వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు | first festival celebrations touches sky | Sakshi
Sakshi News home page

వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు

Published Sat, Jul 16 2016 8:29 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు

వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు

నారాయణపేట రూరల్‌ : ఆషాఢ శుద్ధ ఏకాదశిని నారాయణపేట మండల ప్రజలు వైభవోపేతంగా నిర్వహించుకున్నారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం వైష్ణవ ఆలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజామునే స్నానాలు చేసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సరాఫ్‌బజార్‌ పాండురంగ దేవాలయం, బాలాజీ మందిర్‌లలో స్వామి వారికి అభిషేకం, బిల్వార్చన, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకుని ఉపవాసదీక్షలు చేపట్టారు. శనివారం ద్వాదశి సందర్భంగా అన్నదానం చేపట్టనున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గౌతమి, రఘురామయ్యగౌడ్, ఆలయ కమిటీ సభ్యులు జ్యోతిర్నాత్, శ్రీకిషన్‌లాహోటీ, బన్సిలాల్, దినేష్‌లాహోటీ, తమ్మలిరాము, బాబురావు, బన్సికుమార్, అంబాజీరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement