అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer suicide with Debt distress | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Tue, Aug 23 2016 8:57 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM

farmer suicide with Debt distress

తిప్పర్తి : అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మాడ్గులపల్లిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.  గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి గాదె శ్రీను (40) తనకున్న ఒక ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని గత నాలుగు సంవత్సరాలుగా పంటలు సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో వరుస కరువుతో పంట దిగుబడులు రాకపోవడం, సాగుకు చేసిన అప్పులు పెరిగిపోయాయి. ఈనెల 18న పత్తిచేను వద్దకు వెళ్లి ఎండుతున్న పంటను చూసి తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. సమీపంలోని రైతులు గమనించి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు సోమవారం రాత్రి మృతి చెందాడు. సాగు కోసం రూ. 4లక్షల వరకు అప్పులు చేశాడని గ్రామస్తులు తెలిపాడు. మృతునికి భార్య సునితతో పాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement