గిరిజన ఉద్యోగుల బృందం త్రిపుర పర్యటన
Published Fri, Aug 5 2016 5:41 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
పాడేరు: త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (టీటీఏఏడీసీ) ఆహ్వానం మేరకు విశాఖ జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధుల బృందం త్రిపుర రాష్ట్రంలో గత మూడు రోజులుగా పర్యటిస్తోంది. త్రిపురలో ఈనెల 3 నుంచి 5 వరకు నిర్వహించిన ట్రైబల్ సెంట్రల్ కాన్ఫరెన్స్‌కు గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కుడుముల కాంతారావు, సివేరి బాలకష్ణ, ఉపాధ్యక్షులు కేకే జయప్రసాద్, కె.భాస్కరరావు హాజరయ్యారు. 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్ పరిధిలో నివశిస్తున్న గిరిజనులకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక గిరిజన చట్టాలు, హక్కులు, ప్రస్తుతం గిరిజనులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ సదస్సులో ప్రధాన చర్చ జరిగిందని, అనంతరం త్రిపురలోని గిరిజన స్వయంపాలిత సంస్థను సందర్శించి గిరిజనులకు విద్య, వైద్య, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరుల కల్పన తదితర అంశాలపై పరిశీలించినట్లు ఏపీ గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.కాంతారావు తెలిపారు.
Advertisement