రహదారిపై పడి ఉన్న చాకలి దుర్గయ్య మృత దేహం
నాగిరెడ్డిపేట నిజామాబాద్: పొలానికని వెళ్లిన ఓ రైతు అర్ధరాత్రివేళ తన బైక్‌పై ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం వేకువజామున నాగిరెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలం లోని గోపాల్‌పేటకు చెందిన చాకలి దుర్గయ్య (48) అనే రైతు తన బైక్‌పై గురువారంరాత్రి పొ లానికి వెళ్లాడు.
అర్ధరాత్రి దాటాక పొలం నుంచి ఇంటికి బయల్దేరాడు. గోపాల్‌పేట సమీపంలోని వాగులమోరి వంతెన దాటుతుండగా ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. బోల్తాపడిన దుర్గయ్య ముఖానికి బలమైన గాయాలు తగిలాయి. దీంతో అక్కడిక్క డే ప్రాణాలు వదిలాడు.
దుర్గయ్యకు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కుమారుడు దుర్గప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయించినట్లు ఎస్‌ఐ శేఖర్ తెలిపారు.
మరో ఐదు నిమిషాల్లో ఇంటికి..
దుర్గయ్య పొలం నుంచి వస్తుండగా మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరాల్సి ఉండగా అర కిలోమీటర్ దూరంలోనే విధి వక్రించి గుర్తుతెలియని వాహన రూపంలో దుర్గయ్యను మృత్యువు కబలించింది. తన తండ్రి అర్ధరాత్రయినా ఇంటికి రాక పెద్దకొడుకు తండ్రిని వెతుక్కుంటూ అర్ధరాత్రివేళ పొలానికి వెళ్లాడు. అక్కడ తండ్రి జాడ కనిపించక తిరిగి వస్తుండగా బైకును చూశాడు. గమనించి గ్రామపెద్దల ద్వారా పోలీసులను వాకబు చేశాడు.
రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని తామే ఆస్పత్రికి చేర్చామని పోలీసులు చెప్పారు. దీంతో ప్రమాదానికి గురైంది తనతండ్రేనని గుర్తించిన దుర్గప్రసాద్ బోరున విలపించాడు. పొలంలో నీరుపెట్టి ఇంటికి తిరిగి వస్తాడనుకున్న దుర్గయ్య మధ్యలో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం శోకసంధ్రంలో మునిగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment