కోడిపందెం ఆడుతున్న ఎనిమిది మంది అరెస్ట్
మంగపేట : మండలంలోని కమలాపురంలో కోడిపందాలు అడుతున్న ఎనిమిది మందిని బుధవారం అరెస్టు చేసినట్లు పీఎస్సై కుకునూరి సతీష్‌కుమార్ తెలిపారు. కమలాపురంలోని గొల్లవాడలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో వెళ్లి దాడి చేశామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కోడిపందాలు నిర్వహిస్తున్న గ్రామస్తులు చల్ల గట్టయ్య, జాగరి కృష్ణ, అంతటి కృష్ణ, నిమ్మల కొండలు, బానోతు ప్రసాద్, కుదురుపాక చందు, కామేష్, తోట ముత్తయ్యను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రూ.700 నగదుతో పాటు పందెం కోళ్లను స్వాధీనం చేసుకోగా, మరికొందరు పరారయ్యారని పీఎస్సై వివరించారు.