మీ కృషి వల్లే అవార్డుల పంట
విజయవాడ సెంట్రల్ : మీ (ఉద్యోగుల) అందరి కృషి వల్లే నగర పాలక సంస్థకు అవార్డుల పంట పండిందని కమిషనర్ జి.వీరపాండియన్ అన్నారు. స్కాచ్ సిల్వర్ అవార్డుతోపాటు వివిధ కేటగిరీల్లో ఐదు అవార్డుల్ని సాధించినందుకు గాను మినిస్ట్రీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు చాంబర్లో కమిషనర్ కల్సి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. కమిషనర్ మాట్లాడుతూ సంస్కరణల అమల్లో అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే అవార్డులు దక్కాయన్నారు. జాతీయస్థాయిలో పలు నగరాల మధ్య జరిగిన పోటీలో మూడోస్థానంలో నిలవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే మరిన్ని అవార్డులు రావడం తథ్యమన్నారు. టీం వర్కే తన విజయరహస్యమన్నారు. సబ్ కలెక్టర్ సృజన కమిషనర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మినిస్ట్రీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు డి.ఈశ్వర్, జి.అజయ్ ఉద్యోగులు పాల్గొన్నారు