శ్రీకాకుళం సిటీ : జిల్లా కోర్టుల ప్రాంగణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉభయ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తి, శ్రీకాకుళం జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి హామీ ఇచ్చారు. శనివారం జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కోర్టు సమస్యలను కమిటీ సభ్యులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
న్యాయవృత్తి ద్వారా సమాజానికి సేవ చేయాలని న్యాయవాదులకు సూచించారు. తీర్పులను హుందాతనంతో స్వీకరించాలన్నారు. సామాన్యులు కోర్టుల చుట్టూ తిరగకుండా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో విశ్రాంత రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి గురుగుబిల్లి యతిరాజులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ, వివిధ కోర్టుల న్యాయమూర్తులు వై.శ్రీనివాసరావు, గౌతమ్‌ప్రసాద్, గోపాలకృష్ణ, సుధామణి, సాయిసుధ, పద్మావతి, నాగమణి, ఎ.మేరీగ్రేస్‌కుమారి, రాజేంద్రప్రసాద్, మధుసూదనరావు, అప్పారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగు కృష్ణారావు, కార్యదర్శి పి.రాజారావు, ఉపాధ్యక్షుడు మామిడి క్రాంతి, జనరల్ సెక్రటరీ చిరుగుపల్లి రామ్మోహన్, ట్రెజరర్ పి. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
Published Sat, Jun 18 2016 11:36 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement