అన్నవరం: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి హుండీ ద్వారా వచ్చిన నగదులో 72 నకిలీ వెయ్యి రూపాయల నోట్లను అధికారులు గుర్తించారు. శుక్రవారం జరిగిన హుండీ లెక్కింపులో ఈ నోట్లు వచ్చాయి.
ఒకే సిరీస్‌తో వరుస నెంబర్లు గల ఈ నోట్లు కొత్తగా ఉండడంతో అనుమానించిన అధికారులు వాటిని నోట్లు లెక్కించే మెషీన్‌లో పెట్టగా తిరస్కరించింది. దీంతో నకిలీ నోట్లుగా నిర్ధారించి చించివేసినట్లు ఈవో నాగేశ్వరరావు తెలిపారు.
సత్యదేవుని హుండీలో నకిలీ నోట్లు
Published Sun, Jan 31 2016 4:13 PM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM
Advertisement
Advertisement