దోమకొండ(కామారెడ్డి): అన్ని విభాగాల ఉద్యోగులు విధులకు సకాలంలో హాజరుకావాలని జెడ్పీ సీఈవో గోవింద్‌నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఉద్యోగుల హాజరు పట్టికలను మండల పరిషత్ కార్యాలయ నిధులు, ఖర్చుల వివరాల పట్టికలను పరిశీలించారు.
అనంతరం ఇక్కడి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఉద్యోగులు సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. బయోమెట్రిక్ విధానంపై వారికి వివరించారు. నూతనంగా నిర్మించిన మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్‌గౌడ్, పంచాయతీరాజ్ ఏఈ ఆదిత్య, సూపరింటెండెంట్ యుగేందర్, సీనియర్ అసిస్టెంట్ నగేష్, జూనియర్ అసిస్టెంట్ నర్సింలు ఉన్నారు.
మండల పరిషత్ భవనం పరిశీలన..
కామారెడ్డి రూరల్(కామారెడ్డి): మండలంలోని పరిషత్ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను బుధవారం జెడ్పీ సీఈవో గోవింద్‌నాయక్ పరిశీలించారు. మిగులు పనులు పూర్తి చేయాలన్నారు. దీన్ని ఈ నెలాఖరులో ప్రారంభించనున్నట్లు సీఈవో తెలిపారు. 95శాతం మేర పూర్తయిన భవనం చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. మిగలు పనులు త్వరగా చేపట్టి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఎంపీడీవో చిన్నారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, జేఏæ నరేష్, టైపిస్టు సుధీర్ ఉన్నారు.
ఉద్యోగులు విధులకు సకాలంలో రావాలి
Published Thu, Jul 6 2017 11:01 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM
Advertisement
Advertisement