మా భూములను లాక్కోవద్దు
-
∙ఇండస్ట్రియల్ పార్కు
-
ఏర్పాటుపై రైతుల నిరసన
-
∙రెవెన్యూ అధికారులను
-
అడ్డుకున్న వైనం
-
∙భూములు ఇవ్వబోమంటూ ఎమ్మెల్యేకు వినతి
గీసుకొండ : పరిశ్రమ స్థాపన కోసం పంటలు పండే తమ భూములను లాక్కోవద్దని సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరెడ్డితో పాటు పలువురు వీఆర్వోలు, సర్వేయర్లు పరిశ్రమల ఏర్పా టు కోసం భూ సర్వే చేయడానికి ఆదివారం రాగా మండలంలోని ఊకల్‌హవేలి, శాయంపేట హవేలి, కృష్ణానగర్, సంగెం మండలంలోని స్టేషన్ చింతలపెల్లి రైతులు వారిని అడ్డుకున్నారు.
ఉదయం 11.30 గంటలకు సర్వే కోసం వచ్చిన అధికారులను ఊకల్–స్టేçÙన్‌చింతపల్లి రోడ్డుపై అడ్డుకుని రైతులు అడ్డుకున్నారు. ఇండస్ట్రీయల్ ఇన్‌ప్రాస్ట్రక్షర్ కార్పొరేషన్(టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో రైతుల, ప్రభు త్వ భూమిలో భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు సర్వే చేయడానికి వచ్చారు. అయితే పరిశ్రమలకు తమ భూములను ఎట్టి పరిస్థితిలో ఇవ్వమని, సర్వే చేయడం నిలిపివేయాలని రైతులు వారికి అడ్డుతగిలి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్ది శాయంపేట హవేలి శివారు గ్రామం రాయనికుంటకు వస్తున్నారని తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లగా వారిని చూసి రైతులు వెళ్లారు. ఎమ్మెల్యే తిరుగు ప్రయాణంలో ఊకల్ మీదుగా వెళ్తుం డగా రైతులు నిరసనను తెలిపారు. ఈ విషయమై వారు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. గ్రామాలకు వచ్చి రైతులతో మా ట్లాడుతానని ఎమ్మెల్యే శాంతింపజేయడానికి ప్రయత్నించగా మాట్లాడేది ఏమి లేదంటూ రైతులు స్పష్టం చేశారు. మామునూరు సీఐ శ్రీనివాస్, గీసుకొండ, సంగెం ఎస్సైలతో బం దోబస్తు ఏర్పాటు చేశారు, అధికారులు సర్వే కోసం ఈ నెల 1నlరాగా రైతులు అడ్డుకున్న విషయం విదితమే. ఈ నెల 6న నాలుగు గ్రా మాల రైతులతో ఊకల్ క్రాస్‌రోడ్డు వద్ద వరంగల్– నర్సంపేట రహదారిపై ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నట్లు భూపరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు.
ఎలుకుర్తిలో రైతుల ఆందోళన
ఎలుకుర్తి (ధర్మసాగర్ ) : ఐటీపార్క్ ఏర్పాటు చేయటానికి తమ భూములు ఇవ్వమని మండలంలోని ఎలుకుర్తిలో రైతులు ఆదివారం ఆం దోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలోని సుమారు 200 ఎకరాలను సేకరించి ఐటీ పార్కు ఏర్పా టు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం అధికారులు తమ భూములను పరిశీలించినట్లు తెలి పారు. ఇప్పటికే దేవాదుల ప్రాజెక్ట్ కింద గ్రామానికి చెందిన వ్యవసాయ భూములు కోల్పోయామని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోను ఇచ్చేది లేదని వారు స్పష్టం చేసారు. ఈ సందర్భంగా రైతులు చేతిలో పురుగుల మందు డబ్బాలు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక రైతులు, పీఎసీఎస్ చైర్మన్ వీరన్న, ఎంపీటీసీ సభ్యుడు జోగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.