చెప్పను.. చేసి చూపిస్తా
► జమ్మికుంటను అద్దంలా మారుస్తా
► మంత్రి ఈటల రాజేందర్
జమ్మికుంట : ఏమి చేస్తానో చెప్పను.. 2017 వరకు చేసి చూపిస్తా.. అంటూ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలో సీసీరోడ్లు, ఆబాదిలో వంతెనను ఆదివారం ప్రారంభించిన సందర్భంలో పైవిధంగా మాట్లాడారు. ఇటీవల తాను ఖమ్మంకు వెళ్లగా అక్కడి రోడ్లను చూసి ఆశ్చర్యపోయూనన్నారు. ఖమ్మం రోడ్లలా జమ్మికుంట-హుజూరాబాద్ ఫోర్‌లేన్ రోడ్డును అద్దంలా మారుస్తానన్నారు. జమ్మికుంట నుంచి వీణవంక , కోరపల్లి, ఇల్లందకుంట రోడ్లను ఫోర్‌లేన్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు. రోడ్ల విస్తరణలో జమ్మికుంటలో కొన్ని ఇళ్లు పోతాయని బాధితులు సహకరించాలని కోరారు.
సీసీరోడ్లు, డ్రెరుునేజీలు, తాగునీటి సమస్యపై ఇక నుంచి దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఇవ్వనని.. అన్నింటిని పరిష్కరిస్తానన్నారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి రూ.7కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఫర్నీచర్ కోసం రూ.2కోట్లు కేటారుుంచామని, జూన్ వరకు వస్తాయన్నారు.
నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురుచూడకుండా ప్రైవేట్ రంగంలోనే అనేక ఉద్యోగావకాలున్నాయన్నారు. నగరపంచాయతీ చైర్మన్ పొడేటి రామస్వామి, ఎంపీపీ లత, వైస్‌చైర్మన్ బచ్చు శివశంకర్, నగర పంచాయతీ కమిషనర్ చింత శ్రీకాంత్, తహసీల్దార్ రజనీ, కౌన్సిలర్‌లు శీలం శ్రీనివాస్, దొడ్డె లక్ష్మి, చందా రాజు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి, పొనగంటి మల్లయ్య, రావికంటి రాజు పాల్గొన్నారు.