్రపై పైశాచికం
సీపీఎం ఆధ్వర్యంలో బాధితుల ఆందోళన పంపాదిపేట నుంచి కాకినాడకు పయనం జనసంద్రంతో కిక్కిరిసిన బీచ్‌రోడ్డు తీరప్రాంత గ్రామాల మీదుగా సాగిన యాత్ర అడ్డుకున్న పోలీసులు.. అరెస్టులు తొండంగి: తీర ప్రాంతంలో కాలుష్య కారక దివీస్ ల్యాబొరేటరీస్‌కు వ్యతిరేకంగా కోనదండు కదిలింది. సీపీఎం ఆధ్వర్యంలో శనివారం తాటియాకులపాలెం, కొత్తపాకలు, పంపాదిపేట, శృంగవృక్షంపేట గ్రామాలకు చెందిన వందలాదిమంది వృద్ధులు, మహిళలు, రైతులు కలిసి పంపాదిపేట నుంచి కాకినాడ కలెక్టరేట్ వరకూ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పంపాదిపేట వీధుల్లో సాగిన ఈ యాత్ర శృంగవృక్షంపేట, వాకదారిపేట, గోర్సపాలెం, గడ్డిపేట చేరుకుంది. అక్కడి నుంచి బీచ్‌రోడ్డు మీదుగా బుచ్చియ్యపేట, ఆవులమంద, పెరుమాళ్లపురం, తలపంటిపేట, హుకుంపేట, పాతచోడిపల్లి గ్రామాల మీదుగా సాగింది. ’ప్రాణాలు తీసే దివీస్ మాకొద్దు బాబోయ్’, ప్రభుత్వం దివీస్‌ను రద్దు చేయాలని, అక్రమ కేసులు ఎత్తి వేయాలని, 144 సెక్ష¯ŒS రద్దు చేయాలని, రైతుల భూములను ఇచ్చేదిలేదంటూ నినాదాలు చేశారు. అనంతరం ఉప్పాడ కొత్తపల్లి మండలం మీదుగా పాదయాత్రను కొనసాగించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు వేణుగోపాల్, సీపీఎం నాయకులు అప్పారెడ్డి, సింహాచలం, కొత్తపాకలు, తాటియాకులపాలెం, పందిపేటల, శృంగవృక్షంపేట తదితర గ్రామాల ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. కాలుష్యానికి వ్యతిరేకంగా సీపీఎం పోరాటం జిల్లాలో జరుగుతున్న భూ పోరాటంతోపాటు పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకతే ప్రధాన అజెండాగా సీపీఎం జిల్లాలో మూడు చోట్ల పాదయాత్రలు నిర్వహిస్తున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి అన్నారు. పంపాదిపేటలో ఆయన మాట్లాడుతూ పెద్దాపురంలో సీఫుడ్ పరిశ్రమలో గ్యాస్ లీకై యాభైమంది ఆస్పత్రి పాలయ్యారన్నారు. దీనికి నిరసనగా పరిశ్రమలో సరైన భద్రత సౌకర్యాలు కల్పించాలని, మరొకట్టి గండేపల్లి రైసుమిల్లు వల్ల వస్తున్న కాలుష్యాన్ని వ్యతిరేకిస్తూ పాదయాత్ర జరుగుతుందన్నారు. ప్రధానంగా దివీస్ పరిశ్రమ భూసేకరణకు వ్యతిరేకించడంతోపాటు కాలుష్యం వల్ల వచ్చే ప్రమాదాన్ని మందుగానే పారద్రోలేందుకు పాదయాత్రలు చేపట్టామన్నారు. ఈ నెల 14న అన్ని పాదయాత్రలు కూడా జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుంటాయన్నారు. – జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి దివీస్ ఉద్యమం ఇతర ప్రాంతాలకు స్ఫూర్తి కోన తీరంలో జరుగుతున్న దివీస్ వ్యతిరేక ఉద్యమం పలు పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నరసింహారావు అన్నారు. కోన ప్రాంత ప్రజలంతా ధైర్యంతో దివీస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నారు. దివీస్ కోసం ప్రభుత్వం 500 మంది పోలీసులను మూడు నెలల నుంచి మోహరించి వారికి జీతాలిస్తున్నారని, ఆ జీతాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కోర్టులో కూడా పోరాటం చేయలేని స్ధితిలో దివీస్ యాజమాన్యం, ప్రభుత్వం ఉందన్నారు. – నరసింహారావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
దివీస్‌పై...జన గర్జన
కాలుష్య విషం వద్దంటూ ఆందోళన సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎం.ఎల్.) లిబరేష¯ŒS తదితర నేతల అరెస్ట్ ఆందోళనపై పోలీసుల ఉక్కుపాదం ప్రతిఘటించిన బాధితులు తోపులాటలో సొమ్మసిల్లిన మహిళలు ఉలిక్కిపడిన కోన ప్రాంతం నాగుల చవితి పండుగకూ అడ్డంకులే... భవితను కాటేసే కాలుష్యకారకాలు మాకొద్దంటూ దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా ఉద్యమ గళం మరోసారి గర్జించింది. పోలీసుల పదఘట్టనలను ప్రతిఘటించి ఉక్కు పిడికిలి బిగించింది. అరెస్టులు ... లాఠీ ఛార్జీలు అడ్డుకోవాలేవంటూ వందలాదిమంది రోడ్డెక్కారు ... ప్రదర్శనలు చేశారు ... స్వచ్ఛంద అరెస్టులకు సిద్ధపడ్డారు. తొండంగి : కాలుష్య కారక పరిశ్రమ కోసం తమ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటే నేల తల్లిని నమ్ముకున్న తాము పొట్ట చేతపట్టుకుని ఎక్కడికి పోయేందంటూ దీవీస్ బాధిత గ్రామాల ప్రజలు గురువారం మరోసారి గర్జించారు. దీవీస్కు వ్యతిరేకంగా ఆది నుంచీ వేలాది మంది కోన ప్రాంత ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని అడుగడుగునా అణగతొక్కేందుకు ప్రభుత్వం ఖాకీల సాయంతో విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నిబంధలనలకు వ్యతిరేకంగా తీరంలో జరుగుతున్న భూసేకరణను అడ్డుకుంటుంటే అక్రమ కేసులు, అణిచివేతలతో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారంటూ గురువారం దానవాయిపేటలో సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీలు బహిరంగ సభ నిర్వహించేందుకు పిలుపునిచ్చాయి. ఈ నేపధ్యంలో బుధవారం నుంచే పోలీసులు అప్రమత్తమై బాధిత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట తదితర గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. గురువారం ఉదయం నుంచి తీరప్రాంత గ్రామాల్లో పోలీసులు వాహనాల రాకపోకలు, సైరన్లతో హోరెత్తించారు. నాగుల చవితి పండుగను చేసుకోడానికి కూడా స్థానికులు బయటకు రాలేకపోయారు. ఒక్కసారిగా వేడిక్కిన సభాప్రాంతం మధ్యాహ్నం వరకూ ప్రశాంతంగా ఉన్న దానవాయిపేట శివారు నర్శిపేటలో మత్స్యకార కమ్యూనిటీ ప్రాంగణం దివీస్‌ను రద్దు చేయాలంటూ నిరసనలతో ఒక్కసారిగా వేడెక్కింది. సీపీఐ (ఎం.ఎల్) లిబరేష¯ŒS జిల్లా కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు, ఆ పార్టీ నాయకులు మానుకొండ లచ్చబాబు, కె.జనార్ధ¯ŒS తదితర నాయకులు నర్శిపేట రామాయలం వద్ద ఆందోళన మొదలెట్టారు. వీరికి మద్ధతుగా బాధిత గ్రామాల ప్రజలు ఒక్కసారిగా వీధుల్లోంచి సుమారు నాలుగొందల మంది వరకూ దశలవారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్ధితి నెలకొంది. నేతల అరెస్టు పోలీసుల యత్నం, అడ్డుకున్న బాధిత ప్రజలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర నాయకుడు రాజుల వెంకయ్య, జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి తదితరులు సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ రాజశేఖర్, తునిరూరల్ సీఐ చెన్నకేశవరావు, తుని పట్టణ సీఐ అప్పారావు, ఎస్సై బి.కృష్ణమాచారి ఇతర పోలీసులు సిబ్బంది అక్కడకు చేరుకుని 144 సెక్ష¯ŒS అమలులో ఉందని, సభకు ఎటువంటి అనుమతి లేదంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో చర్చలు జరిపారు. ్రçఅదుపులోకి తీసకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వెంటనే జనం మధును తమ మధ్యలోకి జనం తీసుకెళ్లిపోయారు. డీఎస్పీ రాజశేఖర్ ఇతర సిబ్బంది మధును అదుపులోకి తీసుకుని బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలోకి ఎత్తిపడేశారు. పోలీసుల లాఠీల దెబ్బలకు పంపాదిపేటకు చెందిన మట్ల సుబ్బలక్షి్మకి గాయాలవడంతోపాటు సొమ్మసిల్లిపడిపోయింది.. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారావుతోపాటు దివీస్ వ్యతిరేక న్యాయ పోరాట కమిటి నాయకులు మట్ల ముసలయ్య, గంపల దండు, మాజీ జెడ్పీటీసీ అంగుళూరి అరుణ్‌కుమార్, అంగుళూరి శ్రీనివాస్, యనమల నాగేశ్వరరావు, అంబుజాలపు నాగ కృష్ణవేణి, అంగుళూరి చిన్నారి, అంగుళూరి బేబి తదితరులతోపాటు సుమారు 1500 మంది వరకూ రోడ్డుపై నిరసన ప్రదర్శన చేశారు. మహిళలు, యువత బీచ్‌రోడ్డుపై నర్శిపేట నుంచి తాటియాకులపాలెం మీదుగా ఒంటిమామిడి వరకూ పాదయాత్ర చేశారు. అనంతరం ఒంటిమామిడి సెంటర్ వద్ద నరసింహారావుతోపాటు ఇతర నాయకులను అరెస్టుచేసి వ్యాన్‌లో ఎక్కించి అన్నవరం, ప్రత్తిపాడు, తుని రూరల్, తునిపట్టణ పోలీస్‌స్టేçÙన్లకు తరలించారు. అడుగడుగునా పోలీసు వాహనాలను ముందుకుపోకుండా ఆందోళనకారులు అవరోధాలు సృష్టించారు నర్శిపేట, ఒంటిమామిడిలలో అరెస్టైన నేతలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. నరసింహారావు, సీపీఐ రాష్ట్ర నాయకుడు రాజుల వెంకయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.వేణుగోపాల్, వ్యవసాయకార్మీక సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి జి.అప్పారెడ్డి, ఐద్వా నాయకురాలు అంబుజాలపు కృష్ణవేణి అంగుళూరి , సీపీఎం పిఠాపురం ఏరియా కార్యదర్శి సింహాచలం, సీపీఐ తుని ఏరియా కార్యదర్శి శివకోటి రాజు, ప్రజానాట్యమండలి రాష్ట్రనాయకులు డి.క్రాంతి కుమార్, ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి, డివైఎఫ్ఐ పెద్దాపురం కన్వీనర్. వై.రమేష్ పి.రాజా, దివీస్ వ్యతిరేక న్యాయపోరాట కమిటీ నాయకులు, మహిళలు, రైతులు అరెస్టైన వారిలో ఉన్నారు. ఉద్యమాలతో వేడెక్కుతున్న తీర గ్రామాలు... పంపాదిపేట, తాటియాకులపాలెం, కొత్తపాకలు గ్రామాల చేపట్టిన ఉద్యమాలతో క్రమంగా వేడెక్కుతుంది. తొలుత 505 ఎకరాలుగా ప్రకటించిన ప్రభుత్వం మరో 170 ఎకరాల వరకూ విస్తరిస్తుందని తెలియడంతో బాధిత గ్రామాల ప్రజలకు తోడుగా శృంగవృక్షంపేట, వాకదారిపేట గ్రామాల ప్రజలు కూడా ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోంది సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపణ కోటనందూరు : రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తున్నదని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి కె.మధు ఆరోపించారు.అరెస్టు చేసిన సందర్భం గా విలేకరుల సమావేశంలో మధు మాట్లాడుతూ సభ నిర్వహణకు వారం రోజుల ముందే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని. అప్పుడు అనుమ తించిన అధికారులు బుధవారం ఫో¯ŒSలో సభకు అనుమతి లేదన్నారని, గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సభ ఏర్పాట్లలో ఉన్న తమపై సీఐ చెన్నకేశవరావు అప్రజాస్వామికంగా వ్యవహరించారన్నారు. నాపై చేయి చేసుకున్న సీఐపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఈ నెల 28న ఢిల్లీ నుంచి జాతీయ స్థాయి నాయకులను తీసుకొచ్చి దివీస్ ప్రాంతంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రావుల వెంకయ్య మాట్లాడుతూ పేదల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుందని అందుకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ దివీస్ ఏర్పాటుకు 650 ఎకరాల భూమి అవసరమని తీర్మానించారని, పేదవారైన ఆప్రాంత ప్రజలు ఒకొక్కరి దగ్గర ఎకరం, ఎకరన్నర భూమి మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం ఎకరం ఖరీదు రూ. 35 నుండి 40 లక్షలు పలుకుతుంటే ప్రభుత్వం కేవలం రూ. 5 లక్షలు ఇచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. రూ. 400 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ. 25 కోట్లకు దక్కించుకొని తమ బందువులకు ధారాదత్తం చేసే ప్రయత్నం పాలకులు చేస్తున్నారని ఆరోపించారు. -
జనగర్జన
-
సెజ్ భూములుండగా.. పేదలవే కావాలా?
తుని : కాకినాడ సెజ్ కోసం సేకరించిన వేలాది ఎకరాల భూములు ఉండగా దివీస్ మందుల పరిశ్రమ కోసం పేద రైతుల భూములను తీసుకుని వారి కడుపు కొట్టడం దారుణమని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. దివీస్ భూసేకరణకు వ్యతిరేకంగా తొండంగి మండలంలోని తీర ప్రాంతంలో గురువారం నిర్వహించిన సభను పోలీసులు భగ్నం చేశారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడి తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మట్టా లక్షి్మని ఎమ్మెల్యే రాజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దివీస్ పరిశ్రమకు సెజ్ భూముల్లో 500 ఎకరాలు కేటాయిస్తే సరిపోతుందన్నారు. ఇందుకు భిన్నంగా కారు చౌకగా పేదల భూములను ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. సెజ్ భూములైతే ఎకరాకు రూ.75 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదే పేదల భూములను రూ. 5 లక్షలకు అప్పనంగా కొట్టేయవచ్చనే ఉద్దేశంతో పోలీసులను అడ్డం పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న ఆన్యాయాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యేనైన తనను తీవ్రవాదిగా సీఎం చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని రాజా మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ప్రజల తరఫున నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించక పోవడం వారి అజ్ఞానికి నిదర్శనమన్నారు. పేద రైతుల కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి తప్ప కార్పొరేట్ కంపెనీల కోసం కాదన్నారు. -
‘దివీస్’పై మహిళాగ్రహం
144 సెక్ష¯ŒS ఎత్తివేయాలని డిమాండ్ తీరప్రాంత గ్రామాల్లో మహిళల ర్యాలీ వాకదారిపేటలో అడ్డుకున్న పోలీసులు స్వచ్ఛందంగా అరెస్టయిన మహిళలు అన్నవరం పోలీసు స్టేష¯ŒSకు తరలింపు పోలీసుల హెచ్చరికలపై ఆగ్రహం కాలుష్య భూతం ... భవితంతా అంధకారం ... పచ్చని బతుకుల్లో పరిశ్రమ రూపంలో కాటేస్తుందనే ఆందోళన ... అదే ఆ గ్రామాల ప్రజలను పోరాట పంధాన నడిపిస్తోంది. ప్రజా సంఘాల మద్దతుతో కొద్ది నెలలుగా అలుపెరగని ఉద్యమాలతో ఆ ప్రాంతం అట్టుడికిపోతోంది. గురువారం మరో అడుగు ముందుకేసి నారీ మణులు కొంగు నడుంకు చుట్టి .. పిడికిళ్లు బిగించి కన్నెర్ర చేశారు. గడపదాటి గళం విప్పి గర్జించారు. న్యాయం చేయాలని అభ్యర్థిస్తే నిర్బంధిస్తారా ... అరెస్టులు చేస్తారా అంటూ పహారా కాసిన పోలీసులను ప్రశ్నించారు. స్వచ్ఛందంగా అరెస్టుకు సిద్ధపడ్డారు. తొండంగి: తీర ప్రాంతంలో దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా బాధిత గ్రామాల మహిళల ఆగ్రహం మరోసారి పెల్లుబికింది. కాలుష్యం వెదజల్లే దివీస్ పరిశ్రమ ఏర్పాటును ప్రభుత్వం నిలిపి వేయడంతోపాటు దీర్ఘకాలంగా తీరప్రాంత గ్రామాల్లో అమలు చేస్తున్న 144 సెక్ష¯ŒSను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో బాధిత గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముందుగా తాటియాకులపాలెంలో మహిళలు రోడ్డుపైకి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తుని సీఐ అప్పారావు, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్సైలు పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. పంపాదిపేటలో మహిళలు ర్యాలీ చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో గ్రామంలో పోలీసు వాహనాలతో పర్యటించి, సమావేశాలు, సభలు నిర్వహించరాదని 144 సెక్ష¯ŒS అమలులో ఉందని హెచ్చరికలు జారీచేసి వెళ్లిపోయారు. ఈ నేపధ్యంలో పంపాదిపేటతో పాటు కొత్తపాకల గ్రామం నుంచి వచ్చిన సుమారు 200 మంది మహిళలు 144 సెక్ష¯ŒSను ఎత్తివేయాలని, కాలుష్యంతో ప్రజల ప్రాణాలు తీసే దివీస్ పరిశ్రమ మాకొద్దంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని గ్రామ వీధుల్లో ర్యాలీ చేశారు. నినాదాలను కొనసాగిస్తూ అక్కడి నుంచి శృంగవృక్షంపేట, వాకదారిపేట వరకూ మహిళలు ర్యాలీ కొనసాగించారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు: బాధిత గ్రామాల మహిళలు ర్యాలీ చేస్తుండగా పోలీసులు జీపులతో అక్కడి చేరుకున్నారు. సీఐలు అప్పారావు, చెన్నకేశవరావు, ఎస్సై బి.కృష్ణమాచారి ఐద్వా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి, ఇతర మహిళలతో చర్చించారు. శాంతియుతంగా పర్యటిస్తుంటే అడ్డుకోవడం అన్యాయమన్నారు. పచ్చని తీరప్రాంతంలో ఎన్నాళ్లు 144 సెక్ష¯ŒS అమలు చేస్తారని, తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నాధికారుల ఆదేశాల మేరకు అమలు చేస్తున్నామని ఎవరికి వారు వెళ్లిపోవాలని పోలీసులు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఐద్వా సంఘం మహిళలను మహిళా పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. బాధిత గ్రామాల మహిళలంతా తమను కూడా అరెస్టు చేయాలని పట్టుబట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీసుల జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. కొంతసేపు పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల ప్రతిఘటనను ధిక్కరిస్తూ వాకదారిపేట మెయి¯ŒS సెంటర్ వరకూ నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. అనంతరం బాధిత మహిళలంతా చర్చించుకుని ఉద్యమానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ స్వచ్ఛందంగా అరెస్టవుతామని తెలిపారు. దీంతో మహిళలను అరెస్టు చేసేందుకు పోలీసు వాహనాన్ని రప్పించారు. బాధిత గ్రామాల మహిళలంతా వ్యానులో ఎక్కారు. మహిళల తరలింపును వ్యతిరేకిస్తూ... దివీస్ పరిశ్రమ వల్ల తమకు కలిగే నష్టాలను చెప్పుకునేందుకు వచ్చిన మహళలను అరెస్టు చేసి తరలించేందుకు అంగీకరించేదిలేదని వాకదారిపేట గ్రామస్తులు పోలీసు వ్యానును అడ్డుకున్నారు. వ్యానును వెళ్లనీయకుండా రోడ్డుపై చెట్లు కొమ్మలను అడ్డుగా వేసి ముందుకు వెళ్లనీయకుండా నిలిపివేశారు. మహిళలను తాము అరెస్టు చేయాలేదని స్వచ్ఛంధంగా వారే అరెస్టవుతామని వ్యానులో కూర్చున్నారని సీఐలు వివరించారు. వ్యాను దిగేదిలేదనడంతో 50 మంది పైగా మహిళలను అన్నవరం పోలీస్‌స్టేçÙ¯ŒSకు తరలించారు. అరెస్టయిన 42 మందిలో ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి. ప్రభావతి, జిల్లా కార్యదర్శి సి.హెచ్.రమణి, సహాయ కార్యదర్శి సునీత, జిల్లా కమిటీ సభ్యులు నాగ వెంకటలక్ష్మి, కృష్ణమ్మ, పంపాదిపేట గ్రామ సంఘం అధ్యక్షుడు అంబుజాలపు నాగ కృష్ణవేణి, కొత్తపాకలు మహిళా సంఘం కమిటీ సభ్యులు అంగుళూరి చిన్నారి, అంగుళూరి బేబి, మచ్చర్ల మాణిక్యమ్మ ఉన్నారు. మా ఊరొచ్చి మాపైనే కేసులు పెడతారా... నిరసన కార్యక్రమాలను నిలిపివేయాలని, లేకుంటే నా¯ŒS బెయిల్‌బుల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడాన్ని వాకదారిపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైక్ ద్వారా మహిళల వద్దకు వచ్చి 144 అమలు నేపధ్యంలో వీడియోల్లో చిత్రీకరించిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించడంతో ఒక్కసారిగా గ్రామస్తులు పోలీసులపై వాగ్వివాదానికి దిగారు. ‘మేము ఏమి నేరం చేశామని మా ఊరొచ్చి మాపై కేసులు పెడతారా’ అని ప్రశ్నించారు.