జడ్జి సంతకం ఫోర్జరీ..
నలుగురు నిందితుల అరెస్టు
డాబాగార్డెన్స్: జిల్లా జడ్జి ఫోర్జరీ సంతకం చేసిన సంఘటనలో ఓ న్యాయవాదితో పాటు ముగ్గురు కటకటాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాణిపేటకు చెందిన అక్కయ్యమ్మ, వెంకట్రావు, రేఖలకు కొంత స్థలం ఉంది. ఈ స్థలానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. న్యాయవాది కె.శ్రీనివాస్, అక్కయ్యమ్మ, వెంకట్రావు, రేఖ జడ్జి సంతకాన్ని ఫోర్జరీ చేసి తీర్పు వారికి అనుకూలంగా వచ్చిందని రూరల్ ఎమ్మార్వో శంకరరావుకు చూపించారు.
తీర్పు కాపీని ఎమ్మార్వో పరిశీలించి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఆ కాపీని పరిశీలించి జడ్జి ఫోర్జరీ సంతకాన్ని గుర్తించి ఆ నలుగుర్ని టూటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.