వణుకు పుట్టిస్తున్న ఇంజక్షన్ సైకో | people and police are afraid of injection syco attacks | Sakshi
Sakshi News home page

వణుకు పుట్టిస్తున్న ఇంజక్షన్ సైకో

Published Fri, Sep 4 2015 9:08 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

వణుకు పుట్టిస్తున్న ఇంజక్షన్ సైకో

వణుకు పుట్టిస్తున్న ఇంజక్షన్ సైకో

ఏలూరు : ఇంజక్షన్ సైకో దాడుల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రోజురోజుకూ ఇంజక్షన్ సైకో దాడులు పెరిగిపోతున్నాయి. మరోపక్క సైకో దాడులు గోదావరి జిల్లాల ప్రజలకే కాదు, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నది వాస్తవం. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం, దువ్వలో ఇంజక్షన్ సైకో సంచారం చేస్తున్నాడని వదంతులు వినిపిస్తున్నాయి. సైకోను పట్టుకోబోయిన వ్యక్తి నుంచి దాడులకు పాల్పడుతున్న ఇంజక్షన్ సైకో తప్పించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. అయితే, సైకోను ఓ వ్యక్తి పట్టుకోవడానికి ప్రయత్నించగా సిరంజీలు, చెప్పులు అక్కడి వదిలి పారిపోయాడని ఆ ప్రాంతాల వాళ్లు అంటున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో నిన్న కూడా రఘునాథ్ అనే వ్యక్తిపై సైకో దాడి చేశాడన్న విషయం విదితమే. సైకోకు మరో వ్యక్తి కూడా సహాయం చేస్తున్నాడని రఘు ఆరోపిస్తున్నాడు. మోటార్ సైకిల్పై వీళ్లిద్దరూ తిరుగుతూ ఈ దాడులు చేస్తున్నారని చెప్పాడు. పెనుగొండ ఎస్సై మాత్రం ఆ వ్యక్తి చెప్పిన విషయాలు అవాస్తవాలని కొట్టిపారేయడం గమనార్హం. ఇంజక్షన్ దాడుల నేపథ్యంలో సైకోను పట్టించిన వారికి రూ.50 వేలు అందిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గతంలో ప్రకటించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement