బాణసంచా పేలుళ్లలో అపశ్రుతి
Published Mon, Oct 31 2016 11:52 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
రాజమహేంద్రవరం క్రైం :
దీపావళి సందర్భంగా రాజమహేంద్రవరం దేవీచౌక్‌లో భారీగా బాణసంచా కాల్చుతున్న సంఘటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్థానిక దేవీచౌక్‌లో ఉత్సవ కమిటీ అనుమతి లేకుండా బాణసంచాను కాల్చేందుకు భారీ స్థాయిలో దేవీచౌక్ గుడి కింద ఖాళీగా ఉన్న ప్రాంతంలో బాణసంచా ఉంచారు. బాణసంచా కాల్చుతుండగా, భారీగా నిల్వ చేసిన బాణసంచాపై నిప్పురవ్వ పడడంతో పెద్ద ఎత్తున పేలుళ్లతో మంటలు వ్యా పించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు.
Advertisement
Advertisement