కర్నూలు(అర్బన్): కృష్ణా పుష్కరాలకు సంబంధించి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పుష్కర పనులపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జేసీ–2 ఎస్.రామస్వామి, ఆత్మకూరు డీఎఫ్‌ఓ సెల్వం, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్‌వీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కర విధులకు సంబంధించి సమస్యలను తన దష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. ఆగస్టు 5వ తేదీ నాటికి సివిల్ పనులన్నీ కచ్చితంగా పూర్తి చేయాలన్నారు. సప్తనదుల సంగమం కాబట్టి సంగమేశ్వరం ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుందని, పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించే సంగమేశ్వర క్షేత్రంలో పుష్కరనగర్, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, భక్తుల వసతి, అన్నదాన సత్రాలు, స్టాల్స్ తదితరాలపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. పుష్కర ఘాట్లకు 5 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి చెత్త కనిపించకూడదన్నారు. వైద్య సదుపాయాలు పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. అన్నదాన సత్రాల్లో ఎంతమందికి భోజనాలు, అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారో ప్రణాళికలు తయారు చేసి తనకు సమర్పించాలని సివిల్ సప్లయిస్ డీఎంను ఆదేశించారు.
పుష్కర పనుల్లో అశ్రద్ధ వద్దు
Published Wed, Jul 27 2016 12:28 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement