రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
Published Thu, Jul 21 2016 7:45 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకుని నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ అన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో గ్యారేజ్‌లో ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు సభను గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రోడ్డుపై వాహనం నడిపే ప్రతి చోదకుడూ అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా వారితో పాటు ఎదుటి వారిని ప్రమాదాల బారిన పడకుండా నివారించ వచ్చన్నారు. ప్రమాదాల నివారణ కోసం ప్రతి నెలా రహదారి భద్రతా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
తనతో పాటు కలెక్టర్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, ఉపరవాణాశాఖాధికారి సమావేశంలో పాల్గొని తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నామని చెప్పారు. ప్రమాద సంఘటనల్లో తప్పు ఎవరిదైనా డ్రై వర్లే బాధ్యత వహించాల్సి వస్తోందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎస్.ధనుంజయరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డ్రై వర్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాల వల్ల బాధితులకు సంస్థ లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాల్సి వస్తోందన్నారు. డ్రై వర్లు తమ అభిరుచులు మార్చుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి బస్సులు నడపడం ద్వారా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు తమ అధ్యయనంలో తేలిందన్నారు. డ్రై వర్లు ఆధ్యాత్మిక చింతనతో, యోగా, వ్యాయామం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం పొందాలని సూచించారు. జిల్లా పరిధిలో ఆర్టీసీ డ్రై వర్ల కారణంగా జరిగిన ప్రమాదాల వల్ల గతేడాది 21 మంది మతిచెందగా ఈ ఏడాదిలో ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు. ప్రమాదరహితంగా డ్రై వింగ్ చేసిన ఉత్తమ డ్రై వర్లకు ఎస్పీ భాస్కర్‌భూషణ్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆర్టీసీ డెప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ ఎం.నాగేశ్వరరావు, కార్మిక సంఘాల నాయకులు, డ్రై వర్ల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
పురస్కార గ్రహీతలు
పశ్చిమ రీజియన్ స్థాయిలో..
ఆర్‌ఎన్ రావు, బీవీఆర్‌ఎం రావు, ఎన్‌వీ ప్రసాదరావు (ఏలూరు డిపో)
డిపో స్థాయిలో..
ఏలూరు: జేవీఎన్‌వీ ప్రసాద్, ఎంఎస్ నారాయణ, కేడీ రావు
జంగారెడ్డిగూడెం : ఎస్‌కే మొహిద్దీన్, బీఆర్ కష్ణ, కె.అబ్రహం
తాడేపల్లిగూడెం: జీఎస్‌సీహెచ్ రావు, పి.కుశరాజు, ఎన్‌ఎన్‌వీవీ కుమార్
తణుకు: సీహెచ్ శ్యాంసన్, ఎంపీ రావు, కేఎన్ రావు
నరసాపురం: కేవీ రత్నం, జీవీ రావు, పి.మంగపతిరావు
భీమవరం: టీఎస్ బాబా, ఈఎల్ రావు, వీవీ రావు
కొవ్వూరు: ఎంబీ రావు, ఎస్‌కే అహ్మద్, టీవీ రాజు
నిడదవోలు: ఎస్‌కేఏ బాషా, పీఎన్ రావు, పీఎస్ రావు
వీరితో పాటు ప్రమాద రహిత డ్రై వింగ్‌లో డ్రై వర్లను ప్రోత్సహించిన కొవ్వూరు, నిడదవోలు డిపో మేనేజర్లు, సేఫ్టీ డ్రై వింగ్ ఇన్‌స్ట్రక్టర్లకు బహుమతులు అందజేశారు.
Advertisement
Advertisement