నలుగురు బీటర్లకు జిల్లా బహిష్కరణ | Four beater District Expulsion | Sakshi
Sakshi News home page

నలుగురు బీటర్లకు జిల్లా బహిష్కరణ

Published Sat, Dec 17 2016 11:27 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Four beater District Expulsion

అనంతపురం సెంట్రల్‌ : నలుగురు మట్కా బీటర్లను జిల్లా నుంచి బహిష్కరించినట్లు అనంతపురం వ¯ŒSటౌ¯ŒS సీఐ రాఘవ¯ŒS విలేకరులకు శనివారం తెలిపారు. స్థానిక పాతూరులోకొన్నేâýæ్ల నుంచి నీరుగంటి వీధికి చెందిన షేక్‌ మహబూబ్‌బాషా అలియాస్‌ నీలం బాషా, మున్నానగర్‌కు చెందిన దూదేకుల బాబు, వేణుగోపాల్‌ నగర్‌కు చెందిన పోతుల శంకర్, గుంతకల్లుకు చెందిన ఊబగొండ్ల ఎర్రిస్వామి మట్కా నిర్వహించేవారన్నారు. వారిపై అనేక కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

గంజాయిని విక్రయిస్తూ కూడా పట్టుబడ్డారని వివరించారు. అయినా వారిలో మార్పురాకపోవడంతో ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు పైన పేర్కొన్న నలుగురినీ జిల్లా నుంచి బష్కరించినట్లు తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్‌ కోర్టు ఎదుట నిందితుల రికార్డులను సమరించచగా ఆరు నెలల పాటు వారిని జిల్లా నుంచి బహిష్కరిస్తూ తీర్పు చెప్పారన్నారు. 48 గంటల్లో ఊరు వదిలిపోవాలని సూచించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement