ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కోరుట్లకు బదులు మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా ముసాయిదా జాబితాలో చేర్పించానని తనపై దుష్ప్రచారం చేయడం తగదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.
-
ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు
మెట్‌పల్లి: ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కోరుట్లకు బదులు మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా ముసాయిదా జాబితాలో చేర్పించానని తనపై దుష్ప్రచారం చేయడం తగదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాలు తనకు రెండు కళ్ల లాంటివని.. ఇందులో దేనిపైనా వివక్ష చూపించాల్సిన అవసరం లేదన్నారు. రాయికల్ మండలాన్ని జగిత్యాల డివిజన్‌లోనే ఉంచడంతో ప్రభుత్వం కోరుట్లకు బదులు మెట్‌పల్లిని డివిజన్‌గా ప్రకటించిందే తప్ప.. ఇందులో తన ఒత్తిడి ఎంతమాత్రం లేదన్నారు. మెట్‌పల్లి పట్టణంలో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాలను కోరుట్లకు తరలించిన ప్పుడు తాను జోక్యం చేసుకోలేదని, దీనిని అక్కడి ప్రజలు గమనించాలన్నారు. డివిజన్ విషయంలో అభిప్రాయాలు తెలపడానికి అవకాశముందని, కోరుట్లకు అన్యాయం జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలేగాని ఆందోళనలు చేయడం సరికాదన్నారు.