సాగునీటి కోసం వినతి
Published Tue, Aug 9 2016 1:51 AM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM
సంగం: నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాళెం గ్రామానికి చెందిన రైతులు తమ పొలాలకు సాగునీరు సక్రమంగా అందేలా చూడాలని సోమవారం సంగంకు వచ్చి సాగునీటి పారుదలశాఖ జేఈ శివకుమార్‌రెడ్డికి విన్నవించారు. నెల్లూరు నగరానికి మంచినీటి సరఫరా కోసం పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ సంగం ఆనకట్ట నుంచి తమకు వచ్చే నీటి కాలువను ఎక్కువభాగం పూడ్చినందువల్ల సాగునీటి సమస్య ఉందని తెలిపారు. స్పందించిన ఏఈ శివకుమార్‌రెడ్డి కాంట్రాక్టు సంస్థ వారితో మాట్లాడి కాలువను వెడల్పు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్‌టీఎస్ కాలువ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, పొట్టేపాళెం నీటి సంఘం నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement