విద్యుత్ ఇక్కట్లపై నిర్లక్ష్యం వద్దు
విద్యుత్ ఇక్కట్లపై నిర్లక్ష్యం వద్దు
Published Fri, Feb 10 2017 9:35 PM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM
- చౌర్యం తగ్గించి మీటర్ సేల్స్‌ను పెంచండి
- సీనియార్టీ ప్రకారం
వ్యవసాయ విద్యుత్ కనెక‌్షన్లు
- ఎస్‌పీడీసీఎల్ చైర్మన్,
మేనేజింగ్ డైరెక్టరు హెచ్.వై. దొర
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ సరఫరా, ఇతర విషయాల్లో వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆ శాఖ ఏపీ ఎస్‌పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (తిరుపతి) హెచ్.వై. దొర ఆదేశించారు. స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని విద్యుత్ భవన్‌లో శుక్రవారం కర్నూలు సర్కిల్‌కు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ముందుగా డివిజన్, సబ్‌డివిజన్, సెక‌్షన్‌ల వారీగా పురోగతి పనులు, ఇతర కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇకపై ఇలా జరిగితే సహించబోమని హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యాన్ని, లైన్ లాస్‌ను తగ్గించాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతీ ఏఈ తన పరిధిలో నెలకు 20 చౌర్యం కేసులు నమోదు చేయాలన్నారు.
ఎన్‌టీఆర్ జలసిరి కనెక‌్షన్లను వారంలోగా మంజూరు చేయాలన్నారు. జిల్లాకు సంబంధించి మీటర్ సేల్స్ 70శాతంగా ఉందని, దీన్ని 75శాతానికి పెంచేందుకు టార్గెట్ విధించారు. వ్యవసాయ విద్యుత్ కనెక‌్షన్లను సీనియారిటీ ప్రకారం మంజూరు చేయాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయించుకున్న ఏఈలు వాటిని వెంటనే చార్జ్ చేయాలని ఆదేశించారు. ఈ-ఆఫీస్, ఈ-స్టోర్స్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని, స్పాట్ బిల్లింగ్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసి, వందశాతం బిల్లులు వసూలు చేయాలన్నారు.
సమావేశంలో టెక్నికల్, హెచ్‌ఆర్ డైరెక్టరు పి. పుల్లారెడ్డి, సీఈ పీరయ్య, ఎస్‌ఈ భార్గవ రాముడు, టెక్నికల్, ఆపరేషన్స్, ఇతర డీఈలు వినాయక ప్రసాద్, మహ్మద్ సాధిక్, రమేష్, తిరుపతిరావు, ఉమాపతి, అంజనీకుమార్, నాగప్ప, ఎస్‌ఏఓ మతృనాయ్, ఏడీఈలు, ఏఈలు, ఏఓలు పాల్గొన్నారు.
- పత్రికల్లో వచ్చిన కథనాలపై విచారణ..
విద్యుత్ శాఖకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలపై విచారణ జరిపి నివేదికలు ఇవ్వాలని సీఎండీ దొర ఎస్‌ఈని ఆదేశించారు. విధి నిర్వహణలో కొందరు అధికారులు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి, వినియోగదారుల ఇబ్బందులను ‘సాక్షి’ దినపత్రికలో 10వ తేదీన ప్రచురితం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఒకే ఏఈని సస్పెండ్ చేసి మిగిలిన నలుగురిపై చర్యలు తీసుకోకపోయిన వైనాన్ని వెలుగులోకి తేవడంతో ఆయన స్పందించారు. దీనిపై పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. భవిష్యత్తులో వచ్చే వార్త కథనాలపై కూడా విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
Advertisement
Advertisement