వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో ఉపాధి కోర్సులు
వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో ఉపాధి కోర్సులు
Published Sat, Nov 26 2016 11:42 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
కర్నూలు సిటీ: డిగ్రీలో వచ్చే ఏడాది నుంచి ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఉన్నత విద్యా శాఖ వైస్ చైర్మన్ నరసింహారావు, ఆర్‌యూ వీసీ నరసింహులు తెలిపారు. ఇందులో భాగంగా సీబీసీఎస్ సిలబస్‌లో చేయనున్న మార్పులపై శనివారం రాయలసీమ యూనివర్సిటీలో ఆయా యూనివర్సిటీలకు చెందిన వీసీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీన్లతో రీజినల్ వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకొని డిగ్రీ కోర్సుల్లో సెమిష్టర్ల వారీగా ఉపాధి కోర్సులు ప్రవేశ పెట్టేందుకు ఆదేశించిందన్నారు. ఈ మేరకు సీబీసీఎస్ సిలబస్‌తో పాటు ఫౌండేషన్ కోర్సులను వచ్చే ఏడాది నుంచి అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశ పెట్టాల్సి ఉందన్నారు. ఇందుకు రాష్ట్రంలో 100 డిగ్రీ కాలేజీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామన్నారు. ఇందుకు జేకేసీ సహకారం, టాటా ఇన్‌స్టిట్యూట్ సోషల్ సైన్సెస్ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నట్లు చెప్పారు. అనంతరం కొత్త కోర్సులపై వీసీలు, డీన్లు, ప్రభుత్వ డిగీ కాలజీల ప్రిన్సిపాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. çసమాశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సుబ్బారావు, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సభ్యులు వరుణ్, ఎస్వీ వీసీ దామోదరం పాల్గొన్నారు.
Advertisement
Advertisement