ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక మైదుకూరు రోడ్డులో ఉన్న స్టార్ టింబర్ డిపోలో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు రూ.కోటి విలువైన కలప దగ్ధమైనట్టు బాధితులు చెప్పుతున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తుంది.