దండేపల్లి (ఆదిలాబాద్) : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో దండేపల్లి మండలం గూడెం గోదావరి వంతెన వద్ద గురువారం రాత్రి నుంచి నీటి మట్టం పెరిగింది. పాత లోలెవల్ వంతెనకు సమానంగా నీరు నిలిచింది. వంతెన శిథిలావస్థలో ఉండడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు వంతెనపై గురువారం రాత్రి నుంచి రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం ఉదయం నుంచి మాత్రం ద్వి, త్రిచక్ర వాహనాలతోపాటు కార్లు, జీపులను అనుమతించారు. భారీ వాహనాలకు అనుమతి నిరాకరించారు.
దీంతో గూడెం అటవీ చెక్‌పోస్టు నుంచి లక్సెట్టిపేట ఎన్టీఆర్ చౌరస్తా వరకు లారీలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఆర్టీసీ వారు బస్సులను ఇటువైపు గూడెం చెక్‌పోస్టు వరకు, అటు వైపు రాయపట్నం వరకు నడిపిస్తున్నారు. అటు వైపు, ఇటువైపు బస్సుల్లో దిగిన వారందరూ ఆటోల ద్వారా వంతెన దాటుతున్నారు. అయితే గోదావరి నదిపై నిర్మించిన కొత్త వంతెన పనులు నాలుగు రోజుల్లో పూర్తవుతాయని నేషనల్ హైవే జేఈ జగదీశ్వర్ తెలిపారు.
గోదావరి వంతెనపై భారీ వాహనాలకు నిషేధం
Published Fri, Jul 15 2016 6:13 PM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM
Advertisement