జీవో 123 ప్రతులు దహనం | fire the go 123 papers | Sakshi
Sakshi News home page

జీవో 123 ప్రతులు దహనం

Published Sat, Jul 30 2016 9:08 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire the go 123 papers

హుస్నాబాద్‌రూరల్‌ : గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం తెచ్చిన జీవో 123ని వ్యతిరేకిస్తూ గుడాటిపల్లిలో శనివారం జీవో ప్రతులతో దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని పక్కనబెట్టి రైతులకు న్యాయం చేస్తామని చెబుతూ బోగస్‌ జీవో తెచ్చిందని పలువురు విమర్శించారు. న్యాయమైన పరిహారం ఇస్తామంటూ మాయమాటలు చెప్పి, దొంగచాటున సంతకాలు తీసుకొని భూములు లాక్కుంటోందన్నారు. గ్రామ సభలో నిర్ణయించిన పరిహారాన్ని రైతులకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు యాదమ్మ సంపత్, వివేకానంద్, తిరుపతిరెడ్డి, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement