ఆస్పత్రికి రూ.50 లక్షల పరికరాల వితరణ
నెల్లూరు(అర్బన్):
స్థానిక శంకరాగ్రహారంలోని డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలకు హైదరాబాద్‌కి చెందిన అరబిందో ఫార్మా కంపెనీ యాజమాన్యం రూ.50 లక్షల విలువైన మానిటర్లు, అత్యవసర వైద్య సాయమందించటానికి ఉపయోగపడే పరికరాలు, రోగుల కోసం లిఫ్ట్‌ను గురువారం వితరణగా ఇచ్చారు. కంపెనీ యాజమాన్యం సీఎస్‌ఆర్ నిధుల కింద ఈ పరికరాలను అందచేసింది. వీటిని స్వీకరించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.అజయ్‌కుమార్ మాట్లాడారు. ఆధునిక వైద్యాన్ని సామాన్య మానవుడికి వీలైనంత తక్కువ ధరకే అందించేందుకు ట్రస్ట్ తరపున ఆస్పత్రిని నిర్వహిస్తున్నామని తెలిపారు.