యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం ఉదయం భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. భువనగిరి ఖిల్లాకు సమీపంలోని ఓ కలప టింబర్ డిపోలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో డిపోలోని మూడు టింబర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనాస్ధలానికి చేరుకున్న అధికారులు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.
ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించినట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.