సిరంజీ సైకోను పట్టిస్తే 50వేలు..
ఏలూరు : మహిళలపై ఇంజక్షన్ దాడులకు పాల్పడుతున్న సైకో సమాచారం అందించిన వారికి రూ.50 వేల బహుమతి అందిస్తామని పశ్చిమ గోదావరి ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 40 ప్రత్యేక బృందాలు, 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మహిళలపై ఇంజక్షన్ దాడులను సీరియస్గా తీసుకున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 9 కేసులు నమోదయ్యాయని చెప్పారు. బాధితుల సమాచారం ప్రకారం ఊహాచిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు.
కంట్రోల్ రూమ్ నంబర్ 100, లేదంటే 9440796600 నంబర్ కు నిందితుని సమాచారం ఇవ్వాలని తెలిపారు. నిందితుడు ఉపయోగిస్తున్నది నీడిల్ మాత్రమే, అందులో ఎలాంటి మందులేదని నిర్ధారించినట్లు ఎస్పీ వివరించారు. సైకో చర్యలపై ఎవరూ ఆందోళన చెందొద్దని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని భాస్కర్ భూషణ్ అన్నారు.