‘మణప్పురం గోల్డ్’లో అగ్ని ప్రమాదం
‘మణప్పురం గోల్డ్’లో అగ్ని ప్రమాదం
Published Sun, Aug 7 2016 11:50 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
లోన్ డాక్యుమెంట్లు దగ్ధం
రాజమహేంద్రవరం క్రైం :
మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక జండా పంజా రోడ్డులోని మణప్పురం గోల్ లోన్ బ్రాంచిలో ఆదివారం రాత్రి షార్ట్‌సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ అఫీసర్ పార్థసారధి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని, రెండు అగ్నిమాపక వాహనాల సాయంతో మంటలను అదుపు చేశారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, మొత్తం పొగ వ్యాపించడంతో ఎంత నష్టం వాటిల్లిందో అంచనాకు రాలేకపోతున్నారు. సంస్థలో పని చేసే సిబ్బంది మాత్రం రూ.3 కోట్లకు పైగా రుణాలకు సంబంధించిన లోన్ పత్రాలు కాలిపోయి ఉంటాయని చెబుతున్నారు. బంగారానికి సంబంధించి ప్రత్యేక లాకర్ ఉండడం వల్ల అవి భద్రంగా ఉంటాయని భావిస్తున్నారు. మణప్పురం గోల్డ్ లోన్ సంస్థ మేనేజర్ గణేష్ ఆదివారం సెలవు కావడంతో ఊరు వెళ్లారు. దీనివల్ల ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేయలేకపోతున్నారు. ఈ భవనంలోని పైఅంతస్తులో ఒక కుటుంబం నివసిస్తోంది. రెండో అంతస్తులో ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. కింద పలు షాపులు నిర్వహిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ ఎస్సై రామ్మోహన్‌రావు, ఏజీఎస్ పార్టీ సిబ్బంది పరిస్థితిని అదుపు చేశారు.
Advertisement
Advertisement