ప్రకృతి వ్యవసాయంపై రైతుల ఆసక్తి | formars interested in natural cultivation | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంపై రైతుల ఆసక్తి

Published Fri, Sep 16 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి కనబరచడం అభినందనీయమని ఆత్మ జిల్లా ప్రాజెక్టు డైరెక్టరు వై.ఆనందమయి అన్నారు. శుక్రవారం దెందులూరు మండల పరిషత్‌ కార్యాలయంలో దెందులూరు ఏఎంసీ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి రైతులకు అవగాహన సమావేశం ఏలూరు ఏడీఏ కె.వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

దెందులూరు: రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి కనబరచడం అభినందనీయమని ఆత్మ జిల్లా ప్రాజెక్టు డైరెక్టరు వై.ఆనందమయి అన్నారు. శుక్రవారం దెందులూరు మండల పరిషత్‌ కార్యాలయంలో దెందులూరు ఏఎంసీ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి రైతులకు అవగాహన సమావేశం ఏలూరు ఏడీఏ కె.వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పీడీ మాట్లాడుతూ రైతులు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతుల బలోపేతం, సంక్షేమం, అధిక దిగుబడులు వ్యాధుల నిర్మూలన లక్ష్యంగా చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వరి సాగు చేస్తున్న ఒక్కొక్క ఎకరానికి రూ.2వేలు చొప్పున ఆరుగురికి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డీపీడీ  విజిఎస్‌ఈ హరి, ఏఈవో వై.నాయుడు, ఆత్మ ఏపీఎం టి.స్వర్ణలత, మూడు మండలాల రైతులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement