ప్రతి మహిళ జీవిత ప్రణాళిక అలవరచుకోవాలి | every woman should have life planing | Sakshi
Sakshi News home page

ప్రతి మహిళ జీవిత ప్రణాళిక అలవరచుకోవాలి

Published Tue, May 9 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

ప్రతి మహిళ జీవిత ప్రణాళిక అలవరచుకోవాలి

ప్రతి మహిళ జీవిత ప్రణాళిక అలవరచుకోవాలి

– డీఐజీ రమణ్‌కుమార్‌
 
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రతి మహిళ జీవిత ప్రణాళిక అలవాటు చేసుకోవాలని కర్నూలు రేంజ్‌ డీఐజీ రమణ్‌కుమార్‌ సూచించారు. మంగళవారం స్థానిక ధనలక్ష్మీనగర్‌లోని సిండ్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థను సందర్శించి, టైలరింగ్‌లో ఉచితంగా శిక్షణ పొందుతున్న మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి ద్వారా అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అభివృద్ధి చెందాలంటే మంచి అలవాట్లు, మంచి ఆలోచనా స్వభావం, సమయ పాలన పాటించాలని సూచించారు. అనంతరం సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ రాధశ్రీ ప్రసాద్‌ అతిథిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సిబ్బంది వెంకటేశ్వర్లు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement