'రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టండి'
కాకినాడ : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షకు మాజీ ఎంపీ హర్షకుమార్ సంఘీభావం తెలిపారు. ముద్రగడ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. చంద్రబాబు నాయుడు కాపుల రిజర్వేషన్లతో బీసీలను రెచ్చగొడుతున్నారని హర్షకుమార్ మండిపడ్డారు.
పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల కోసం కాపు ప్రజా ప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరం అయితే కాపు రిజర్వేషన్ల కోసం ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటానని హర్షకుమార్ తెలిపారు.