సుండుపల్లి: స్థానిక చిన్నగొల్లపల్లి అటవీ ప్రాంతంలో రామన్నకుంట వద్ద శుక్రవారం 7 ఎర్రచందనం దుంగలు, ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్సై మధుసూధన్‌రెడ్డి తెలిపారు. ఆయన విలేకరులకు చెప్పిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నగొల్లపల్లికి చెందిన ఇ.నాగరాజ, రాజేంద్ర, ఆర్.శివశంకర్, పీఎన్ కాలువ గ్రామ పంచాయతీ ఈడిగపల్లికి చెందిన సుబ్బయ్య, ఎర్రచందనం దుంగలను తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. వారిలో టి.నాగరాజ, రాజేంద్రను అరెస్ట్ చేయగా సుబ్బయ్య, శివశంకర్ పరారయ్యారు. నిందితుల వద్ద నుంచి 7 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్సై తెలిపారు.
25 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Published Fri, Sep 30 2016 10:51 PM | Last Updated on Mon, Oct 22 2018 1:59 PM
Advertisement
Advertisement