విస్తరిస్తున్న వయ్యారిభామ | Expanding vayyaribhama | Sakshi
Sakshi News home page

విస్తరిస్తున్న వయ్యారిభామ

Published Thu, Aug 18 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

విస్తరిస్తున్న వయ్యారిభామ

విస్తరిస్తున్న వయ్యారిభామ

  • న్నదాతల పాలిట శాపంగా మారిన కలుపుమొక్క
  • శ్వాసకోశ, చర్మ వ్యాధులకు మూలం
  • పంటను ఎదగనీయని మొక్క
  • దృష్టి సారించని అధికారులు
  • ఆందోళనలో అన్నదాతలు
  • మెదక్‌:వయ్యారిభామ అనే కలుపు మొక్క అన్నదాతల పాలిట శాపంగా మారింది. దానిపేరులోనే అందం ఉన్నప్పటికీ పనితీరుమాత్రం ఘోరమే.. అది మొలకెత్తిన చోట ఏ పంట ఎదగనీయదు...దాని నుంచి వచ్చే గాలితో శ్వాసకోశ, చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. పశువులు మేసినా ప్రాణపాయం తప్పదని...సాక్షాత్తు వ్యవసాయ అధికారులు చెబుతున్నారంటే ఆ మొక్క సృష్టించే విధ్వంసం అంతాఇంత కాదు. రోజు రోజుకు విస్తరిస్తున్న వయ్యారిభామ విషపు మొక్కను అంతం చేసేందుకు పాలకులు, అధికారులుగానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

    దీంతో అన్నదాతల పాలిట ఆ మొక్కశాపంగా మారింది. జిల్లాలో ఎక్కడచూసినా ఈ కలుపుమొక్కలే కనిపిస్తాయి. సుమారు 7 దశాబ్దాల క్రితం దక్షిణ అమెరికా నుంచి జొన్నలు దిగుమతి చేసుకున్న క్రమంలో ఈ మొక్కకు సంబంధించిన విత్తనాలు ఆ ధాన్యంలో వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మొక్క మొలకెత్తి పూతదశకు చేరినప్పుడు వీచే గాలిలో దీని విత్తనాలు గాలి తాకిడికి వేలాది అడుగుల దూరం వరకు వెళ్లిపోతాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ మొక్క మొలకెత్తిన ప్రాంతంలో ఎలాంటి పంట మొక్కలు, ఇతర మొక్కలుగాని ఎదగవని చెబుతున్నారు.

    ఈ మొక్క వల్ల మనుషులకు శ్వాసకోశ వ్యాధులతోపాటు చర్మవ్యాధులు వస్తాయని అంటున్నారు. అన్నదాతలకు వచ్చే ఽశ్వాసకోశ వ్యాధులు కేవలం దీనివల్లేనని పేర్కొంటున్నారు. పశువులు ఈ మొక్కను మేషాయంటే మరణం సంభవిస్తుందని వెటర్నరి అధికారులు పేర్కొంటున్నారు. ఈ మొక్కను నామరూపల్లేకుండా తుదముట్టించాలంటే ఒక్క రైతుల వల్లే కాదని, ప్రభుత్వ చర్యలు తప్పనిసరి అని ఓ జిల్లా ఉన్నతాధికారి పేర్కొన్నారు.

    ఈజీఎస్‌ వంటి పథకాల్లో భాగంగా ఈ మొక్కలను పూర్తిగా తొలగించి నిప్పుపెట్టి కాల్చివేస్తే తప్ప బయట పడటం కష్టమేనని చెబుతున్నారు. ఏదేమైనా అన్నంపెట్టే రైతన్నను ఈ విషఽపు మొక్కబారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement