కరెంట్ షాక్‌తో రైతు మృతి | farmer killed due to current shock | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్‌తో రైతు మృతి

Published Tue, Jun 21 2016 10:56 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

farmer killed due to current shock

బిర్కూర్: నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ఓ రైతు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మండల కేంద్రానికి చెందిన కొట్టం సాయిలు(40) పొలానికి వెళ్లి మోటారు ఆన్ చేయబోయాడు. ప్రమాదవశాత్తు స్విచ్‌బోర్డులో విద్యుత్ ప్రసారమవుతుండటంతో షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. సాయిలుకు భార్య, కొడుకు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement